rating agency
-
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన రేటింగ్ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల చెలరేగిన నేరాభియోగాల కారణంగా భవిష్యత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలపై ప్రభావం పడుతుందని భావించి ఆయా సంస్థల రేటింగ్‌ను ‘బీబీబీ-’(ప్రతికూలం)గా మార్చింది.పాలనా ధోరణులపై అనుమానంఅదానీ గ్రూప్‌పై గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా అమెరికా న్యాయశాఖ, యూఎస్ ఎస్ఈసీ కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ సంస్థల పాలనా ధోరణులపై అనుమానం వ్యక్తమవుతుంది. కంపెనీపై ఇలా వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చనీ ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. కంపెనీ వృద్ధికి సాయం చేసిన రుణదాతల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కంపెనీకి నిధుల సమీకరణ సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది.ఇదీ చదవండి: ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలుఎక్స్ఛేంజీల రియాక్షన్ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూప్‌పై వస్తున్న నేరారోపణలపై వివరణ కోరాయి. అదానీపై అమెరికా న్యాయశాఖతోపాటు యూఎస్ ఎస్ఈసీలో లంచం కేసు నమోదు అవ్వడంతోపాటు, ఇటీవల కెన్యా అదానీ గ్రూప్ కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దాంతో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. సెబీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
అంచనాలకు మించి భారత్ పురోగతి
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2023–24) స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా క్రితం 6.2 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. కమోడిటీల ద్రవ్యోల్బణం ‘మైనస్’లో ఉండడం, ఏప్రిల్–సెపె్టంబర్ ఆరు నెలల జీడీపీ గణాంకాల్లో చక్కటి పురోగతి, అక్టోబర్–డిసెంబర్ మధ్య కూడా సానుకూల వృద్ధి గణాంకాలు వెలువడే అవకాశాలు తమ అంచనాల తాజా పెంపునకు కారణమని ఇక్రా పేర్కొంది. ‘‘2023 అక్టోబర్–నవంబర్ ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ 11.3 శాతం పెరిగింది. జూలై, ఆగస్టు, సెపె్టంబర్ (క్యూ2)లో నమోదయిన 9.5 శాతం కన్నా ఇది అధికం. పండుగల నేపథ్యంలో అధిక ఫ్రీక్వెన్సీ నాన్–అగ్రి ఇండికేటర్లలో నమోదయిన ఈ పెరుగుదల పూర్తి సానుకూలమైంది. ఈ నేపథ్యంలో క్యూ3తో కూడా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నాం’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. సానుకూల పరిస్థితులు... చైనాకు సంబంధించి డిమాండ్ తగ్గే అవకాశాలు, ముడి చమురు వంటి కీలక కమోడిటీల తగినంత సరఫరాలు, సాధారణ సరఫరా చైన్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండడానికి దోహదపడే అంశంగా ఇక్రా పేర్కొంది. భారత్ ఎకానమీకి సంబంధించి అక్టోబర్, నవంబర్లలో అధిక క్రియాశీలత కనిపించినప్పటికీ, డిసెంబరులో ప్రారంభంలో మిశ్రమ పోకడలు కనిపించాయని ఇక్రా పేర్కొంది. విద్యుత్ డిమాండ్ పెరుగుదల నెమ్మదించిందని, డీజిల్ డిమాండ్ క్షీణతలోకి జారిందని పేర్కొన్న ఇక్రా, రోజువారీ వాహనాల రిజి్రస్టేషన్లు మ్రాతం పెరిగినట్లు తెలిపింది. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. -
ఇక్రా రేటింగ్స్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది. క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్‌నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. -
మార్కెట్లపై ‘ఫిచ్’ పంచ్
ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి. విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు. రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలు ఎందుకంటే ► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది. ► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. ► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. -
క్యూ1లో ముడివ్యయాల ఎఫెక్ట్
ముంబై: దేశీ కార్పొరేట్లకు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ముడివ్యయాలు భారంగా పరిణమించినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. దీంతో ఏప్రిల్–జూన్(క్యూ1)లో నిర్వహణా లాభ మార్జిన్లు సగటున 2.13 శాతంమేర క్షీణించినట్లు తెలియజేసింది. వెరసి క్యూ1లో ఆదాయం 39 శాతం జంప్‌చేసినప్పటికీ ముడివ్యయాల ద్రవ్యోల్బణ ప్రభావంతో ఇబిటా మార్జిన్లు 17.7 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. కమోడిటీ, ఇంధన ధరల పెరుగుదలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడంతో ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలియజేసింది. అయితే వీటి కారణంగా లాభదాయకత నీరసించినట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగ సంస్థలను మినహాయించి 620 లిస్టెడ్ కంపెనీలను నివేదికకు ఇక్రా పరిగణించింది. నివేదిక ప్రకారం..యుద్ధం ప్రభావం రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో ఎదురైన సరఫరా సవాళ్లు సైతం మార్జిన్లు మందగించేందుకు కారణమయ్యాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్జిన్లు పుంజుకునే వీలుంది. గతేడాది(2021–22) తొలి క్వార్టర్లో కరోనా మహామ్మారి రెండో వేవ్ కారణంగా అమ్మకాలు దెబ్బతినడం.. ఈ ఏడాది క్యూ1 అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసింది. పలు రంగాలలో ప్రొడక్టుల ధరల పెంపు సైతం దీనికి జత కలిసింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని రంగాలకు డిమాండ్ తగ్గింది. ఇది ఇటు అమ్మకాలు, అటు లాభదాయకతకు కొంతమేర చెక్ పెట్టాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. హోటళ్లు, విద్యుత్, రిటైల్, చమురు– గ్యాస్ విభాగాలు క్యూ1లో ఊపందుకోగా.. ఎయిర్‌లైన్స్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ వెనకడుగు వేశాయి. పలు ప్రొడక్టులకు ధరల పెంపు చేపట్టిన ఎఫ్ఎంసీజీ రంగంలో ఓ మాదిరి వృద్ధి నమోదైంది. -
బంగారు రుణ ఎన్బీఎఫ్సీలు జిగేల్!
ముంబై: బ్యాంకుల నుంచి పోటీ తీవ్రతరం అవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరింత దూకుడుగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లిక్విడిటీపరంగా సురక్షితమైన బంగారం రుణాలపై అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం చాలా మటుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యంకులు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు బ్యాంకుల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 2021 ఆరి్థక సంవత్సరంలో 89 శాతం ఎగిసి రూ. 60,700 కోట్లకు, ఆ తర్వాత 2022 ఆరి్థక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ. 70,900 కోట్లకు చేరినట్లు వివరించింది. ‘బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, పసిడి ధరల్లో భారీ పెరుగుదల అవకాశాలు (గతంలో చూసినంతగా) కనిపించకపోతుండటంతో ఎన్బీఎఫ్సీలు.. ముఖ్యంగా భారీ స్థాయిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఉన్నవి.. తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దూకుడుగా వ్యూహాలు అమలు చేయవచ్చు. కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చు‘ అని ఏజెన్సీ పేర్కొంది. మార్జిన్ల విషయంలో రాజీపడినా సరే.. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లను పోగొట్టుకోకుండా వీలైన ప్రయత్నాలు అన్నీ చేయ నున్నాయి. అవసరమైతే భారీ రుణాలపై మార్జిన్లను తగ్గించుకోవడంతో పాటు నిబంధనలను సరళతరం చేయడం మొదలైనవి చేసే అవకాశం ఉంది. దీని వల్ల నిర్వహణ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కోవిడ్ కష్టాలతో వేలం.. కరోనా వైరస్ కష్టకాలం కారణంగా బంగారం రుణ గ్రహీతలకు ఆరి్థక ఇబ్బందులు నెలకొనడం, గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంలో పసిడి ధరలు 10 శాతం మేర కరెక్షన్కు లోనవడం తదితర అంశాల కారణంగా ఎన్బీఎఫ్సీలు ఏప్రిల్–డిసెంబర్ కాలంలో తనఖా పెట్టిన బంగారాన్ని భారీ స్థాయిలో వేలం వేయాల్సి వచ్చింది. అక్టోబర్ నుంచి పసిడి ధరలు కాస్త స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేలం విషయంలో పరిస్థితులు కాస్త చక్కబడగలవని నివేదిక అభిప్రాయపడింది. ఎన్బీఎఫ్సీల్లో పసిడి వేలం భారీగా పెరిగినప్పటికీ.. బ్యాంకుల్లో మాత్రం దీని తీవ్రత అంతగా నమోదు కాలేదని పేర్కొంది. బంగారం విలువపై బ్యాంకులు ఇచ్చే రుణం (ఎల్టీవీ) నిష్పత్తి ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. -
వెహికల్ సేఫ్టీ కోసం స్వదేశీ ఎన్సీఏపీ రేటింగ్ అవసరం: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కొత్త వాహనాల భద్రతను తనిఖీ చేయడానికి, ప్రపంచ రేటింగ్ సంస్థల నిబందనలకు అనుగుణంగా భద్రత నాణ్యత విషయంలో వాహనాలకు స్టార్ రేటింగ్స్ కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ) వ్యవస్థను తీసుకొస్తుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. అన్ని ప్యాసింజర్ వాహనాలకు ప్రభుత్వం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేస్తుందని ఆయన అన్నారు. త్రీ పాయింట్ సీట్ బెల్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్(ఏఈబీఎస్) సహా ఇతర ఫీచర్లు కూడా వాహనాలకు తప్పనిసరి ఫీచర్లుగా ఉండబోతున్నాయని ఆయన తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్(పీఎల్ఐ) పథకం వంటి చర్యలు ఎయిర్ బ్యాగుల దేశీయ ఉత్పత్తిని పెంచాయని, ఫలితంగా ధరలు తగ్గాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల జీడీపీకి 3.1% నష్టం వాటిల్లుతుందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక యువత తగ్గేదె లే!) -
మెరుగవుతున్న వ్యాపార కార్యకలాపాలు: నోమురా
ముంబై: వ్యాపార కార్యకలాపాలు క్రమంగా మెరుగవుతున్నాయి. మహమ్మారికి ముందుతో పోలిస్తే గత వారం 14 శాతం పాయింట్ల అధిక స్థాయికి చేరుకున్నాయని నోమురా ఇండియా వ్యాపార పునఃప్రారంభ సూచిక నివేదిక వెల్లడించింది. ఆదివారంతో ముగిసిన వారంలో సూచిక 114 పాయింట్లు నమోదైందని, అంత క్రితం వారం ఇది 110.3 పాయింట్లుగా ఉందని వివరించింది. గూగుల్ వర్క్‌ప్లేస్ మొబిలిటీ 18.1 శాతం పాయింట్లు పెరిగితే, రిటైల్, వినోదం 3.3 శాతం పాయింట్లు పడిపోయింది. ఇంధన సంక్షోభం సడలుతోందని, మరోవైపు వాహన రంగంలో సరఫరా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొంది. వృద్ధి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయని నోమురా వెల్లడించింది. -
BrickWork Ratings : జీడీపీలో వృద్ధి.. 10 నుంచి 10.5 శాతం నమోదు
ముంబై: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో తొలుత 9 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనిని ఎగువముఖంగా 10 నుంచి 10.5 శాతం శ్రేణికి సవరించింది. అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నాయని సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వృద్ధి 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. మూడవ వేవ్ రూపంలో వైరస్ తీవ్రత లేనట్లయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో కూడా భారీ ఆర్థిక వృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వ్యాక్సినేషన్లో సాధించిన పురోగతి కారణంగా వల్ల ‘మూడవ వేవ్’ వచ్చినా, దానివల్ల ఏర్పడే ప్రతికూలతలు కూడా పరిమితంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని బ్రిక్‌వర్క్ రేటింగ్ వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఎకానమీకి కొన్ని ప్రతికూలతలు ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. పెరుగుతున్న ముడి చమురు, ఖనిజ ఉత్పత్తులు, ముడిసరుకు, సరుకు రవాణా ధరలు, సెమీకండక్టర్ సరఫరాలో అంతరాయాలు, బొగ్గు సరఫరా కొరత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆయా సవాళ్లు వృద్ధి వేగాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. -
క్యూ2లో ఆదాయాలు 20% అప్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో దేశీ కంపెనీల ఆదాయం సగటున 18–20 శాతం స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా అంచనా వేసింది. గతేడాది క్యూ2(జులై–సెపె్టంబర్)తో పోలిస్తే ప్రధానంగా అమ్మకాల పరిమాణం పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా అధిక కమోడిటీ ధరలు సైతం మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అయితే ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా నిర్వహణ లాభ మార్జిన్లకు చెక్ పడనున్నట్లు తెలియజేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన కంపెనీలు కష్టకాలంలోనూ నెగ్గుకురానున్నట్లు పేర్కొంది. వేతనాల్లో కోతలు తదితర చర్యల ద్వారా వ్యయ నియంత్రణలను పాటించడంతో డిమాండ్ క్షీణించినప్పటికీ బిజినెస్‌లను రక్షించుకోగలగినట్లు వివరించింది. రంగాలవారీగా.. కోవిడ్–19 ప్రభావంతో గతేడాది(2020–21) క్యూ2లో పలు కంపెనీల అమ్మకాలు తిరోగమించిన సంగతి తెలిసిందే. స్థానిక లాక్డౌన్లు, నెమ్మదించిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంకాగా.. లోబేస్ రీత్యా ఈ ఏడాది క్యూ2లో వివిధ రంగాల కంపెనీలు ఆదాయాల్లో వృద్ధిని చూపగలవని క్రిసిల్ తెలియజేసింది. ఫైనాన్షియల్ సరీ్వసులు, చమురును మినహాయించి 40 రంగాలకు చెందిన 300 కంపెనీలను క్రిసిల్ అంచనాలకు తీసుకుంది. వీటిలో 24 కంపెనీలు 20 శాతంపైగా వృద్ధిని సాధించగలవని అంచనా వేసింది. అయితే స్టీల్ ప్రొడక్టులు, అల్యూమినియం తదితర కమోడిటీ సంబంధిత రంగ కంపెనీలు మాత్రం 15–17 శాతం వృద్ధిని అందుకోగలవని పేర్కొంది. త్రైమాసికవారీగా క్రిసిల్ నివేదిక ప్రకారం త్రైమాసిక ప్రాతిపదికన అంటే ఈ క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో ఆదాయాల్లో 8–10 శాతం పురోగతి నమోదుకానుంది. క్యూ1లో కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో కంపెనీల ఆదాయం 30–32% జంప్‌చేసి, మొత్తం రూ. 15.8 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. రంగాల వారీగా.. రంగాలవారీగా చూస్తే అత్యవసరంకాని వినియోగ వస్తువులు అత్యధిక వృద్ధిని సాధించనుండగా.. టెలికం సైతం ఇదే బాటలో నడవనుంది. కాగా.. కేవలం అల్యూమినియం తయారీ కంపెనీలు 45–50 శాతం అధిక ఆదాయాన్ని సముపార్జించే వీలుంది. ఇందుకు ప్రధానంగా దేశీయంగా ధరలు 40 శాతం జంప్‌చేయడం, అమ్మకాల పరిమాణం 5–7 శాతం చొప్పున పుంజుకోవడం కారణంకానున్నాయి. ఇదే విధంగా స్టీల్ తయారీ కంపెనీలు సైతం 40 శాతం పురోగతిని సాధించే అవకాశముంది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు రెండంకెల వృద్ధిని అందుకోవచ్చు. చిప్స్ కొరత నెలకొనడంతో ఆటో పరిశ్రమలో ఆదాయాలు 4–6 శాతానికి పరిమితకానున్నాయి. -
క్యూ2లో పెరగనున్న సెక్యూరిటైజేషన్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల సెక్యూరిటైజేషన్ భారీగా ఎగసే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. క్యూ2(జులై–సెపె్టంబర్)లో సెక్యూరిటైజేషన్ 45 శాతం జంప్‌చేయనున్నట్లు ఇక్రా రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వీటి విలువ రూ. 25,000 కోట్లను తాకవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 17,200 కోట్ల విలువైన సెక్యూరిటైజేషన్ నమోదుకాగా.. గతేడాది(2020–21) క్యూ2లో ఈ విలువ రూ. 15,200 కోట్లకు చేరింది. ఒకేతరహా ఇల్లిక్విడ్ ఫైనాన్షియల్ అసెట్స్‌ను క్రోడీకరించి మార్కెట్లో విక్రయించగల సెక్యూరిటీలుగా రీప్యాకేజింగ్ చేయడాన్ని సెక్యూరిటైజేషన్‌గా పేర్కొనే సంగతి తెలిసిందే. వీటిని సంబంధిత ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆర్బీఐ తీసుకువచి్చన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సెక్యూరిటైజేషన్ మార్కెట్ విస్తరించనున్నట్లు ఇక్రా తెలియజేసింది. దీంతో గత నెలలో పరిమాణరీత్యా 60 శాతం సెక్యూరిటైజేషన్ నమోదైనట్లు వెల్లడించింది. తొలి అర్ధభాగంలో... సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ. 42,200 కోట్ల సెక్యూరిటైజేషన్‌కు వీలున్నట్లు ఇక్రా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ. 22,700 కోట్లు మాత్రమేకాగా.. ఈ ఏడాది సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ. 1.2 లక్షల కోట్లను తాకనున్నట్లు తాజాగా అభిప్రాయపడింది. ఇది 40% అధికమని తెలియజేసింది. -
రేటింగ్ దెబ్బ- యాక్సిస్- బజాజ్ ఫైనాన్స్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వారాంతాన ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్.. బజాజ్ ఫైనాన్స్‌ల క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఎస్అండ్పీ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ బాటలో ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌ల రుణ నాణ్యత క్షీణించడంతోపాటు.. క్రెడిట్ వ్యయాలు పెరిగే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. ఫలితంగా లాభదాయకత క్షీణించనున్నట్లు అంచనా వేసింది. బాండ్లను BB కేటగిరీకి సవరిస్తే ‘జంక్’ స్థాయి రేటింగ్‌కు చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల(ఎకనమిక్ రిస్కులు) నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ అభిప్రాయపడింది. నేలచూపులో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4.5 శాతం పతనమై రూ. 406 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 402 వరకూ జారింది. ఇక బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం నీరసించి రూ. 2793 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2770 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా.. గత నెల రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ షేరు 25 శాతం లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్ 59 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
స్టేబుల్ నుంచి నెగిటివ్‌కు ఫిచ్ రేటింగ్
దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను విదేశీ దిగ్గజం ఫిచ్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన స్టేబుల్(స్థిరత్వం) రేటింగ్‌ను నెగిటివ్(ప్రతికూలం)కు సవరించింది. ఇదివరకు ప్రకటించిన లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 5 శాతం ప్రతికూల(మైనస్) వృద్ధిని నమోదు చేయనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డవున్లు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జీడీపీ 9.5 శాతం పురోభివృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ఈ ఏడాది మైనస్ వృద్ధి నమోదుకానుండటం(లోబేస్) సహకరించే వీలున్నట్లు తెలియజేసింది. 6-7 శాతం వృద్ధి! లాక్డవున్లు నెమ్మదిగా సరళీకరిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటం రిస్కులను పెంచుతున్నట్లు ఫిచ్ పేర్కొంది. దీంతో ఇండియా గతంలో వేసిన 6-7 శాతం ఆర్థిక వృద్ధిని అందుకునేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వృద్ధి అవకాశాలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ రుణ భారం పెరగడంతో సవాళ్లు ఎదురుకానున్నట్లు వివరించింది. కాగా.. ప్రస్తుతం దేశ సావరిన్ రేటింగ్స్‌కు విదేశీ రేటింగ్ దిగ్గజాలన్నీ లోయస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను ప్రకటించినట్లయ్యిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నెగిటివ్ ఔట్‌లుక్‌ను ప్రకటించగా.. స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చింది. -
పదేళ్లలో రూ.110 లక్షల కోట్లకు పెరగాలి
న్యూఢిల్లీ: భారత్ నిర్దేశించుకున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలను సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే దశాబ్దంలో (2021–2030) ఇన్ఫ్రాపై వ్యయాలను రూ. 110 లక్షల కోట్లకు పెంచాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఇన్ఫ్రాపై చేసే మొత్తం రూ. 77 లక్షల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు 41 శాతం రాష్ట్రాలదే ఉండనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్‌బుక్ 2019 పుస్తకావిష్కరణ సందర్భంగా క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. రూ.235 లక్షల కోట్లు అవసరం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రాబోయే దశాబ్దంలో రూ. 235 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసింది. అలాగే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సగటున 7.5 శాతం ఉండాలని, జీడీపీలో 6 శాతం పైగా ఇన్ఫ్రా వ్యయాలు ఉండాలని పేర్కొంది. రాష్ట్రాలు చేసే వ్యయాల్లో మూడింట రెండొంతుల భాగం .. రవాణా, సాగునీటి సదుపాయం, ఇంధనం వంటి అయిదు రంగాలపైనే ఉంటోంది. ఇన్ఫ్రా పెట్టుబడుల్లో రాష్ట్రాల వాటా సుమారు 50 శాతం స్థాయికి చేరాల్సిన అవసరం ఉందని క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ ప్రెసిడెంట్ సమీర్ భాటియా తెలిపారు. పెట్టుబడుల తీరు ఆధారంగా రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా క్రిసిల్ వర్గీకరించింది. ముందు వరుసలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా.. మధ్య స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా ఉన్నాయి. మధ్య స్థాయిలో ఉన్న రాష్ట్రాలు.. నిలకడగా పెట్టుబడులు కొనుసాగించడం ద్వారా వృద్ధి సారథులుగా ఎదిగే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఎదుగుతున్న రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లపై రుణభారం పెరుగుతున్నందున పెట్టుబడుల సామర్థ్యం పరిమితంగా ఉండొచ్చని తెలిపింది. -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
పరిశ్రమ వర్గాలతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. -
‘కొలువుల్లేని వృద్ధి’ వాస్తవమే
ముంబై: ఒకవైపు వృద్ధి పెరుగుతోందంటున్నా... మరోవైపు ఉద్యోగాలు పెరగటం లేదన్న ఆందోళనలను నిజం చేస్తూ కేర్ రేటింగ్ ఏజెన్సీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వృద్ధి ఊపందుకుంటున్నా.. ఉద్యోగాలు మాత్రం ఉండటంలేదని, ఇది ‘చాలా ఆందోళనకరమైన అంశం’ అని పేర్కొంది. ఇన్‌ఫ్రాకి ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు కొంత తోడ్పాటు అందించగలిగేవే అయినా.. ప్రభుత్వం క్రియాశీలకంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు సూచిస్తాయని కేర్ అభిప్రాయపడింది. ‘ఆర్థిక వృద్ధి అంత వేగంగా ఉద్యోగాల కల్పన కూడా పెరగటం లేదు. దాన్ని ఇది అందుకోలేకపోతోంది’’ అని వివరించింది. మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నా... ఉద్యోగాల మార్కెట్లో వృద్ధి ఉండకపోవడాన్ని ఉద్యోగరహిత వృద్ధిగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్‌లో అత్యధికంగా ఉపాధి.. ఇటీవలి కాలంలో ఉపాధికి సంబంధించి రంగాలవారీగా పరిస్థితి చూస్తే.. సేవల రంగం కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఉద్యోగాల కల్పనలో తయారీ రంగం విఫలమైందని కేర్ తెలిపింది. అయితే, బ్యాంకింగ్, ఐటీ, రిటైలింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుండగా.. మైనింగ్, విద్యుత్, టెలికం రంగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వివరించింది. బ్యాంకింగ్‌లో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఈ విషయంలో దీని వాటా 21.3%గా ఉందని, ఐటీ, మైనింగ్, హెల్త్‌కేర్, టెక్స్టైల్స్ వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయని కేర్ తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 1,473 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 5.01 మిలియన్లుగా ఉండగా.. 2017లో ఇది అత్యంత స్వల్పంగా 1% వృద్ధితో 5.18 మిలియన్లకు పెరిగి నట్లు తెలిపింది. అదే ఆర్థిక వృద్ధి 7% నమోదైనట్లు వివరించింది. సగటు జీతభత్యాలు రూ. 7.13 లక్షల నుంచి రూ. 8.35 లక్షలకు పెరిగినట్లు పేర్కొంది. -
బ్రిక్స్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్
వాషింగ్టన్ : ఒక దేశానికి మరో దేశం ఆర్థిక సహాయార్థం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ దేశాలు, బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూట్ ను, రేటింగ్ ఏజెన్సీను స్థాపించుకోనున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ అభివృద్ధి బ్యాంక్ ను పూర్తిగా కార్యరూపంలోకి తేవడానికి ఈ ఇన్ స్టిట్యూట్, రేటింగ్ ఏజెన్సీ తోడ్పడేలా చేయాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన వార్షిక స్ప్రింగ్ సమిట్ లో బ్రిక్స్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యారు. బ్రిక్స్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై టెక్నికల్ గ్రూప్ పూర్తిగా విశ్లేషించనుంది. వారి నివేదికను వచ్చే సమావేశంలో బ్రిక్స్ ఆర్థికమంత్రులకు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సమర్పించనున్నారు. ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాలు షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటుచేసుకున్నాయి. అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లతో 2015 జూలై నుంచి ఈ బ్యాంకు పూర్తి కార్యాచరణలోకి వచ్చింది. -
సంస్కరణల అమలు కీలకం
రేటింగ్ పెంపుపై కేంద్రానికి మూడీస్ స్పష్టీకరణ - ఆర్థిక పరిస్థితులపట్ల సానుకూలత న్యూఢిల్లీ: సంస్కరణలు అమలయితేనే రేటింగ్ అప్‌గ్రేడ్ అవకాశం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేశానికి పెట్టుబడులు, రుణాలు వంటి అంశాలు మూడీస్, ఫిచ్, ఎస్అండ్పీ వంటి ప్రముఖ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. 2004 నుంచీ ఇదే రేటింగ్‌ను భారత్‌కు కొనసాగిస్తోంది. ఈ రేటింగ్ ‘జంక్’ రేటింగ్‌కు ఒక మెట్టు మాత్రమే పైనుంది. పెట్టుబడులకు సంబంధించి ‘బీఏఏ 3’ ‘దిగువస్థాయి’ గ్రేడ్‌ను సూచిస్తోంది. ద్రవ్యోల్బణం వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలు వచ్చే ఏడాదీ సానుకూల రీతిలో ఉంటాయని భారత్ ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన విశ్లేషణా పత్రంలో పేర్కొంది. ద్రవ్యోల్బణంసహా ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలు సైతం రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగాల్సిన అవసరం ఉందనీ నివేదిక పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... - పాలసీ సంస్కరణల ప్రక్రియ మందగమనం, ఆయా అంశాల్లో వెనుకంజ, బ్యాంకింగ్ రంగం బలహీనంగా కొనసాగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే, రేటింగ్ అవుట్‌లుక్ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. - దిగువ స్థాయిలో చమురు ధరలు, పటిష్ట ద్రవ్య-పరపతి విధానాలు స్థూల ఆర్థిక వ్యవస్థ సమతౌల్యతకు దోహదపడతాయి. కమోడిటీ దిగుమతిదారుగా దేశం ప్రస్తుతానికి చక్కటి ప్రయోజనాలను పొందగలుగుతోంది. - అంతర్జాతీయంగా కొన్ని ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినా... దేశీయంగా ఉన్న పటిష్ట డిమాండ్ పరిస్థితులు దేశానికి రక్షణ కవచం - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతం ఉన్నా... ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి. - ప్రైవేటు రంగంలో ప్రత్యేకించి తయారీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు అన్నింటినీ చేస్తోంది. ఇది వృద్ధి రికవరీకి దోహదపడే అంశం. తయారీ రంగం భారీ వృద్ధిలో దేశం విజయవంతమైతే.. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. వ్యవస్థల పటిష్టత అంతంత మాత్రమే! భారత్‌లో పలు వ్యవస్థల పటిష్టత కూడా ఒక మోస్తరుగానే ఉందని (మోడరేట్-మైనస్) మూడీస్ తన నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ శాఖల మధ్య తగిన సమతౌల్య త సహా దేశంలో చక్కటి ప్రజాస్వామ్యం ఉందని పేర్కొంది. వ్యవస్థల పరంగా ఇవి పటిష్టంగా ఉంటే... రెగ్యులేటరీ వాతావరణంలో అనిశ్చితి, సత్వర న్యాయం అందని పరిస్థితి, పలు కుంభకోణాలు, ప్రభుత్వ సేవలు అందడంలో సామర్థ్యలోపం వంటివి బలహీనతలని వివరించింది. పటిష్ట వ్యవస్థలు సైతం పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి తగిన నిర్వహణాపరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని విశ్లేషించింది. -
షాంఘై పతనంతో నష్టాలు
ప్రభావం చూపిన మూడీస్ జీడీపీ అంచనాల తగ్గింపు - 47 పాయింట్ల నష్టంతో 27,832కు సెన్సెక్స్ - 11 పాయింట్లు క్షీణించి 8,467కు నిఫ్టీ భారత జీడీపీ అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 7 శాతానికి తగ్గించడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ 6 శాతం పతనం కూడా తోడవడంతో వరుసగా రెండోరోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 27,832 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8,467 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇప్పటివరకూ సగటు వర్షపాతం కంటే 10 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయన్న వాతావారణ శాఖ నివేదిక ప్రభావం చూపింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో చైనా షేర్ల పతనం కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభాలు కొనసాగుతున్నాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ఆగష్టు 25 నుంచి పెబ్స్ పెన్నార్ ఇష్యూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. పూర్తి బుక్ బిల్డింగ్ విధానంలో జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ధరను రూ. 170 - 178గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కొత్తగా రూ. 58 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడంతోపాటు, 55.16 లక్షల షేర్లను విక్రయించనున్నారు. -
వర్షాభావం భారత్‌కు ఇబ్బందే!
రేటింగ్‌కు ప్రతికూలం: మూడీస్ న్యూఢిల్లీ: రుతుపవనాల బలహీనత భారత్‌కు పెద్ద ఇబ్బందేనని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ విశ్లేషించింది. ఇది దేశానికి రేటింగ్‌కు ప్రతికూలంగా(క్రెడిట్ నెగటివ్) మారే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే వ్యవసాయ రంగం (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 17 శాతం) దెబ్బతింటుందని, ఆహార ధరలు ప్రపంచ సగటుకన్నా పెరుగుతాయని, సబ్సిడీలు, సహాయక చర్యల భారంతో ప్రభుత్వ లోటు అంశాలు క్లిష్టమవుతాయని మూడీస్ నివేదిక విశ్లేషించింది. వర్షాభావ అంచనాల నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు. - వర్షాభావం వల్ల ఏ స్థాయిలో ప్రతికూల ఫలితాలు ఉంటాయన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వర్షాభావం ఏఏ ప్రాంతాల్లో ఉంది.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వంటి అంశాలు ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. - సగటు కుటుంబ వ్యయంలో 50% ఆహార పదార్థాలపైనే వెచ్చించడం జరుగుతుంది. అధిక ధరలు కుటుంబ బడ్జెట్‌ను భారీగా పెంచేస్తాయి. ఇది స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. - ఆహార ధరలు పెరిగినందువల్లే, భారత్‌లో 2012, 2013లో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని దాటింది. - ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రైవేటు రంగం వినియోగం పెరగడం, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి అంశాల వల్ల రిజర్వ్ బ్యాంక్ 2015లో 75 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. అయితే బలహీన వర్షాభావ పరిస్థితుల్లో మరోదఫా రేటు కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనీ సూచించింది. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ప్రతికూల అంశం. - క్రెడిట్ రేటింగ్ నెగటివ్ అయితే, అంతర్జాతీయం గా రుణ సమీకరణ భారంగా మారడంతోపాటు, రుణాలు పొందడం కూడా క్లిష్టతరమవుతుంది. - గత సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతంకన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. గత ఏడాది సాధారణంకన్నా తక్కువ వర్షపాతం వల్ల ధాన్యం, పత్తి, చమురు గింజల పంటలపై పడింది. గడచిన 50 సంవత్సరాల కాలంలో నమోదయిన వర్షపాతం సగటు- సాధారణ వర్షపాతానికి బెంచ్‌మార్క్. -
క్యూ2 వృద్ధి 5.3%: మూడీస్
న్యూఢిల్లీ: భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో(2014-15, జూలై-సెప్టెంబర్) 5.3 శాతమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు 2014-15 తొలి త్రైమాసికంలో 5.7 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో మూడీస్ తాజా అంచనాలను వెలువరించింది. 2013-14 రెండవ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతం. తాజా సంస్కరణల అమలు తగిన వృద్ధి రూపంలో ప్రతిబింబించడానికి మరికొంత సమయం పడుతుందని కూడా మూడీస్ పేర్కొంది. -
ఏడాదిపాటు స్థిరంగానే భారత్ రేటింగ్
►అప్‌గ్రేడ్ కావాలంటే ద్రవ్యలోటు కట్టడి, ►సంస్కరణలపై మరిన్ని చర్యలు కీలకం ►మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ నివేదిక... ముంబై: భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్ వచ్చే ఏడాదిపాటు స్థిరంగానే కొనసాగవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అయితే, రేటింగ్ అప్‌గ్రేడ్ కావాలంటే మాత్రం ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడి, ప్రభుత్వ వ్యయాల తగ్గింపు, ఇంధన సబ్సిడీల్లో కోత, సంస్కరణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక, సమయానుకూల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు ‘బీఏఏ3’ రేటింగ్‌ను, ఫిచ్ ‘బీబీబీ-’ రేటింగ్‌ను స్టేబుల్(స్థిరం) అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నాయి. అయితే, ఒక్క స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) మాత్రమే ‘బీబీబీ-’ నెగటివ్(ప్రతికూల) అవుట్‌లుక్‌తో రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అతితక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి పడిపోతుంది. దీనివల్ల దేశీ కంపెనీలు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణ చాలా భారంగా మారుతుంది. భారత్ రేటింగ్ రానున్న కాలంలో డౌన్‌గ్రేడ్ అయ్యేందుకు ఏజెన్సీలు ఎలాంటి నిర్దిష్ట కారకాలనూ(ట్రిగ్గర్స్) పేర్కొనలేదు. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగటివ్ నుంచి మళ్లీ స్థిరానికి పెంచాలంటే.. వృద్ధి పుంజుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ముఖ్యమని ఎస్అండ్పీ అంటోంది. రేటింగ్ ఏజెన్సీలతో ఆర్థిక శాఖ సమావేశాలు... భారత్ సావరీన్ రేటింగ్‌ను పెంచాల్సిందిగా కోరేందుకు వచ్చే 2-3 నెలల్లో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం కానుంది. ద్రవ్యలోటు కట్టడికి(ఈ ఏడాది 4.1 శాతం లక్ష్యం) తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను ఈ సందర్భంగా వివరించనుంది. ఆగస్టు 12న ఎస్అండ్పీ, 28న జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(జేసీఆర్ఏ) ప్రతినిధులతో భేటీ కానున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిచ్, మూడీస్ ప్రతినిధులతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సమావేశాలు ఉండొచ్చని ఆయన చెప్పారు. 2016-17కల్లా ద్రవ్యలోటును 3%కి తగ్గించాలనేది కేంద్రం లక్ష్యం. -
ఎగుడు దిగుడు జీడీపీ
పారిశ్రామిక చాంబర్లు, రేటింగ్ ఏజెన్సీల విభిన్న అంచనాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై వివిధ ఆర్థిక, పారిశ్రామిక విశ్లేషణ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో పటిష్ట సంస్కరణలతో సైతం సమీప భవిష్యత్తులో 7-8 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి కష్టమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదిక పేర్కొంది. ఇక పారిశ్రామిక సంస్థ సీఐఐ సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, సంస్కరణలు చేపడితే ఈ ఏడాది 6% పైగా వృద్ధి సాధ్యమని పేర్కొంది. జీడీపీపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం పడుతుందని మరో ప్రధాన పారిశ్రామిక చాంబర్ అసోచామ్ హెచ్చరించింది. అసోచామ్ అంచనా ఎల్‌నినో కారణంగా వర్షపాతం 5%కకుపైగా తగ్గే అవకాశం ఉందని, దాంతో ఈ ఏడాది జీడీపీపై 1.75% ప్రభావం చూపవచ్చని అసోచామ్ నివేదిక తెలిపింది. వర్షపాతం తగ్గడంవల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చనీ, లక్షలాది నైపుణ్య రహిత ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చనీ పేర్కొంది. ‘దేశంలో సాగయ్యే భూమిలో 60 శాతానికిపైగా వర్షమే ఆధారం. వర్షపాతం ఒక శాతం తగ్గితే జీడీపీ 0.35 శాతం క్షీణిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాలు ఐదు శాతం తగ్గితే జీడీపీపై రూ.1.80 లక్షల కోట్ల (1.75 శాతం) మేరకు ప్రభావం ఉంటుంది..’ అని దేశ ఆర్థిక వ్యవస్థపై గురువారం విడుదల చేసిన నివేదికలో అసోచామ్ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించడానికి కొన్ని సూచనలు కూడా చేసింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు నాణ్యమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయాలి. ఈ ప్రాంతాల్లో సాగుచేసే ప్రత్యామ్నాయ పంటలకు ఆకర్షణీయమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉండాలి. అవసరానికి మించి నిల్వచేసిన తృణధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా వీటి ధరలు పెరగకుండా చూడాలి.డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులు స్వేచ్ఛగా రవాణా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు12 సూత్రాల ప్రణాళికను ప్రభుత్వానికి అసోచామ్ అందించింది. వ్యవసాయ బీమా కవరేజీని విస్తరించాలని సూచించింది. పంటల బీమా క్లెయిమ్‌లను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించేలా ద్రవ్య సంస్థలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. మూడీస్ ఏమి చెబుతోందంటే..! కొత్త ప్రభుత్వం పటిష్ట సంస్కరణలు చేపట్టినా ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో ఇప్పట్లో 7-8% స్థాయిలో వృద్ధి బాట పట్టే పరిస్థితి లేదు. మందగమనంలో ఉన్న మూలధన పెట్టుబడులకు తిరిగి ఊపు నివ్వడానికి ‘బ్రెజిల్ తరహాలో’ భారత్ ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయి.రుణం, జీడీపీ నిష్పత్తి ఈ యేడాది 65%కు మించవచ్చు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు ఆకర్షణీయంగానే ఉన్నాయని గ్లోబల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు పేర్కొనవచ్చు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పటిష్ట సంస్కరణల అజెండాను ప్రభుత్వం అనుసరిస్తుందని వారు అంచనా వేస్తుండడమే దీనికి కారణం. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, సంస్కరణల ప్రక్రియను సానుకూలంగా అమలుచేయడంలో సంబంధిత ప్రభుత్వం విఫలమైతే, ఈ అంచనాలు నిరుత్సాహం మిగిల్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో దేశ ఆర్థిక వృద్ధి 4.5-5.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది. 2015లో ఇది 5 నుంచి 6 శాతంగా నమోదుకావచ్చు. 2013 ముగింపునాటికి జీడీపీతో పోల్చితే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 0.3 శాతానికి పడిపోయినప్పటికీ, బంగారంపై దిగుమతుల ఆంక్షలు తొలగించిన తరువాత ఇది ఇదే స్థాయిలో కొనసాగుతుందా? లేదా అన్నది సందేహమే. ద్రవ్యోల్బణం 8 శాతానికి పైగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో... స్వల్పకాలంలో రిజర్వ్ బ్యాంక్‌కు పరపతి విధానాన్ని సరళీకరించి, పాలసీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. పైగా ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. సీఐఐ ఇలా... సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, కేంద్రం క్రమరీతిన సంస్కరణల అజెండాను అనుసరిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని సీఐఐ పేర్కొంది. ఇదే జరగబోతోందని కూడా తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. కొత్త ప్రెసిడెంట్, డీసీఎం శ్రీరామ్ గ్రూప్ హెడ్ అజయ్ ఎస్ శ్రీరామ్ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15లో 6-6.5% శ్రేణిలో, రానున్న కొద్ది సంవత్సరాల్లో 8 శాతానికి పైగా జీడీపీ వృద్ధి రేటును భారత్ అందుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘వృద్ధి వేగం, ఉపాధి కల్పన’పై ఆయన సీఐఐ కార్యాచరణ ప్రణాళికను ఒకదానిని ఆవిష్కరించారు. -
భవిష్యత్తు ఆశావహంగానే: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 4.8 శాతానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయితే, ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చనే ఆశావహధోరణి నేపథ్యంలో... వచ్చే ఏడాది మాత్రం ఆర్థిక వ్యవస్థకు సానులకూల ధోరణి కనబడుతోందని పేర్కొంది. ‘2014-15లో వృద్ధి రేటు 6%గా ఉంటుందని భావిస్తున్నాం. వర్షాలు బాగా కురవడంతో వృద్ధికి చేదోడుగా నిలవడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో దోహదపడనుంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ వృద్ధి పెరుగుదలకు తోడ్పడే అంశాలు. అయితే, ఇవన్నీ గనుక ప్రభావం చూపకపోతే 5% దిగవకు కూడా పడిపోవచ్చు’ అని క్రిసిల్ తన నివేదిక(భారత్ ఆర్థిక అంచనాలు)లో వెల్లడించింది. నివేదికలో ముఖ్యాంశాలివీ... 2014-15లో కొత్త నాయకత్వం, పాత సవాళ్లు అనే ధోరణి ఉంటుంది. ఎన్నికల ఫలితాలనుబట్టి మధ్యకాలికంగా చూస్తే వృద్ధి పెరుగుదల, తగ్గుదల రెండింటికీ అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ అనిశ్చితి ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఫలితాలు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి అనుకూలంగా వస్తే.. సంస్కరణలు మరింత ముందుకెళ్లడంతోపాటు విధానపరమైన అడ్డంకులూ తొలగుతాయి. హంగ్ గనుక ఖాయమైతే సంస్కరణలు కుంటుబడతాయి. దీంతో పెట్టుబడులకు సెంటిమెంట్ దెబ్బతినడమే కాకుండా వృద్ధి కూడా గాడితప్పుతుంది.