రైలు కింద పడి అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య | brother and sister commits suicide by jumping before moving train | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య

Published Wed, Jan 28 2015 6:10 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

brother and sister commits suicide by jumping before moving train

మహబూబ్‌నగర్: ఆర్థిక సమస్యలు, పేదరికంతో మనస్తాపానికి గురైన అన్నా, చెల్లెలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు (25), పాపమ్మ (20) అన్నాచెల్లెళ్లు. వీరి తండ్రి మూడేళ్లక్రితమే మృతిచెందగా, తల్లితోపాటు యాచక వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

కొన్నాళ్లుగా వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన అన్నాచెల్లెళ్లు బుధవారం తెల్లవారుజామున సమీపంలోని పట్టాల వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement