S AND P
-
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన రేటింగ్ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల చెలరేగిన నేరాభియోగాల కారణంగా భవిష్యత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలపై ప్రభావం పడుతుందని భావించి ఆయా సంస్థల రేటింగ్‌ను ‘బీబీబీ-’(ప్రతికూలం)గా మార్చింది.పాలనా ధోరణులపై అనుమానంఅదానీ గ్రూప్‌పై గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా అమెరికా న్యాయశాఖ, యూఎస్ ఎస్ఈసీ కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ సంస్థల పాలనా ధోరణులపై అనుమానం వ్యక్తమవుతుంది. కంపెనీపై ఇలా వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చనీ ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. కంపెనీ వృద్ధికి సాయం చేసిన రుణదాతల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కంపెనీకి నిధుల సమీకరణ సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది.ఇదీ చదవండి: ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలుఎక్స్ఛేంజీల రియాక్షన్ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూప్‌పై వస్తున్న నేరారోపణలపై వివరణ కోరాయి. అదానీపై అమెరికా న్యాయశాఖతోపాటు యూఎస్ ఎస్ఈసీలో లంచం కేసు నమోదు అవ్వడంతోపాటు, ఇటీవల కెన్యా అదానీ గ్రూప్ కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దాంతో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. సెబీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
జూన్‌లో సేవల వేగం డౌన్!
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వేగం మేతో పోల్చితే జూన్‌లో కొంత మందగించింది. మేలో 61.2 వద్ద ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, జూన్‌లో 58.5కు తగ్గింది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50పైన కొనసాగడం వరుసగా 23వ నెల. సూచీ తాజా సమీక్షా నెల్లో కొంత మందగించినప్పటికీ, వ్యవస్థలో డిమాండ్, కొత్త వ్యాపార పరిమాణాలు, ఉపాధి కల్పనకు సంబంధించి సానుకూల వాతావరణమే ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. తయారీ, సేవలు కలిపితే... తయారీ, సేవల రంగాలు కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61.6 వద్ద ఉంటే, మేలో 59.4కు తగ్గింది. ఈ సూచీ కూడా వృద్ధి ధోరణిలోనే పటిష్టంగా ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. భారత పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70% వాటా కలిగిన ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మేలో 31 నెలల గరిష్ట 58.7 స్థాయిని చూసిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జూన్‌లో 57.8కి తగ్గింది. 400 తయారీ సంస్థల పర్చేజింగ్ మేనేజర్లకు పంపిన సమాధానాల ప్రాతిపదికన కదలికలు ఉంటాయి. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్‌లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్‌తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
కరోనా సెకండ్‌వేవ్: దేశీయ బ్యాంకుల కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్-సెప్టెంబర్) కోవిడ్ రెండో దశ ప్రభావంతో ఆర్థిక సంస్థల పనితీరు దెబ్బతిననుంది. దీంతో భారతీయ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కానున్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఈ విషయాలు వెల్లడించింది. ఆర్థిక రికవరీకి కోవిడ్‌పరమైన సమస్యల ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపింది. ఒకవేళ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి.. కొత్తగా లాక్డౌన్లు విధించాల్సి వస్తే మరింత ప్రతికూల పరిస్థితులు తప్పకపోవచ్చని పేర్కొంది. రాబోయే 12–18 నెలల్లో బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండిబాకీలు భారీగా 11–12 శాతం స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ఎస్అండ్పీ తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికపరమైన బలహీన పరిస్థితులు కాస్త ముందుకు జరిగాయని, ఆర్థిక సంస్థలకు సంబంధించి రుణ బాకీల వసూళ్లు.. లోన్ల మంజూరు తగ్గడం రూపంలో ప్రథమార్ధంలోనే ఇది ప్రతిఫలించవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ ఛాబ్రియా తెలిపారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి దేశం క్రమంగా కోలుకునే క్రమంలో దేశీ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కావచ్చని ఆమె పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు నుంచే బ్యాంకులు మొండి బాకీల సమస్యతో సతమతమవుతుండగా.. కోవిడ్ రాకతో పరిస్థితులు కచ్చితంగా మరింత దిగజారాయని తెలిపారు. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) టూరిజం, రియల్టీలో మొండిబాకీలు.. పర్యాటకం, తత్సంబంధ రంగాలు, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్, అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు మొదలైనవి మొండిబాకీల (ఎన్పీఎల్) పెరుగుదలకు కారణం కాగలవని ఎస్అండ్పీ తెలిపింది. అయితే, ఈ రంగాలకు బ్యాంకులు ఒక మోస్తరుగానే రుణాలిచ్చాయని.. కాబట్టి ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది. చిన్న సంస్థలకు లేదా వాణిజ్య వాహనాల కోసం రుణాలతో పోలిస్తే గృహ రుణాలు (ఎఫర్డబుల్ హౌసింగ్ మినహా), బంగారం రుణాలపైనా ప్రభావం తక్కువే ఉండవచ్చని ఎస్అండ్పీ వివరించింది. బ్యాంకుల కన్నా ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీలకే ఇవి ఆందోళనకరంగా ఉండవచ్చని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో నగదు సరఫరా కాస్త పెరగనున్నప్పటికీ.. కొందరు రుణగ్రహీతలు కొండలా పేరుకుపోతున్న అప్పును తీర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని వివరించింది. సెకండ్ వేవ్ వల్ల రెండో విడత రుణాల పునర్వ్యవస్థీకరణ అమలు చేయడం వల్ల మొండిబాకీలను గుర్తించే ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని ఎస్అండ్పీ తెలిపింది. పునర్ వ్యవస్థీకరించిన రుణాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. (Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!) ప్రభుత్వం పైనే భారం.. కోవిడ్ కారణంగా దేశీ ఆర్థిక సంస్థల పనితీరుపై పడే ప్రతికూల ప్రభావాలు తగ్గడమనేది.. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రకటించిన చర్యలు ఎంత సమర్ధమంతంగా అమలవుతాయన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని ఎస్అండ్పీ పేర్కొంది. మరిన్ని కొత్త వేరియంట్లు రావడం, అంచనాల కన్నా తక్కువ స్థాయిలో టీకాలు వేసే అవకాశాలు మొదలైన రిస్కులు కూడా ఉన్నాయని తెలిపింది. ‘పరిమిత స్థాయిలో టీకాల సరఫరా, ప్రజల్లో సందేహాలు మొదలైన అంశాలన్నీ టీకాల కార్యక్రమం చకచకా ముందుకు సాగడానికి ప్రతిబంధకాలుగా మారాయి. జనాభాలో దాదాపు 70శాతం మందికి టీకాలు వేయాలంటే ప్రథమార్ధం అంతా సరిపోవచ్చు. ఈలోగా కొత్త కేసులు పెరిగి లాక్డౌన్లు తిరిగి విధించాల్సి వస్తే.. ఆర్థిక రికవరీకి మళ్లీ తప్పకపోవచ్చు‘ అని వివరించింది. (Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు) -
భారత్ ఎకానమీపై ఎస్అండ్పీ వైఖరి మార్పు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కేవలం 15 రోజుల్లోనే తన వైఖరిని మార్చుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్షీణ రేటును 9 శాతం నుంచి 7.7 శాతానికి మెరుగుపరిచింది. డిమాండ్ ఊహించినదానికన్నా ముందుగానే మెరుగుపడుతుండడం, కోవిడ్–19 కేసుల తగ్గుముఖ ధోరణి దీనికి కారణంగా మంగళవారం తెలిపింది. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10 శాతం ఉంటుందని పేర్కొంది. కరోనాను ఇంకా జయించలేనప్పటికీ, దానితో కలిసి జీవించడం భారత్ నేర్చుకుంటోందని తెలిపింది. భారత్‌లో సేవలకన్నా, వస్తువులకు డిమాండ్ బాగుందని పేర్కొన్న ఎస్అండ్పీ, రికవరీలో ఈ అంశమూ కీలకపాత్ర పోషించిందని తెలిపింది. సెలవులకు బయటకు వెళ్లకపోవడం, బయటి ఆహార పదార్థాల తీసుకోవడంపై వ్యయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో మిగిలిన డబ్బులో కొంతభాగం వస్తువుల కొనుగోళ్లకు మరికొంత పొదుపులకు ప్రజలు కేటాయిస్తారని పేర్కొన్న రేటింగ్ సంస్థ, భారత్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే వైరెస్ సెకండ్‌వేవ్ సమస్యలు, వ్యాక్సిన్ ఇంకా లభ్యంకాని పరిస్థితులు, వ్యయాలపై ప్రభుత్వానికి పరిమితులు ఆర్థిక వ్యవస్థకు అవరోధాలని పేర్కొంది. 15 రోజుల క్రితం అభిప్రాయం చూస్తే... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో మొదటి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు క్షీణ అంచనాలను 8 శాతం నుంచి 15 శాతం వరకూ లెక్కగట్టాయి. అయితే రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలతలో కనిపిస్తున్న పురోగతి నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తమ తొలి అంచనాలను మార్చుకున్నాయి. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సందర్భంలో నవంబర్ 30వ తేదీన ఎస్అండ్పీ ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థపై ఒక నివేదికను విడుదల చేస్తూ, భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది.అయితే ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి)సహా ఎస్అండ్పీ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి )సైతం క్షీణ అంచనాలను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే పక్షం రోజుల్లో ఎస్అండ్పీ కూడా భారత్ ఎకానమీపై తన వైఖరి మార్చుకుంది. -
మూడీస్ దారిలో వెళ్లని ఎస్ అండ్ పీ!
న్యూఢిల్లీ: మూడీస్ సంస్థ రేటింగ్ పెంచటంతో మంచి జోష్ మీదున్న ప్రభుత్వ వర్గాలను... మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం భారత్‌కు ఇస్తున్న రేటు ‘బీబీబీ–మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది. ఎస్అండ్పీ ప్రకటన చెబుతోంది ఇదీ. ► భారత్ కరెంట్ అకౌంట్, ద్రవ్యోలోటు పరిస్థితులు అంచనాలకు అనుగుణంగా కొనసాగవచ్చు ► ద్రవ్యపరమైన విశ్వసనీయత మెరుగుపడుతోంది. ► దేశంలో తక్కువ తలసరి ఆదాయం ఉంది. ప్రభుత్వంపై భారీ అంతర్జాతీయ రుణ భారమూ ఉంది. అయితే ఇక్కడ భారత్‌లో పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఉంది. ఈ అంశాలు విధానపరమైన పటిష్టతను పెంపొందిస్తాయి. ఇవన్నీ ప్రస్తుత రేటింగ్‌కు పూర్తి మద్దతుగా ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ, తరువాత పేర్కొన్న సానుకూల అంశాలు ఆర్థిక వ్యవస్థకు తగిన సమతౌల్యతను అందిస్తూ, వృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నాం. ► 2007 వరకూ ఎస్అండ్పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్అండ్పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్అండ్పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ► ప్రభుత్వ వర్గాల నిరాశ: ఎస్అండ్పీ తాజా నిర్ణయంపై ప్రభుత్వ వర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. ఇది తగిన నిర్ణయం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే వచ్చే ఏడాది రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యక్తం చేశారు. -
ఐడీఎఫ్సీ లాభదాయకత తగ్గుతుంది
ముంబై: బ్యాంక్ లెసైన్స్ పొందినప్పటికీ ప్రస్తుతం ఐడీఎఫ్సీ రేటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని క్రెడిట్ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ పేర్కొంది. అయితే స్వల్పకాలానికి లాభదాయకత క్షీణించే అవకాశమున్నదని తెలిపింది. కంపెనీకి అనుభవంలేని, పోటీ అధికంగాగల బ్యాంకింగ్ రంగంలో విస్తరించే బాటలో కంపెనీకి సవాళ్లు ఎదురుకాగలవని హెచ్చరించింది. బ్యాంక్‌గా అవతరించేందుకు ఐడీఎఫ్సీకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఇండియా రేటింగ్స్ ఇలా...: బ్యాంక్‌గా మారడంలో ఐడీఎఫ్సీ పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో స్వల్ప, మధ్యకాలాలకు లాభాదాయకత పడిపోతుందని వ్యాఖ్యానించింది. ఇన్ఫ్రాపై దృష్టిపెట్టిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్థాయి నుంచి బ్యాంక్‌గా మారడంలో రిటైల్ డిపాజిట్లను ఆకట్టుకోవడం, వివిధ రంగాలకు రుణాల మంజూరీ వంటి అంశాలలో ఐడీఎఫ్సీ పలు సమస్యలను అధిగమించవలసి ఉంటుందని వివరించింది. నగదు నిల్వల నిష్పత్తిని 4%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని 23% చొప్పున నిలుపుకోవ డంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ భారీగా క్షీణించే అవకాశమున్నదని అంచనా వేసింది. కాగా, బీఎస్ఈలో ఐడీఎఫ్సీ షేరు తొలుత దాదాపు 9% ఎగసి రూ. 139ను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు కోల్పోవడమేకాకుండా చివరికి 2.4% నష్టంతో రూ. 125 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ మద్దతు 20,150
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ ఆర్థిక ఉద్దీపనపై ఆ బ్యాంక్ ఛైర్మన్ చేసిన అనుకూల ప్రకటన, చైనా సంస్కరణల ప్రభావంతో గతవారం ప్రధమార్థంలో వేగంగా పెరిగిన భారత్ మార్కెట్ ద్వితీయార్థంలో అదే ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ప్రతికూలంగా వున్నాయన్న సాకుతో పడిపోయింది. వెరసి రెండు వారాలుగా 3 శాతం శ్రేణిలో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మరోవైపు అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ సూచీలు ఏరోజుకారోజు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే గతవారం అమెరికా ట్రెండ్ నుంచి భారత్‌తో పాటు మిగిలిన ప్రధాన ఆసియా దేశాల (జపాన్ మినహా) సూచీలు కూడా విడివడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలతో సహా హాంకాంగ్, తైవాన్, ఇండోనేషియా, సింగపూర్ సూచీలు తగ్గాయి. హఠాత్తుగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా నిలిచిపోయాయి. గతవారం చివరిరెండు రోజులూ వారు స్వల్పంగా నికర అమ్మకాలు జరిపారు. భారత్‌లో పెట్టుబడులకు ఉద్దేశించిన గ్లోబల్ ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గినట్లు, చైనా ఫండ్స్‌లోకి ప్రవాహం పెరిగినట్లు ఈపీఎఫ్‌ఆర్ (గ్లోబల్ ఫండ్స్ఫ్లో ట్రాక్‌చేసే సంస్థ) తాజా డేటా వెల్లడిస్తున్నది. అలాగే అమెరికా డె డికేటెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ భారత్ మార్కెట్‌ను ఆందోళనపర్చేవే. అయితే విదేశీ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల ట్రెండ్‌ను వేగంగా మార్చేస్తుంటారు. ఈ వారాంతంలో క్యూ2 జీడీపీ డేటా, డిసెంబర్8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున, వచ్చే 15 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ప్రవాహం మార్కెట్ కదలికలకు కీలకం కావొచ్చు. ఇక సాంకేతికంగా చూస్తే..గత రెండు వారాల శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే సూచీలు అటు వేగంగా ప్రయాణించవచ్చు. లేదా ఎన్నికల ఫలితాలు వెలువడేవరకూ ఇదే శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు నవంబర్ 22తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 20,877 పాయింట్ల స్థాయికి కాస్త ఎగువన నిరోధాన్ని ఎదుర్కొని తిరిగి 20,137 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 182 పారుుంట్ల నష్టంతో 20,217 వద్ద ముగిసింది. అమెరికా సూచీలు శుక్రవారం రికార్డు గరిష్టస్థాయిలో ముగిసిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలైతే 20,390 సమీపంలో తొలి అవరోధం ఎదురుకావొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 20,580 వద్దకు క్రమేపీ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగింపు 20,870 వద్దకు చేర్చవచ్చు, దీపావళినాటి 21,321 గరిష్టస్థాయి నుంచి నవంబర్ 22నాటి కనిష్టస్థాయి 20,137 వరకూ జరిగిన 1,184 పాయింట్ల పతనంలో 61.8% రిట్రేస్మెంట్స్థాయి అయిన 20,870 స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే ప్రస్తుత డౌన్‌ట్రెండ్ ముగియవచ్చు. ఈ వారం తొలిరోజే క్షీణత మొదలైతే తక్షణ మద్దతు 20,150 సమీపంలో లభిస్తున్నది. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, తక్షణ మద్దతుస్థాయిని కోల్పోయినా 19,841 వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయి దిగువన 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ సంచరిస్తున్న 19,552 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 5,972 గతవారపు అంచనాలకు అనుగుణంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,200-5,950 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 61 పారుుంట్ల నష్టంతో 5,995 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ డెరివేటివ్ సిరీస్ ఈ వారం ముగియనున్న నేపథ్యంలో 6,000 స్థాయి టార్గెట్‌గా అటు కాల్, పుట్ ఆప్షన్ల రైటింగ్ జోరుగా సాగింది. ఈ వారం నిఫ్టీ 6,000స్థాయిపైన నిలదొక్కుకుంటే వేగంగా 100 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చని, 6,000 స్థాయిని వదులుకుంటే పతనంకావొచ్చని ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. ఇక చార్టుల ప్రకారం చూస్తే....నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే తక్షణ అవరోధం 6,050 వద్ద ఎదురవుతున్నది. ఈ నిరోధస్థాయిని దాటితే 6,106 పాయింట్లస్థాయికి పెరగవచ్చు. ఈ రెండు అవరోధాల్ని అధిగమిస్తే 61.8% రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 6,201 పాయింట్ల వరకూ నిఫ్టీ మరోసారి ర్యాలీ జరపవచ్చు. ఈ వారం క్షీణతతో మొదలైతే రెండు వారాల నుంచి మద్దతునిస్తున్న 5,972 పాయింట్ల స్థాయే ప్రధానం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 150 డీఎంఏ అయిన 5,891 స్థాయికి పతనం కావొచ్చు. ఆ దిగువన 200 డీఎంఏ రేఖ కదులుతున్న 5,863 పాయింట్లస్థాయి మార్కెట్ అప్‌ట్రెండ్‌కు కీలకమైనది. - పి. సత్యప్రసాద్ -
రేటింగ్ గండం!
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం వృద్ధికి తోడ్పడేలా విశ్వసనీయమైన ప్రణాళిక ప్రకటించకపోతే భారత సార్వభౌమ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయాల్సి వస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ సాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) హెచ్చరించింది. ఆర్థిక పరిస్థితులు అసాధారణంగా దిగజారితే తప్ప తదుపరి రేటింగ్‌ను.. ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వ విధానాలను బట్టి సమీక్షిస్తామని పేర్కొంది. భారత్‌కు ‘బీబీబీమైనస్’ స్థాయిని నెగటివ్ అంచనాలతో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు గురువారం వెల్లడించిన సందర్భంగా ఎస్అండ్పీ ఈ అంశాలు తెలిపింది. పెట్టుబడులకు సంబంధించి బీబీబీ రేటింగ్ కనిష్ట స్థాయి గ్రేడ్. ఇంతకన్నా డౌన్‌గ్రేడ్ చేస్తే అధమ స్థాయికి పడిపోయినట్లవుతుంది. కార్పొరేట్లు రుణాలు తీసుకోవాలంటే మరింత అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, ఎస్అండ్పీ రేటింగ్ సమీక్ష అంశం సాధారణమైనదేనని, ఆందోళన చెందాల్సినదేమీ కాదని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో భారత రేటింగ్ అంచనాలను నెగటివ్ స్థాయికి కుదించిన ఎస్అండ్పీ తాజాగా..ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి స్పెక్యులేటివ్ గ్రేడ్‌కి దీన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ కొత్త ప్రభుత్వం వృద్ధి, సంస్కరణలు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటే అప్గ్రేడింగ్కి కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా నమోదైన నేపథ్యంలో ఎస్అండ్పీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉంటాయని ఎస్అండ్పీ పేర్కొంది. డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడం, ఇతరత్రా సబ్సిడీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, జాతీయ స్థాయిలో వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలు వంటి అంశాలను కొత్త ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుం దని ఎస్అండ్పీ పేర్కొంది. బలాలున్నాయ్..బలహీనతలున్నాయ్.. రేటింగ్‌ను ప్రస్తుతానికి యథాప్రకారం కొనసాగించడానికి భారత్‌కి ఉన్న బలాలే కారణమని ఎస్అండ్పీ వివరించింది. వంద కోట్ల పైగా జనాభాతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ, తక్కువ విదేశీ రుణం, తగినన్ని విదేశీ మారక నిల్వలు మొదలైనవి బలాలని పేర్కొంది. అయితే, ఇదే స్థాయిలో బలహీనతలూ ఉన్నాయని వ్యాఖ్యానించింది. వ్యవస్థాగతమైన సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. ఒకవైపు డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేయడమన్న సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరోవైపు సబ్సిడీ భారం పెరిగిపోయేలా ఆహార భద్రత చట్టం తెచ్చి ఇన్వెస్టర్లకు మిశ్రమ సంకేతాలు పంపిందని పేర్కొంది. -
ముందుంది గతుకుల రోడ్డు: ఎస్అండ్పీ
భారత్ సహా అధిక ద్రవ్యలోటుతో సతమతమవుతున్న దేశాలన్నీ స మీప భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) హెచ్చరించింది. భారత్, ఇండొనేసియా వంటి దేశాలు రాబోయే రోజుల్లో గతుకుల రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఇది మరో ఆసియా సంక్షోభానికి దారి తీయకపోవచ్చని దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై రూపొం దించిన నివేదికలో ఎస్‌డ్‌పీ తెలిపింది. సానుకూల అంశాల విషయానికొస్తే.. సింగపూర్ లాంటి వాణిజ్య ఆధారిత ఎకానమీల కన్నా దేశీయంగా డిమాండ్ నెలకొన్న భారత్, చైనా వంటి దేశాలకు వృద్ధిపరమైన రిస్కులు తక్కువగా ఉంటాయని వివరించింది.