అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్‌లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన రేటింగ్ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల చెలరేగిన నేరాభియోగాల కారణంగా భవిష్యత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలపై ప్రభావం పడుతుందని భావించి ఆయా సంస్థల రేటింగ్‌ను ‘బీబీబీ-’(ప్రతికూలం)గా మార్చింది.
పాలనా ధోరణులపై అనుమానం
అదానీ గ్రూప్‌పై గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా అమెరికా న్యాయశాఖ, యూఎస్ ఎస్‌ఈసీ కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ సంస్థల పాలనా ధోరణులపై అనుమానం వ్యక్తమవుతుంది. కంపెనీపై ఇలా వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చనీ ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. కంపెనీ వృద్ధికి సాయం చేసిన రుణదాతల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కంపెనీకి నిధుల సమీకరణ సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది.
ఇదీ చదవండి: ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలు
ఎక్స్ఛేంజీల రియాక్షన్
ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూప్‌పై వస్తున్న నేరారోపణలపై వివరణ కోరాయి. అదానీపై అమెరికా న్యాయశాఖతోపాటు యూఎస్ ఎస్‌ఈసీలో లంచం కేసు నమోదు అవ్వడంతోపాటు, ఇటీవల కెన్యా అదానీ గ్రూప్ కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దాంతో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. సెబీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment