భారత్ సహా అధిక ద్రవ్యలోటుతో సతమతమవుతున్న దేశాలన్నీ స మీప భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) హెచ్చరించింది. భారత్, ఇండొనేసియా వంటి దేశాలు రాబోయే రోజుల్లో గతుకుల రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఇది మరో ఆసియా సంక్షోభానికి దారి తీయకపోవచ్చని దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై రూపొం దించిన నివేదికలో ఎస్‌డ్‌పీ తెలిపింది. సానుకూల అంశాల విషయానికొస్తే.. సింగపూర్ లాంటి వాణిజ్య ఆధారిత ఎకానమీల కన్నా దేశీయంగా డిమాండ్ నెలకొన్న భారత్, చైనా వంటి దేశాలకు వృద్ధిపరమైన రిస్కులు తక్కువగా ఉంటాయని వివరించింది.