క్యూ2 వృద్ధి 5.3%: మూడీస్
న్యూఢిల్లీ: భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో(2014-15, జూలై-సెప్టెంబర్) 5.3 శాతమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు 2014-15 తొలి త్రైమాసికంలో 5.7 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో మూడీస్ తాజా అంచనాలను వెలువరించింది. 2013-14 రెండవ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతం. తాజా సంస్కరణల అమలు తగిన వృద్ధి రూపంలో ప్రతిబింబించడానికి మరికొంత సమయం పడుతుందని కూడా మూడీస్ పేర్కొంది.