Economic Problems
-
‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన
న్యూఢిల్లీ: అతను భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు... ఏడాది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏటీపీ టోర్నీలలో పాల్గొంటున్నాడు. టోర్నీల్లో ప్రదర్శనకు ప్రైజ్‌మనీ కూడా దక్కుతుంది. మామూలుగా అయితే టెన్నిస్ ఆటగాళ్లు బాగా డబ్బున్నవాళ్లు అయి ఉంటారని, ఏ స్థాయిలో ఆడినా విలాసవంతమైన జీవితం ఉంటుందనిపిస్తుంది. కానీ ప్రపంచ టెన్నిస్‌లో వాస్తవ పరిస్థితి వేరు. అది ఎంత ఖరీదైందో... అగ్రశ్రేణి స్టార్లు తప్ప 100 కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల స్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ! భారత్‌కు చెందిన ప్రపంచ 159వ ర్యాంకర్ సుమీత్ నగాల్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తన బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 900 యూరోలు (సుమారు రూ. 80 వేలు) మాత్రమే ఉన్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రైజ్‌మనీల ద్వారా వచ్చిన డబ్బు, ఐఓసీఎల్ కంపెనీ జీతం, మహా టెన్నిస్ ఫౌండేషన్ ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తం టెన్నిస్‌లోనే పెడు తున్నానని, అయినా సరే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వెల్లడించాడు. డబ్బులు లేకపోవడంతో ఫిజియో కూడా లేకుండా ఒకే ఒక కోచ్‌తో తాను పోటీల్లో పాల్గొంటున్నానని అన్నాడు. టెన్నిస్ సర్క్యూట్లో నిలకడగా ఆడుతూ టాప్–100లో చేరాలంటే ఏడాదికి కనీసం రూ. 1 కోటి ఖర్చు అవుతుందని నగాల్ చెప్పాడు. ‘కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ భారత నంబర్‌వన్‌గా ఉన్నా నాకు కనీస మద్దతు కరువైంది. ప్రభుత్వం ‘టాప్స్’ పథకంలో నా పేరు చేర్చలేదు. డబ్బులు లేక జర్మనీలోనే టెన్నిస్ అకాడమీలో శిక్షణకు దూరమయ్యాను. నేను గాయపడి ఆటకు దూరమైనపుడు అసలు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. రెండుసార్లు కోవిడ్ రావడంతో ర్యాంక్ పడిపోయింది. మన దేశంలో ఆర్థికంగా మద్దతు లభించడం చాలా కష్టం. నా వద్ద ఉన్న డబ్బంతా ఆటకే పెడుతున్నా. గత రెండేళ్లలో ఏమీ సంపాదించలేదు. నేనేమీ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉండటం లేదు. అన్నీ కనీస అవసరాలే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్తిగా చేతులెత్తేశాను’ అని నగాల్ తన బాధను చెప్పుకున్నాడు. -
ఖుదీరామ్ కష్టాలు
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో అతి చిన్న వయసులో అమరులైన ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి టైటిల్ రోల్లో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించగా ప్రశంసించారని యూనిట్ పేర్కొంది. అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో విజయ్ జాగర్లమూడి గుండె పొటుకు గురై, చికిత్స తీసుకుంటున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’
కంచర్ల యాదగిరిరెడ్డి వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. బాల్యంలోని అనుభవాలతో.. వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి. జన్యువుల పాత్ర కూడా.. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది. స్థూలంగా మూడే.. ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు. ►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్‌లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్తోపాటు ప్యానిక్ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటివి ఉంటాయి. ►మూడ్ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్ లేదా అఫెక్టివ్ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్ డిజార్డర్, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్లు ఉంటాయి. ►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. -
మార్పును ఆహ్వానిద్దాం..!
జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేసింది కరోనా. మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాయుతంగా నిర్వహించే వారు పెద్దగా ఇబ్బంది పడలేదు.. కానీ, ముందుచూపు లేని వారికి జీవితం పట్ల వాస్తవం బోధపడింది. నగదు కోసం కష్టాలు ఎదుర్కొన్న వారు ఎందరో.. ఆస్తులు ఉన్నా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం అన్ని వేళలా సాధ్యపడుతుందని భావించలేము. దీంతో అప్పుతో గట్టెక్కే ప్రయత్నం చేసిన వారున్నారు. విల్లు రాయకుండా అకాల మరణం పాలైతే.. వారి పేరిట ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యులు వెంటనే పొందలేని పరిస్థితి. డబ్బుకు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి మన ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవాలన్న సందేశాన్ని ఈ మహమ్మారి ఇచ్చింది. మార్పు దిశగా అడుగులు వేసేందుకు ఏం చేయాలన్నదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. అన్ని కాలాల్లోనూ అందుబాటులో కొంత మేర నిధిని ఉంచుకోవడం అవసరమని కరోనా మహమ్మారితో ఎక్కువ మందికి తెలిసొచ్చింది. చాలా మంది అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలేనన్న ఆలోచనతో ఉంటారు. కానీ, ముందు సన్నద్ధత లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగదుకు బదులు ఆస్తులు ఉండొచ్చు. కానీ, అవసరం ఏర్పడితే వెంటనే ఆదుకునేది నగదు బ్యాలన్సే. ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉందనుకోండి. వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కష్టసాధ్యం. అందుకే లిక్విడ్ ఆస్తుల రూపంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల సౌలభ్యం ఉండాలి. అలా అని లిక్విడిటీ లేని ఆస్తులు సమకూర్చుకోవద్దని కాదు. అవసరమైనంత మేర లిక్విడ్ ఆస్తులను సైతం కలిగి ఉండాలి. ‘‘పొదుపు చేస్తున్న మొత్తాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్ ఆప్షన్ లేని (కాల వ్యవధి మధ్యలో పెట్టుబడులను వెనక్కి తీసుకోలేనివి) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవసరం ఏర్పడినప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని వీఆర్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో వివేక్ రెగే పేర్కొన్నారు. కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంతకంటే ఎక్కువే సమకూర్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు, ఆదాయాలకు దీర్ఘకాలం పాటు సమస్యలు ఏర్పడిన తరుణంలో కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ సూచించారు. ఉద్యోగ భద్రత అంతగా లేని వారికి ఎక్కువ నిధి అవసరం పడుతుంది. ఒకే బుట్టలో పెట్టొద్దు ఉదాహరణకు నెలసరి అవసరాలకు రూ.50,000 కావాలనుకోండి.. ఏడాది కోసం రూ.6లక్షలు అవసరమవుతాయి. అప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. నెలసరి అవసరాలంటే ఈఎంఐలు, సిప్‌లు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఖర్చులు అన్నీ కలసి ఉండాలి. ► మొదటి రెండు నెలల అవసరాల కోసం రూ.లక్షను స్వీప్ఇన్ ఎఫ్డీ ఖాతాలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడిన వెంటనే నిమిషాల్లోనే ఈ నిధిని వెనక్కి తీసుకోగల వెసులుబాటు ఉంటుంది. ► తదుపరి నాలుగు నెలల అవసరాలకు గాను రూ.2లక్షలు తీసుకెళ్లి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రేజ్, లిక్విడ్ ఫండ్స్‌ను ఇందుకు పరిశీలించొచ్చు. ఈ పెట్టుబడులను నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెనక్కి పొందొచ్చు. ► తదుపరి ఆరు నెలల కోసం రూ.3లక్షలను ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఊహల ఆధారంగా అడుగులు వేయొద్దు ‘ఇప్పుడు కొనేద్దాం.. తర్వాత చెల్లించొచ్చు’ ఈ విధానం మంచిది కాదు. వేతన కోతలు, ఆశావహంగా లేని వ్యాపారాలు.. ఫలితంగా భారీగా అప్పులు చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. కొందరు అయితే రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే.. మరికొందరు ఉన్నదంతా అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల సామర్థ్యానికి మించి అప్పులు చేసి చాలా మంది ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది చేసే సాధారణ తప్పిదం.. భవిష్యత్తులో పెరిగే ఆదాయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో ముందుగానే రుణంగా తీసుకోవడం. 2బీహెచ్‌కే ఇల్లు చాలినా.. కొన్ని రూ.లక్షలు అదనంగా చెల్లిస్తే 3బీహెచ్‌కే వస్తుంటే దానివైపే మొగ్గుచూపే వారే ఎక్కువ. తక్కువ బడ్జెట్లో వస్తున్న కారుకు బదులు ఖరీదైన సెడాన్‌ను ఈఎంఐలపై కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తు ఆదాయంపై అంచనాలతో తçప్పటడుగులు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలతో జీవన వ్యయం పెరిగిపోయి.. మళ్లీ వెనక్కి దిగిరాలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నెలవారీ చేతికి అందే నికర ఆదాయం నుంచి చేసే రుణ చెల్లింపులు (ఈఎంఐలు) 50% మించకూడదన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన సూత్రం. రుణం వస్తుంది కదా అని తీసుకోవద్దు. దీనివల్ల రుణఊబిలోకి చిక్కుకుపోవచ్చు. ఫలితంగా భవిష్యత్తు లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడుల్లో రాజీ పడా ల్సి వస్తుంది. సాధారణంగా జీవన వ్యయాలు అన్నవి ఏటేటా పెరుగుతుంటాయి. దీనికి తగ్గ ట్టు ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. లేదంటే ఈఎంఐలకు చేసే చెల్లింపులతో జీవన వ్యయాల్లో రాజీపడాల్సి వస్తుంది. హెల్త్ ప్లాన్ ఒక్కటీ సరిపోదు.. సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాల వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే బిల్లులు భారంగా అనిపించకపోవచ్చు. కానీ, పెద్ద ప్రమాదాలు, క్లిష్టమైన అనారోగ్య సమస్యలు.. కరోనా వంటి వైరస్ల బారిన పడిన సందర్భాల్లో బిల్లు ఎంతొస్తుందన్నది ఊహించలేము. అందుకే నామమాత్రపు కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్ని విధాలా రక్షణ అనిపించుకోదు. పైగా బీమా ప్లాన్‌లో కవర్ కానివి చాలా ఉంటాయి. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం వినియోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇలా ఎన్నింటికో కంపెనీలు చెల్లింపులు చేయకుండా కోతలు విధిస్తున్నాయి. కోపేమెంట్, సబ్‌లిమిట్స్ వంటి షరతులున్న ప్లాన్లు తీసుకున్న వారు బిల్లులో నిర్ణీత మొత్తాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో సొంత నిధుల నుంచి చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే హెల్త్‌ప్లాన్‌కు అదనంగా కొంత వైద్యనిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. విల్లు రాయాలి.. సవరించాలి కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎందరినో కరోనా ఉన్నట్టుండి బలితీసుకుంది. అటువంటి కుటుంబాలు చాలా వరకు నిధుల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు తమ పేరిట ఆస్తులకు భవిష్యత్తు హక్కుదారులను విల్లు రూపంలో చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆయా ఆస్తులను వారసులు చట్టపరంగా తమ పేరిట మార్చుకుంటే కానీ విక్రయించుకోలేరు. విల్లు లేని సందర్భాల్లో వారసులమని, హక్కుదారులమని నిరూపించుకున్న తర్వాతే వాటి విక్రయానికి వీలవుతుంది. అందుకే కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి విల్లు రాసుకుని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పెట్టుబడులకు నామినీగా ఒకరిని నమోదు చేయించుకోవాలి. ‘‘ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులను ప్రస్తావిస్తూ విల్లు రాసుకోవాలి. అదనపు ఆస్తులు సమకూరిన ప్రతీ సందర్భంలోనూ విల్లును అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వారసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ సూచించారు. అలాగే, కుటుంబంలో బాధ్యతాయుతమైన ఒకరికి డాక్యుమెంట్లు, అన్ని ఆధారాలను ఎక్కడ ఉంచేదీ తెలియజేయాలని పేర్కొన్నారు. రుణాలకు రక్షణ ఉండాల్సిందే కుటుంబం కోసం అప్పులు చేసి అకాల మరణం చెందితే.. అప్పుడు కుటుంబ సభ్యులపై చెల్లింపుల భారం పడుతుంది. మీ సామర్థ్యాల పరిధిలోనే రుణాలు తీసుకోవడమే కాదు.. ఆ రుణ విలువకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ రుణం పూర్తిగా చెల్లించకుండానే రుణగ్రహీత మరణించినట్టయితే.. బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం రుణాన్ని తీరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులపై అదనపు ఆర్థిక భారం పడదు. సాధారణంగా గృహరుణాలకు టర్మ్ కవర్ అనుసంధానంగా వస్తుంది. అదే వ్యక్తిగత రుణాల్లో ఇలా ఉండదు. కనుక వ్యక్తిగత రుణానికి సమాన మొత్తంతో బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. అప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకోవద్దు. కుటుంబ జీవన అవసరాల కోసం రక్షణగా తీసుకునేదే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. వ్యక్తి మరణం తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేదంతా రుణ చెల్లింపులకే పోతే ఆ కుటుంబం ఎలా జీవించాలి? అందుకే ప్రతీ రుణానికి విడిగా టర్మ్ కవర్ తప్పకుండా ఉండాలి. రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్లలో.. తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ కూడా క్షీణిస్తుంటుంది. అయితే రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్ల ప్రీమియం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. కనుక రుణం ఇచ్చే సంస్థ నుంచి కాకుండా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. విదేశీ ఈక్విటీలు.. ఈక్విటీ ఇన్వెస్టర్లలో 99 శాతానికి పైగా దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే ఉన్నారు. ఆర్థికంగా రానున్న రోజుల్లో భారత్ దిగ్గజంగా మారుతుందన్న అంచనాలతో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు. అయితే, నూరు శాతం పెట్టుబడులను దేశీయంగానే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు వైవిధ్యం కోసం కొంత మొత్తాన్ని విదేశీ ఈక్విటీలకూ కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూసేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరి అస్సెట్ అలోకేషన్‌లో విదేశీ ఈక్విటీలకూ చోటు ఉండాలన్నది సూచన. ఎందుకంటే భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో ఎక్కువగా అస్థిరతలు ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈక్విటీలు బలంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా రెండు దశల తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు భారీ ప్యాకేజీల మద్దతుతో వేగంగా కోలుకుంటున్నాయి. ‘‘ప్రతికూల పరిస్థితులను వివిధ దేశాలు భిన్నంగా ఎదుర్కొంటాయన్నది కరోనా చూపించింది. భౌగోళికంగా వైవిధ్యం అన్నది (వివిధ దేశాల ఈక్విటీల్లో పెట్టుబడులు) దేశం ఆధారిత రిస్క్‌లను తట్టుకునేందుకు అవసరం. పైగా ఒక్కో దేశానికి భిన్నమైన బలాలు, అవకాశాల దృష్యా అక్కడి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. తమ పెట్టుబడుల్లో 15–20 శాతం నిధులను విదేశీ ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఇది రాత్రికి రాత్రి కాకుండా క్రమంగా నిర్ణీత కాల వ్యవధిలో చేసుకోవాలి’’ అని గ్లోబలైజ్ ఇండియా సీఈవో విరాజ్నందా సూచించారు. అయితే ఆయా అంశాల్లో నిపుణుల సలహా అవసరం. -
ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!
జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి. ఓ ఇన్వెస్టర్‌గా వాటిని దూరం పెట్టడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా కొనసాగేలా చూసుకోవచ్చు. ఎక్కువ పొదుపు, తక్కువ ఖర్చు, అనవసర రుణాలకు దూరంగా ఉండడం అన్నవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వ్యక్తిని ఆరి్థకంగా సౌకర్యంగా ఉంచుతాయి. ఆర్థికపరమైన విజ్ఞానం ఉన్నవారు సైతం కొన్ని తప్పిదాల వల్ల ఆరి్థకంగా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థికంగా దూరంగా ఉంచాల్సిన అలవాట్లపై అవగాహన కలి్పంచడమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి అలవాటే. కానీ, షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వీరిలో తగినంత పరిశోధన, అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేసే వారు చాలా చాలా తక్కువ. ఇటీవలి మార్కెట్ పతనం చాలా మంది చిన్న ఇన్వెస్టర్లను కుదిపేసిందనే చెప్పుకోవాలి. చాలా స్టాక్స్ ఇటీవలి బడ్జెట్ తర్వాత నూతన 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ ఏడాది క్రితం రూ.600పైన పలికింది. ప్రస్తుత ధర రూ.48.65. అంటే దాదాపు 92 శాతం మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ స్థాయి నష్టాలేమీ లేవు. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ కూడా క్షీణించడం సహజమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించడం వల్ల నష్టాలు పరిమితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ చెత్త పనితీరు చూపించిన పథకాలు కూడా... బీఎస్ఈ 100లోని ఎక్కువగా నష్టపోయిన షేర్ల కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, కొంత మేర మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఫండ్స్‌లో ఆయనకు సగటు రాబడులు 8 శాతంగా ఉంటే, స్టాక్స్‌లో ఆయన నష్టాలు భారీగా పేరుకుపోయాయి. 50 శాతంపైన నష్టాల పాలయ్యాడు. అందుకే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎంతో అవగాహన, అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరం. ఈ విషయాన్నే చాలా మంది ఇన్వెస్టర్లు విస్మరిస్తుంటారు. ఎంచుకునే కంపెనీల విషయంలో తాము సొంతంగా అధ్యయనం చేసి నిర్ధారించుకోలేని వారు, నిపుణుల సలహాలను పొందొచ్చు. లేదంటే మంచి ట్రాక్ రికార్డు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం నయం. అధ్యయనం లేకుండా ముందడుగు మన దేశంలో చిగురిస్తున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా ప్రారంభించిన ఐదేళ్లలోపే మూతపడుతున్నాయని ఐబీఎం నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. సావన్ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో ఓ వెంచర్‌ను ఆరంభించాడు. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. క్రమంగా దాన్ని విస్తరించాలన్నది ప్రణాళిక. కానీ న్యాయపరమైన, నియంత్రణపరమైన అవరోధాలతో 2014లోనే దాన్ని ఆపేయాల్సి వచి్చంది. అయితే, ఇది అతడి జీవన ప్రణాళికలపైనా పడింది. వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా, ఇంటి రుణం, పర్సనల్ లోన్, పిల్లల విద్య అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడుల ప్రణాళికలకు విఘాతం కలిగింది. తిరిగి మరలా ఉద్యోగంలో చేరేందుకు ఏడాది సమయం పట్టింది. తన సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉండొచ్చు. తానో ఎంట్రప్రెన్యూర్‌గా మారాలన్న అభిలాష ఉండొచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు సమగ్ర సన్నద్ధత అవసరం. ఇలా సొంత ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుగానే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. పన్ను ఆదా కోసం బీమా మన దేశంలో ఏటా కోట్లాది రూపాయలను అవసరం లేని బీమా ప్లాన్లపై వెచి్చస్తున్న విషయం తెలుసా..? బీమాలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు, జీవితానికి బీమా రక్షణ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను లేకపోవడం... ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ట్రిపుల్ బెనిఫిట్. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో పన్ను ఆదా ఒక్క ప్రయోజనం తప్పించి... నిజానికి సరిపడా బీమా రక్షణను అవి ఇవ్వలేవు. అంతేకాదు సరైన రాబడులను కూడా ఇవ్వవు. మీరు చెల్లించే ప్రీమియంలో సగ భాగం బీమా రక్షణ ఖర్చులకే పోతుంది. మిగిలిన పెట్టుబడులపై వచ్చే రాబడి చూసుకుంటే మొత్తంమీద రాబడి రేటు 5 శాతం దాటదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన యులిప్‌లు రాబడుల విషయంలో కొంచెం మెరుగైనవే. కానీ వీటిల్లో చార్జీలు, ఫీజులు, రాబడుల విషయంలో పారదర్శకత తక్కువ. బీమా పాలసీల్లో ప్రధానమైనది దురదృష్టవశాత్తూ మరణం చోటు చేసుకుంటే, ఆ కుటుంబ ఆర్థిక అవసరాను గట్టె క్కించేది అయి ఉండాలి. కానీ, సంప్రదాయ పాలసీల్లో ఇదే ఆఖరు ప్రాధాన్యంగా ఉంటుందన్న నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది చూస్తున్నది పన్ను ఆదానే. ఇదే పాలసీలను మార్కెట్ చేసే వారికి ఆయుధంగా మారుతోంది. 63 ఏళ్ల రాజారావు ఓ పెన్షనర్. మూడేళ్ల క్రితం ఆయనొక యులిప్ పాలసీ తీసుకున్నారు. రాజారావు పదవీ విరమణ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే, బ్యాంకు ఉద్యోగి ఆయనకు యులిప్ పాలసీ అంటగడ్డాడు. దీనివల్ల పన్ను ఆదా చేసుకోవచ్చన్న బ్యాంకు ఉద్యోగి మాటలను నమ్మి యులిప్ పాలసీని రాజారావు తీసుకున్నాడు. మూడేళ్లలో ఇందులో రూ.4.5 లక్షలు పెడితే, మూడేళ్ల తర్వాత ఆయన పెట్టుబడి విలువ రూ.4 లక్షలుగానే కనిపిస్తోంది. ఫండ్ విలువ కోలుకునే వరకూ వేచి చూడాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారంటూ రాజారావు పేర్కొన్నారు. నిజానికి సీనియర్ సిటిజన్ అయిన రాజారావుకు యులిప్ పాలసీ అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లింక్డ్ పాలసీ అది. దీనికి బదులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనుకూలం. వైవిధ్యం ఎక్కువైతే... పెట్టుబడులకు వైవిధ్యం అన్నది ప్రాణం అవుతుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ నూరు శాతం ఉంటుంది. కానీ, ఈ పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య డెవర్సిఫై చేయడం వల్ల రిస్‌్కను వేరు చేసినట్టు అవుతుంది. కానీ, వైవిధ్యం శ్రుతిమించకూడదు. ఆప్పుడే ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రిస్క్ తగ్గించుకోవాలని లెక్కకు మించిన చోట ఇన్వెస్ట్ చేయడం అనుకున్న ప్రయోజనాలను ఇవ్వదు. మోడల్ పోర్ట్‌ఫోలియో అంటే... వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ 15–20 మించకుండా చూసుకోవడం. ఇది రిస్‌్కను తగ్గిస్తుంది. ఈ వైవిధ్యం పెట్టుబడుల రిస్‌్కను ఎన్నో సెక్యూరిటీల మధ్య పంచుతుంది. అలా అని పదుల సంఖ్యలో చాంతాడంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఇంకా తగ్గుతుందని అనుకుంటే అది నిజం కాబోదు. ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కూ అమలవుతుంది. సెక్టార్ ఫండ్స్ (థీమ్యాటిక్) మినహా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌లో వైవిధ్యం అన్నది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు, భిన్న రంగాలకు చెందిన కంపెనీలను, అలాగే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలను పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటారు. కనుక తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక సంఖ్యలో పథకాలను ఎంచుకున్నారనుకోండి... ఆయా పథకాలు ఒకే తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గకపోగా, పెరుగుతుంది. నెలకు రూ.5,000–20,000 మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే మహా అయితే నాలుగు పథకాలు సరిపోతాయి. 40 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కోసం, 30 శాతం మల్టీక్యాప్ పథకాలకు, 20 శాతం మిడ్‌క్యాప్, 10 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పుణెకు చెందిన సౌమ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అది కూడా మంచి పనితీరు చూపించే పథకాల్లోనే. కానీ, ఒక ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం మరుసటి ఏడాది కూడా టాప్‌లోనే ఉండాలని లేదు కదా. దాంతో సౌమ్య పోర్ట్‌ఫోలియోలో పథకాల సంఖ్య 30కు చేరుకుంది. దీంతో కొన్నింటిని తగ్గించుకుందామనుకున్నా... వేటిని తీసేయాలన్న సందిగ్ధం ఆమెను వేధిస్తోంది. ఒకటి రెండు పథకాలను అదనంగా ఎంచుకున్నా ఫర్వాలేదు కానీ, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అయితే, షేర్ల మాదిరిగా ఫండ్స్ పథకాలు ఎక్కువైపోతే నష్టాలు వస్తాయనేమీ లేదు. ఎందుకుంటే ఫండ్స్ ఎప్పుడూ నిపుణుల నిర్వహణలోనే కొనసాగుతుంటాయి. కాకపోతే రాబడుల రేటే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాటిని పర్యవేక్షించడం కష్టమవుతుంది. అత్యవసరాలు... జీవనశైలి ఖర్చులన్నవి నేడు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఖర్చు చేసేందుకు ఎన్నో ఆకర్షణలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే జీవితానికి కనీస అవసరాలన్నవి గతంతో పోలిస్తే అధికమయ్యాయి. రిటైర్మెంట్ అవసరాల కోసం తాము చేస్తున్న పొదుపు, మదుపులను వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిగ్నా నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పడం గమనార్హం. 40 శాతం మంది తాము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. ముంబైకి చెందిన కీర్తి నెల ఆదాయంలో వ్రస్తాలు, ఆహారం, ప్రయాణ అవసరాలకే 75 శాతం ఖర్చవుతోంది. దీంతో ఆమె పొదుపు చేసేందుకు మిగులుతున్నది కొద్ది మొత్తంగానే ఉంటోంది. అంతేకాదు, తగినంత పొదుపు లేకపోవడం వల్ల ఆమె కంటి సర్జరీని వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. ఆలస్యంగా వాస్తవాన్ని గ్రహించిన కీర్తి, ప్రతి నెలా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. అంతేకాదు హెల్త్ ప్లాన్ తీసుకోవడం, అత్యవసరాల కోసం ఓ నిధిని సమకూర్చుకోవడం కూడా ఆమె ముందున్న అవసరాలు. చాలా మంది అత్యవసర నిధి అవసరాన్ని పట్టించుకోరు. అవసరం వచ్చినప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తుంటారు. కనుక ఆర్జించే ప్రతీ వ్యక్తి కూడా 6–8 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం రూ.5 లక్షలకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెరిగే అవసరాలకు అనుగుణంగా కవరేజీని టాపప్ ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు కుటుంబానికి ఆధారంగా ఉండేవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 10–15 రెట్ల మేర టర్మ్ బీమా ప్లాన్ కూడా తీసుకోవాలి. -
ఆర్థిక సమస్యలతోనే ట్రాఫికింగ్
► అంతర్జాతీయ సదస్సులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు అనంతపురం ఎడ్యుకేషన్ : మానవ అక్రమ రవాణాకు ఆర్థిక అంశాలే మూలం అని మైచాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్లు వీవీఎన్ ఇసాక్ (ఆస్ట్రేలియా), మాథ్యూస్ డీబీర్ (దక్షిణాఫ్రికా) అన్నారు. ‘మానవ అక్రమ రవాణా – సవాళ్లు – ప్రమాణాలు’ అనే అంశంపై ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో గురువారం రెండో రోజు నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో వారు మాట్లాడారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులతోపాటు ఒడిస్సా రాష్ట్ర బర్హంపూర్‌లోని లింగరాజు లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ చరణ్ పట్నాయక్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.సంజీవరెడ్డి, ఎస్కేయూ ప్రొఫెసర్ అమర్నాథ్దాస్, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భానూజ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను రూపు మాపడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రంగస్వామి, సదస్సు కన్వీనర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి టీఎస్ శ్యామ్‌ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సైనికుడి ఆత్మహత్య
హైదరాబాద్‌సిటీ (అమీర్‌పేట): కొత్తగా ఇల్లు నిర్మించుకున్న ఓ సైనికుడు గృహప్రవేశం కోసం ఇంటికి వచ్చాడు... అయితే, తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ ఎసై్స సైదులు కథనం ప్రకారం... అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన ఎం.మధు పెద్ద కుమారుడు సతీష్ కుమార్(25) రెండేళ్ల క్రితం సైన్యంలో చేరి ప్రస్తుతం మీరట్‌లో పని చేస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడలో ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం నిమిత్తం ఫిబ్రవరి 7న నగరానికి వచ్చాడు. మూడు రోజుల క్రితం గృహప్రవేశం పూర్తి చేసుకున్న సతీష్ గత రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయానికి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్థారణకు వచ్చారు. మృతుడి తండ్రి మధుకు పక్షవాతం వచ్చి ఇంటికే పరిమితం కాగా తల్లి, తమ్ముడు, సోదరి బాగోగులు అతడే చూసుకుంటూ వస్తున్నాడు. సతీష్ డబ్బుతోనే ఇటీవల ఇల్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో సుమారు రూ. 6 లక్షల అప్పు చేశాడు. తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడం, అప్పుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కైన సతీష్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాడు. సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మరణం.. భార్య ఆత్మహత్యాయత్నం
షాద్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ అయ్యప్పకాలనీలో గురువారం ఓ విషాదం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణించడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేక తాను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
రైలు కింద పడి అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య
మహబూబ్‌నగర్: ఆర్థిక సమస్యలు, పేదరికంతో మనస్తాపానికి గురైన అన్నా, చెల్లెలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు (25), పాపమ్మ (20) అన్నాచెల్లెళ్లు. వీరి తండ్రి మూడేళ్లక్రితమే మృతిచెందగా, తల్లితోపాటు యాచక వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన అన్నాచెల్లెళ్లు బుధవారం తెల్లవారుజామున సమీపంలోని పట్టాల వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఆదాయమా...ఎక్కడున్నావ్?
ఆర్థిక ఆసరాకు హెచ్ఎండీఏ యత్నాలు ఖాళీగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లీజ్ బకాయిలను పట్టించుకోని వైనం సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ ఇప్పుడు ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. కొత్త లేఅవుట్లు, భూ వినియోగ మార్పిడి, ఇతర అనుమతుల కోసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. సిబ్బందికి నెలవారీ జీతభత్యాలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, పార్క్‌ల నిర్వహణ వంటివి తలకుమించిన భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తన ఆధీనంలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షాపులు, కార్యాలయాలను లీజ్‌కు ఇచ్చి ఎంతో కొంత ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఆరాటపడుతోంది. అయితే... రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కొందరు తమ వ్యాపారాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించారు. దీంతో అమీర్‌పేటలోని మైత్రీ వనం, మైత్రీ విహార్, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్స్‌లలో అనేక షాపులు ఖాళీ అయ్యాయి. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తం అధికంగా ఉందంటూ మరికొందరు ఖాళీ చేసి వెళ్లారు. దీంతో ఈ కాంప్లెక్స్‌లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ ర్తీ చేసేందుకు అధికారులు అనేకసార్లు టెండర్లు పిలిచారు. అయినా లీజ్‌కు తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తాన్ని కొంత తగ్గించి టెండర్ పిలిస్తే ప్రయోజనం ఉండేది. దీనికి అధికారులు సాహసించట్లేదు. లీజ్ మొత్తాన్ని తగ్గిస్తే... ఇప్పటికే ఆ కాంప్లెక్స్‌లలో ఉన్న వారు తమకు కూడా తగ్గించాలని గొడవ చేసే అవకాశం ఉందని...దీని వల్ల ఆదాయం మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు సంశయిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో ఏళ్ల తరబడి కొన్ని షాపులు ఖాళీగా ఉంటున్నాయి. ఫలితంగా లీజ్ రూపంలో వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. విద్య, వాణిజ్య వ్యాపార సంస్థలతో కిటకిటలాడే అమీర్‌పేటలో హెచ్ఎండీఏకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొందరు అధికారులు లీజ్దారులకు వక్రమార్గాన్ని సూచిస్తూ ప్రయోజనం పొందుతుండటంతో సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ఈ కాంప్లెక్స్‌లలో షాపును లీజ్‌కు తీసుకోవాలన్నా.... ఉన్న వారు ఖాళీ చేయాలన్నా అధికారులు సవా లక్ష ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అపవాదును సంస్థ మూటగట్టుకొంది. కొందరు అక్రమార్కులు లీజ్‌దారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొంటూ సంస్థకు రావాల్సిన లీజ్ మొత్తాన్ని బకాయిగా చూపుతున్నారు. వారి నుంచి స్వీకరించిన డిపాజిట్ మొత్తాన్ని మినహాయించుకొని వెంటనే ఖాళీ చేయించాల్సి ఉండగా... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు బకాయిలు పేరుపోయాయి. అక్రమార్కులను సంస్కరించకుండా ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా... ప్రయోజనం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలి. లీజ్‌కు షాపులు అమీర్‌పేటలోని మైత్రీ వనం, స్వర్ణ జయంతి, మైత్రి విహార్లలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో షాపులు, కార్యాలయాలను లీజ్‌కు కేటాయించనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. తార్నాకలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ అనేక షాపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో సంప్రదించాలని అధికారులు సూచించారు. తార్నక, అమీర్‌పేటలోని కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోదలచిన వారు హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సీల్డ్ టెండర్‌ను ఈనెల 6 నుంచి 23లోగా తార్నాకలోని ఆర్ అండ్ డీఓ సెక్షన్లో అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు. నేరుగా దరఖాస్తు చేసుకోదలచిన వారు తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ఆర్ అండ్ డీఓ సెక్షన్ నుంచి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం 9989336917 లేదా 9849902556 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హెచ్ఎండీఏ కార్యాలయంలో తెరిచి అర్హులకుఆ కాంప్లెక్స్‌ల లో షాపులు, కార్యాలయాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్... సర్వీసుల పునరుద్ధరణకు వీలుగా రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రణాళిక ఆమోదంపై తుది నిర్ణయం తీసుకునేముందు సంబంధిత చమురు కంపెనీలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సర్వీసుల పునరుద్ధరణ దిశలో స్పైస్‌జెట్ ఇప్పటికే పౌర విమానయాన శాఖకు ప్రణాళికను అందజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రుణ చెల్లింపులకు వీలుగా 15-30 రోజులపాటు గడువు ఇవ్వాల్సిందిగా చమురు కంపెనీలను కోరినట్లు తెలిపాయి. కాగా, మరోపక్క కంపెనీ తొలి ప్రమోటర్ అజయ్ సింగ్ అమెరికాకు చెందిన రెండు ప్రయివేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ప్రతినిధులను కంపెనీ బోర్డులోకి తీసుకురావాలన్నది అజయ్ ప్రణాళిక. రూ. 1,230 కోట్లకు బకాయిలు..: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బకాయిలు డిసెంబర్ 10కల్లా రూ. 1,230 కోట్లకు చేరాయి. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు 18 రోజుల్లో రూ. 990 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు ఎగశాయి. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ లోక్‌సభలో వెల్లడించారు. -
దూరాన్ని మీరే కత్తిరించండి!
‘మావారు నన్నసలు పట్టించుకోవడమే లేదు’... చాలామంది భార్యలు చేసే కంప్లయింట్ ఇది. ఒక్కోసారి ఈ ఫిర్యాదు పెద్ద దుమారాన్నే రేపుతుంది. దంపతుల మధ్య చిచ్చు పెడుతుంది. బంధాన్ని తెగతెంపులు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా? ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. మరి దీనికెందుకు ఉండదు? చాలామంది చేసే తప్పు... మనం చెప్పకుండానే అవతలివాళ్లు మన ఫీలింగ్స్ అర్థం చేసేసుకోవాలని ఆశపడటం. అది కరెక్ట్ కాదు. అందరూ అలా అర్థం చేసుకోలేరు. కాబట్టి మీ మనసులో ఉన్నది మీ భర్తకి చెప్పండి. మీతో కాస్త సమయం గడపమని అడగండి. ఒకవేళ ఆయన అర్థం చేసుకోకపోతే అప్పుడు మరో మార్గాన్ని అనుసరించవచ్చు. సమయం కేటాయించవేంటి అంటూ ఎప్పుడూ గొడవకు దిగకండి. పాపం నిజంగానే ఆయన పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండొచ్చు. మీతో గడపాలని ఉన్నా గడపలేకపోవచ్చు. మీరు గొడవ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆయన తన పనీ సరిగ్గా చేసుకోలేరు. ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి పరిష్కారాన్ని వెతకండి తప్ప స్పర్థలు పెంచుకోకండి. ఆయన మీ కోసం టైమ్ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీరే ఎందుకు టైమ్ తీసుకోకూడదు? అంటే... ఆయన లంచ్ టైమ్ ఏంటో తెలుసుకోండి. మీకు వీలు చిక్కినప్పుడు ఆయనకు ఇష్టమైన భోజనాన్ని సిద్ధం చేసుకుని, లంచ్ టైముకల్లా ఆయన ముందు వాలిపోండి. నచ్చిన భోజనం పెట్టి ఆయనను సంతోష పెట్టినట్టూ ఉంటుంది, ఆయనతో కాసేపు సరదాగా గడిపినట్టూ ఉంటుంది. కొందరు మగాళ్లు ఇంట్లో కూడా ఆఫీసు పని చేస్తుంటారు. అలాంటప్పుడు విసుక్కోకండి. మీరు చదువుకున్నవారైతే వారి పనిని పంచుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఆయనకు కాస్త సమయం మిగులుతుంది కదా... అది మీకు కేటాయిస్తారు. ఎప్పుడైనా ఆయన ఇంటికి వచ్చే సమయంలో ఆఫీసు దగ్గరకు వెళ్లిపోండి. సరదాగా ఆయనతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి రండి. వీలైతే దారిలో ఏ ఐస్‌క్రీమో తినండి. మరి కాస్త సమయం గడపవచ్చు. ఒకవేళ ఆర్థిక సమస్యలు అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా కష్టపడుతున్నారేమో తెలుసుకోండి. అదే కనుక నిజమైతే మీరు కూడా మీకు చేతనైన పని చేసి సంపాదించేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఆ సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. ఆయనకు మరింత దగ్గరవొచ్చు. -
ఐదుగురిని బలిగొన్న క్షణికావేశం...
* ముగ్గురు పిల్లలను, భార్యను చంపి భర్త ఆత్మహత్య * అనాథలైన ముగ్గురు చిన్నారులు సాక్షి, బెంగళూరు : ఆర్థిక సమస్యలు... అటుపై ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మనస్పర్థలు కారణంగా క్షణికావేశంలో తీసుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఐదుగురిని బలితీసుకుంది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరు శివారులోని జిగణి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు....తుమకూరు జిల్లా శిరాకు చెందిన ఫయాజ్ (35) ఉపాధి కోసం పదిహేడేళ్ల క్రితమే బెంగళూరుకు వచ్చాడు. పెయింటర్‌గా పనిచేసే ఫయాజ్‌కు బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరు వద్ద ఉంటున్న కవితా అలియాస్ రేష్మా (30) పరిచయమైంది. పరిచయం ప్రేమకు దారితీసి పెద్దలను ఎదురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరుగురు సంతానం. మొదట్లో వచ్చిన సంపాదనతో కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండేది. అయితే సంతానం పెరడగంతో వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఫయాజ్ ఇబ్బందులు పడేవాడు. ఈ విషయాన్నే సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడేవాడు. మరోవైపు భార్యభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా నాలుగు రోజుల ముందు ఫయాజ్ బెంగళూరు నుంచి మంచేనహళ్లికి మకాం మార్చాడు. శనివారం దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పనిపై బయటికి వెళ్లి రాత్రి ఫయాజ్ ఇంటికి చేరుకున్నాడు. భార్య పిల్లలు మహబూబ్ (5), ఉసాద్ (2), సాదల్ (11 నెలలు) నిద్రపోతూ కనిపించారు. అంతే క్షణికావేశంతో ఇంటి తలుపులు వేసి ముగ్గురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టపక్కల వారు ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి చేతిలో కత్తితో ఉన్న ఫయాజ్ గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి చేర్చగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు పిల్లలు సంఘటన జరిగిన సమయంలో పక్కన ఉన్న ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, భార్య, పిల్లలకు నిప్పంటించినప్పుడు వారు అరుపులు ఎందుకు బయటికి వినిపించలేదు అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరోసిన్ లేదా మంటలు పుట్టించే మరో ద్రావకం ఏదైనా ఉపయోగించాడే అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత పనిచేశావమ్మా..
బాలాయపల్లి: ప్రేమాభిమానాలు, ఆత్మీయ అనురాగాలతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కాపురంలో ఆర్థిక సమస్యలు చిచ్చురేపాయి. ఆరోగ్య సమస్యలు మరింత కష్టాలు తెచ్చాయి. కుటుంబానికి భారం కాకూడదని భావించిన ఆ తల్లి క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను ఒంటరిగా వెళ్లిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతారని భావించినట్టుంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారులను తన వెంట కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. వింటేనే కన్నీరు వస్తున్న ఈ ఘటన బాలాయపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విగతజీవులుగా మారిన తాళ్లూరు సుజాత(30), జోషిక(11), సాకేష్ అలియాస్ వాసు (9)ను చూసి అందరూ కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల కథనం మేరకు..బాలాయపల్లికి చెందిన తాళ్లూరు ప్రసాద్‌కు సైదాపురం మండలం గంగదేవిపల్లికి చెందిన సుజాతతో పదిహేనేళ్ల కిందట వివాహమైంది. వీరి పిల్లలు జోషిక వెంకటగిరిలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏడో తరగతి, సాకేష్ నాలుగో తరగతి చదువుతున్నారు. ప్రసాద్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రసాద్ తల్లి ఇందిరమ్మ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెకు చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చుపెట్టారు. మరోవైపు కొద్దిరోజులుగా సుజాత కడుపునొప్పితో బాధపడుతోంది. భర్త సంపాదన అంతంతమాత్రంగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు తన అనారోగ్య సమస్య తోడవడంతో సుజాత మనస్థాపానికి గురైంది. ఇక కుటుంబానికి భారం కాకూడదని భావించింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం భర్త ప్రసాద్‌తో పాటు అత్త ఇందిరమ్మ, గ్రామంలోని బంధువులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు పుత్తూరు వెళ్లారు. తనతో పాటు జోషికను ప్రసాద్ తీసుకెళతానన్నా సుజాత నిరాకరించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇంటికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో గోడకు అంటించింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి ఉండటంతో స్కూలుకు వెళ్లేందుకు పిల్లలను రెడీ చేస్తోందని ప్రసాద్ తండ్రి రాజయ్య భావించాడు. కాసేపటి తర్వాత బిడ్డలతో సహా వెళ్లి ఇంటికి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతలో పుత్తూరు వెళ్లిన సమీప బంధువు పార్వతి 5 గంటలకు గ్రామానికి వచ్చి సుజాత ఇంటికి చేరుకుంది. ఎవరూ కనిపించకపోవడంతో రాజయ్యను అడగ్గా ఇంట్లోనే ఉన్నట్టున్నారని సమాధానమిచ్చాడు. లోపల చూడగా గోడకు సూసైట్ నోట్ కనిపించడంతో బంధుమిత్రులు, ఇంతలో ఇంటికి వచ్చిన భర్త ప్రసాద్ అందరూ ఆందోళనకు గురై గాలించసాగారు. పోలీసు క్వార్టర్స్ ఆవరణలోని బావిలో ఉదయం 7.30 గంటల సమయంలో తల్లీబిడ్డల మృతదేహాలను గుర్తించి అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అందరి కంటా కన్నీరే.. గ్రామంలో అందరితో ఎంతో బాగుండే సుజాతతో పాటు ఆమె పిల్లలు బావిలో విగతజీవులుగా కనిపించడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంత పనిచేశావమ్మా..అంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి తల్లీబిడ్డల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, వెంకటగిరి సీఐ నరసింహరావు, బాలాయపల్లి ఎస్సై శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పరువు పోతుందని...
ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం ముగ్గురి మృతి: ఒకరి పరిస్థితి విషమం స్థానికంగా విషాద ఛాయలు కుటుంబ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసిన అప్పులు... వినియోగదారులు ఆభరణాల కోసం ఇచ్చిన బంగారాన్ని సైతం తిరిగివ్వలేని పరిస్థితులు... నలుగురికీ ఈ విషయం తెలిస్తే తట్టుకోలేమనే బాధ... వెరసి ఓ కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుషాయిగూడ: ఆర్థిక సమస్యలు... తెల్లారేసరికి రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందజేయాలి...వారు గొడవ చేస్తే ఉనికికే ప్రమాదం... అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం.. ఎన్నో ఏళ్లుగా జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే పరువుపోతుందనే భయం... ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. వారిలో ముగ్గురు ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి చెందగా... మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన పొన్నాడ ఆచార్య (54), పార్వతి(48) దంపతులు ఖమ్మం జిల్లాలో స్థిరపడి... 8 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి ప్రసాద్ (27), నాగబాబు (25) ఇద్దరు సంతానం. ప్రసాద్‌కు భార్య లక్ష్మీతులసి, ఏడాదిన్నర వయసు గల రోహిత్ అనే బాబు ఉన్నారు. వృత్తిరీత్యా స్వర్ణకారులైన వారు నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెం.3లో పార్వతీ జూవెల్లరీస్, రోడ్డు నెంబరు.6లో స్వర్ణ జువెల్లరీస్ పేరుతో రెండు దుకాణాలను ఏర్పాటు చేసి, వ్యాపారం సాగిస్తున్నారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగా సాగింది. ఈ మధ్య కాలంలో కొడుకు పెళ్లి , భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చిట్టీల డబ్బులు తీసుకోవడంతో పాటు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశారు. ఆభరణాలు తయారు చేయాల్సిందిగా వినియోగదారులు ఇచ్చిన బంగారాన్నీ వాడుకున్నారు. అయినాఆర్థిక పరిస్థితి చక్కబడలేదు. మరోవైపు ఆభరణాల కోసం వినియోగదారుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను కష్టమర్లకు అందజేయాల్సి ఉంది. తెల్లవారితే ఇంటి ముందుకు ఎవరొచ్చి గొడవకు దిగుతారో అన్న దిగులుతో శుక్రవారం రాత్రంతా కుటుంబ సభ్యులు కూర్చొని తర్జనభర్జన పడ్డారు. దిక్కు తోచని స్థితిలో ఆచార్య, భార్య పార్వతి, చిన్న కొడుకు నాగబాబులు ఇంట్లో ఉన్న సెనైడ్‌ను గొంతులో పోసుకున్నారు. పెద్ద కొడుకు ప్రసాద్ నోటి వద్ద పెట్టుకున్న సెనైడ్‌ను భార్య లక్ష్మీతులసి తోసేసింది. అంతలోనే వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంట్లోంచి వస్తున్న అరుపులు.. కేకలు.. విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆచార్య, పార్వతి, నాగబాబులు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆస్పత్రికి చేరుకొని మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆచార్య కుటుంబం చాలా పరువు గలదని... అందరితోనూ ఎంతో అప్యాయంగా ఉండేవారని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. -
పరువు పోతుందని...
కుషాయిగూడ: ఆర్థిక సమస్యలు... తెల్లారేసరికి రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందజేయాలి...వారు గొడవ చేస్తే ఉనికికే ప్రమాదం... అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం.. ఎన్నో ఏళ్లుగా జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే పరువుపోతుందనే భయం.. ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులను ఆత్మహత్యకు ప్రేరేపించిం ది. వారిలో ముగ్గురు ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి చెందగా... మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన పొన్నాడ ఆచార్య (54), పార్వతి(48) దంపతులు ఖమ్మం జిల్లాలో స్థిరపడి... 8 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి ప్రసాద్ (27), నాగబాబు (25) ఇద్దరు సంతానం. ప్రసాద్‌కు భార్య లక్ష్మీతులసి, ఏడాదిన్నర వయసు గల రోహిత్ అనే బాబు ఉన్నారు. వృత్తిరీత్యా స్వర్ణకారులైన వారు నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెం.3లో పార్వతీ జ్యువెలరీస్, రోడ్డు నెంబరు.6లో స్వర్ణ జ్యువెలరీస్ పేరుతో రెండు దుకాణాలను ఏర్పాటు చేసి, వ్యాపారం సాగిస్తున్నారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగా సాగింది. ఈ మధ్య కాలంలో కొడుకు పెళ్లి , భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చిట్టీల డబ్బులు తీసుకోవడంతో పాటు తెలిసి న వారందరి దగ్గర అప్పులు చేశారు. ఆభరణాలు తయారు చేయాల్సిందిగా వినియోగదారులు ఇచ్చిన బంగారాన్నీ వాడుకున్నారు. అయినాఆర్థిక పరిస్థితి చక్కబడలేదు. మరోవైపు ఆభరణాల కోసం వినియోగదారుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను కస్టమర్లకు అందజేయాల్సి ఉంది. తెల్లవారితే ఇంటి ముందుకు ఎవరొచ్చి గొడవకు దిగుతారో అన్న దిగులుతో శుక్రవారం రాత్రంతా కుటుంబ సభ్యులు కూర్చొని తర్జనభర్జన పడ్డారు. దిక్కు తోచని స్థితిలో ఆచార్య, భార్య పార్వతి, చిన్న కొడుకు నాగబాబులు ఇంట్లో ఉన్న సెనైడ్‌ను గొంతులో పోసుకున్నారు. పెద్ద కొడుకు ప్రసాద్ నోటి వద్ద పెట్టుకున్న సెనైడ్‌ను భార్య లక్ష్మీతులసి తోసేసింది. అంతలోనే వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంట్లోంచి వస్తున్న అరుపులు.. కేకలు.. విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆచార్య, పార్వతి, నాగబాబులు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆస్పత్రికి చేరుకొని మృతుల బంధువులు, కుటు ంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిం చారు. ఆచార్య కుటుంబం చాలా పరు వు గలదని... అందరితోనూ ఎంతో అ ప్యాయంగా ఉండేవారని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ర్ట స్వర్ణకారుల సంఘ అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్‌చారి కోరారు. ముగ్గురి మరణ వార్త తెలిసిన ఆయన ఇక్కడకు వచ్చి వారికి నివాళులర్పించారు. ఆధునిక హంగులతో నెలకొల్పుతున్న షాపింగ్‌మాల్స్ వల్ల ఉపాధి మార్గాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని... ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి స్వర్ణకారుల ఆత్మహత్యలను నిరోధించి, ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. -
ఫుడ్ ఫర్ చేంజ్
మీరు తినే తిండి ఓ పేద విద్యార్థి జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాగంటారా..! ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ శ్రీకారం చుట్టింది. దానోత్సవ్లో భాగంగా ప్రముఖ హోటళ్ల సహకారంతో జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ‘ఫుడ్ ఫర్ చేంజ్’ నిర్వహిస్తుంది. ఇందుకోసం నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్‌లందరూ కలిసి 16 రకాల భోజనాలు రెడీ చేస్తున్నారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మెడిటరేనియన్, ఏషియన్... ఇలా డిఫరెంట్ వంటకాల రుచులు వేడివేడిగా వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే విందులో ఈ ఐదు హోటళ్లు తమ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. నటి సమంత, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ సహా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన వెయ్యి మందికి ఆహ్వానం పంపామని ఫుడ్ ఫర్ చేంజ్ కన్వీనర్ సుజిత్ తెలిపారు. దీనికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఒకరికి చార్జి రూ.4,000. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సొమ్మును ఏడాది పాటు పేద పిల్లల చదువుకు ఖర్చు చేస్తామన్నారు. టికెట్ కావల్సినవారు 9491100000 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. - సాక్షి, సిటీ ప్లస్ -
భార్యను కత్తితో పొడిచి చంపిన ఎస్సై
కన్న బిడ్డల ఎదుటే దారుణం ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడి హైదరాబాద్: జీవితాంతం తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడుగా మారాడు.. ఆర్థిక సమస్యలతో ఆవేశానికి లోనై తనలో సగభాగాన్ని కిరాతకంగా చంపేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను కత్తితో పొడిచి చివరికి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన భానుప్రకాశ్ (45), సౌజన్య(37)లది ప్రేమ వివాహం. వీరికి తన్మయ్, కౌశిక్ ఇద్దరు సంతానం. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ సమతానగర్ ప్రసాద్ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. కాగా, భానుప్రకాష్ నగరంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికారులకు చెప్పకుండా మూడేళ్ల పాటు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నాడు. దీంతో అధికారులు పలుమార్లు అతనికి నోటీసులు జారీ చేశారు. అయినా భానుప్రకాశ్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో గత ఏడాది అతడిని సస్పెండ్ చేశారు. నాలుగు నెలల కిందటే కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రసాద్ రెసిడె న్సీలో వీరి కుటుంబం అద్దెకు దిగింది. ఉద్యోగం పోవడంతో జీతం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో దంపతులిద్దరూ రోజూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భానుప్రకాశ్, సౌజన్యల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికిలోనైన భానుప్రకాష్ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత తన ఇద్దరు పిల్లలను ఆల్విన్‌కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ముందుంది గతుకుల రోడ్డు: ఎస్అండ్పీ
భారత్ సహా అధిక ద్రవ్యలోటుతో సతమతమవుతున్న దేశాలన్నీ స మీప భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) హెచ్చరించింది. భారత్, ఇండొనేసియా వంటి దేశాలు రాబోయే రోజుల్లో గతుకుల రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఇది మరో ఆసియా సంక్షోభానికి దారి తీయకపోవచ్చని దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై రూపొం దించిన నివేదికలో ఎస్‌డ్‌పీ తెలిపింది. సానుకూల అంశాల విషయానికొస్తే.. సింగపూర్ లాంటి వాణిజ్య ఆధారిత ఎకానమీల కన్నా దేశీయంగా డిమాండ్ నెలకొన్న భారత్, చైనా వంటి దేశాలకు వృద్ధిపరమైన రిస్కులు తక్కువగా ఉంటాయని వివరించింది.