brother and sister
-
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)
-
Up: నగదు కోసం ఆశ.. సొంత సోదరుడితోనే పెళ్లి !
లక్నో: ఇప్పటికే పెళ్లైన ఒక సోదరి ఈసారి ఏకంగా తన సొంత సోదరుడినే వివాహం చేసుకుంది. అయితే ఇది సీరియస్‌గా కాదు. ఓ స్కీమ్ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమిచ్చే నగదు కోసం ఆశపడి వారిద్దరు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్గంజ్జిల్లాలోని లక్ష్మిపూర్ బ్లాక్‌లో ఈ వింత ఘటన జరిగింది. మొత్తం 38 జంటలు సామూహిక వివాహాల్లో పాల్గొంటే అందులో అన్నా చెల్లెలు పాల్గొని పెళ్లి తంతు కానిచ్చేశారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన కానుకలను తీసుకున్నారు. నగదు వస్తుందని మధ్యవర్తులు చెప్పడం వల్లే వారు ఈ పెళ్లికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ బోగస్ పెళ్లి విషయాన్ని అధికారులు కనిపెట్టారు. అన్నాచెల్లెళ్లకు ఇచ్చిన బహుమతులు తిరిగి తీసుకుంటున్నామని, వారికి రావాల్సిన నగదు బహుమతిని కూడా ఆపివేస్తున్నామని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, యూపీలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ్ యోజన కింద పెళ్లికూతురు బ్యాంకు ఖాతాలో రూ.35వేలు ప్రభుత్వం వేస్తుంది. వీటికి తోడు పెళ్లి కోసం మరో 16 వేల ఖర్చుపెడుతుంది. ఈ మొత్తం నుంచి కొత్త జంటకు కానుకలు ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ఇదీ చదవండి.. 10 పాయింట్లలో బీహార్ గొప్పతనం -
ప్రేమ వివాహం చేసుకుందని.. చెల్లెలిపై అన్న ఘాతుకం!
మహబూబ్‌నగర్: ప్రేమ వివాహం చేసుకుందని ఓ అన్న చెల్లెలిని కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం మండలంలోని గుంపన్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెంచుపల్గుతండాకు చెందిన అఖిల, గుంపన్‌పల్లికి చెందిన శ్రీరాం ప్రేమించుకున్నారు. ఇటీవల దేవాలయంలో వివాహం చేసుకున్నారు. వారం రోజుల కిందట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. స్థానిక పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. యువతి మైనర్ కావడంతో పెద్దలు ఎవరి ఇంటికి వారు వెళ్లాలని సూచించారు. రెండు రోజుల క్రితం యువతి గుంపన్‌పల్లికి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు అఖిల్ మంగళవారం గుంపన్‌పల్లికి వచ్చి చెల్లెలితో మాట్లాడుతూ.. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో నడుము భాగాన పొడిచాడు. ఆమె అరవడంతో అఖిల్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి యువతిని అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీ భాగాన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు గుంపన్పల్లి మాజీ సర్పంచ్ రతన్‌సింగ్ తెలిపారు. అఖిల ఫిర్యాదు మేరకు సోదరుడు అఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాములు తెలిపారు. ఇవి చదవండి: కారును ఓవర్టేక్ చేస్తుండగా.. విద్యార్థి విషాదం! -
రాజేంద్రనగర్‌లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో..
హైదరాబాద్: వారిద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అవుతారు. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మోనిక తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహ గౌడ్, సోమేశ్ గౌడ్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ కేశవ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. పై అంతస్తులో నర్సింహ, స్వప్న దంపతులు తమ ఇద్దరు కుమారులతో పాటు నర్సింహ మేనమామ కుమారుడు, స్వప్న సోదరుడైన శేఖర్ (26) ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్, ఆయన భార్య స్రవంతి (28), ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. నర్సింహ, సోమేశ్ అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు జాబ్ చేస్తుండగా.. శేఖర్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. పిల్లలు ఇంటికి వచ్చి చూడగా.. మంగళవారం స్వగ్రామంలో బంధువు దశదిన కర్మ ఉండటంతో నర్సింహ, సోమేశ్‌తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి, చందు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలి వెళ్లగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో ఈ విషయం చెప్పారు. వారు సోమేశ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగతజీవులై కనిపించారు. పంచనామా చేసి ఇరువురి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సింహ, సోమేశ్, స్వప్న ఇంటికి చేరుకున్నారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని, తామంతా కలిసి మెలిసి ఉండేవాళ్లమన్నారు. శేఖర్ ఐదేళ్లుగా తమతోనే ఉంటున్నాడని.. వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నర్సింహ, సోమేశ్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అన్నా చెల్లెళ్ల దారుణ హత్య
తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో అన్నా చెల్లెళ్లు దారుణంగా హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్, మనీషా దంపతులకు షక్షీమ్(6), ప్రజ్ఞాన్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది నుంచి భర్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో దూరంగా ఉండేవారు. అయితే యువరాజ్ 4 రోజుల కిందట తిరుపతి కి చేరుకుని నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో బస చేశాడు. ఇదే క్రమంలో భార్యకు ఫోన్ చేసి, తిరుపతి కొస్తే మాట్లాడుకుందామని చెప్పా డు. దీంతో మనీషా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వర కు రైలులో వచ్చి, అక్కడి నుంచి తన అన్న హర్షవర్దన్‌తోపాటు విమానంలో తిరుపతికి చేరుకుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్ తన భార్య మనీషాతోపాటు ఆమె అన్న హర్షవర్ధన్(25) కూడా దారుణంగా కత్తితో పొడిచి, హత్య చేశాడు. అయితే హత్యకు కారణాలు పలు కోణాల్లో వినిపిస్తున్నాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలున్నాయని, యువరాజును హత్య చేస్తే పెద్ద మొత్తంలో ఆస్తి వస్తుందని, అతడిని చంపడానికి వారు తిరుగు తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే యువరాజ్ చంపి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. యువరాజ్ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలిసిందని సీఐ చెప్పారు. అయితే నిజాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామన్నారు. -
గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు. చదవండి: పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు.. -
యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి..
లక్నో: యూపీలోని బారాబంకిలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్ళ మధ్య వాగ్వాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి హత్యకు దారితీసింది. అన్న ఆవేశాన్ని ఆపుకోలేక తోడబుట్టిన చెల్లెలిని కిరాతకంగా తల నరికి చంపి తలతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బారాబంకి మిత్వారా గ్రామంలో నివాసముంటున్న రియాజ్(22) అతని సోదరి ఆషిఫా(18) మధ్య ప్రేమ విషయమై చిన్న వివాదం చోటుచేసుకుంది. చెల్లెలు ఆషిఫా అదే గ్రామానికి చెందిన చాంద్ బాబుతో వెళ్ళిపోయినందుకు రియాజ్ ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె అన్నయ్యకు మొదట నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా రియాజ్ శాంతించకపోవడంతో ఆషిఫా కూడా ఎదురు సమాధానం చెప్పింది. ఆలోచన పనిచేయక.. ఆగ్రహోద్రిక్తుడైన రియాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. దగ్గర్లోని పదునైన కత్తిని తీసుకుని ఒక వేటుకు చెల్లి తలా మొండెం వేరుచేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం చెందకుండా తెంచిన తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిందంతా వివరించి లొంగిపోయాడని తెలిపారు. ఈ సంఘటను పరువు హత్యగా పేర్కొంటూ సాక్ష్యాధారాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో పరువు హత్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. వయసుకొచ్చిన అమ్మాయిలు ఎవరికి వారు తమ జీవితభాగస్వాములను ఎంచుకుని తొందరపాటులో చేసే చిన్న పొరపాటే ఇంతటి అనర్ధాలకు దారితీస్తోంది. నచ్చజెప్పడమైనా సర్దుకుపోవడమైనా ఓ మెట్టు దిగే గుణంలోనే ఉంటుందన్న ఇంగితాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ ప్రయోజనం లేని నిర్ణయాలతో ఆవేశానికి లోనై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
మా నాన్నను విడిపించండి
న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ ఖమర్(62)ను యూపీలోని మీరట్‌లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన ఖమర్ అక్కడి పాస్పోర్టుతో భారత్‌కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్ ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్‌కు భారత్‌లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. -
అన్నా చెల్లి ప్రతిభ.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక
సాక్షి, రాయచూరు(కర్ణాటక): పోటీ ప్రపంచంలో అన్నా చెల్లి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. లింగసుగూరు తాలూకా అశిహళతండాకు చెందిన కార్తీక్ రాథోడ్, రూపా రాథోడ్ ఉత్తమ ర్యాంకులు సాధించి ఎస్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. తండ్రి గురుగుంట కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఆరేళ్లుగా పరిచయం.. కారులో తీసుకెళ్లి అత్యాచారం) -
అన్నా.. నీవెంటే నేను..
సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): అన్నా.. నీ వెంటే నేనూ అంటూ సోదరుడు మరణించిన గంట వ్యవధిలో సోదరి కూడా మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌లో మంగళవాం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన నర్వటె మారుతి(65) తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందాడు. ఆదే గ్రామంలో ఉంటున్న చెల్లెలు మస్కె రేణుక(48) అన్న మరణ వార్త విని వెంటనే సోదరుడి ఇంటికి చేరుకుంది. మారుతి మృతదేహం వద్ద రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. బంధువులు వెంటనే రేణుకను ప్రైవేటు వాహనంతో ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేణుక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న చనిపోయాడన్న బాధతో రేణుక కూడా గుండెపోటుతో మృతిచెంది ఉంటుందని తెలిపారు. గంట వ్యవధిలోనే అన్నాచెల్లెలు మృతిచెందడంతో తేజాపూర్‌లో విషాదం నెలకొంది. నర్వెట మారుతికి భార్య రత్నాబాయి, మస్కె రేణుకాబాయికి కూతురు నిర్గున, కొడుకు గోరాక్నాథ్ ఉన్నారు. బంధువులు అన్నాచెల్లెలిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేశారు. -
అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య
సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్ మాట్లాడటం లేదని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఈ దృశ్యం చూస్తే అయ్యో అనకుండా ఉండలేం
సాక్షి, హైదరాబాద్: పైన ఫొటోలో కన్పిస్తున్న దృశ్యం చూస్తే అయ్యో అనకుండా ఉండలేం కదా. అవును..ఇది ఓ కేన్సర్ పేషెంట్ దీనగాథ. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన పాండు రంగ కరాడే సోదరి ఇందూబాయికి నోటి కేన్సర్ సోకింది. దీంతో మంగళవారం చికిత్స కోసం ఆమెను బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు పాండురంగ. పరీక్షించిన వైద్యులు తగిన వైద్యం చేసి..తిరిగి ఐదు రోజులకు మళ్లీ ఆస్పత్రికి తీసుకురమ్మన్నారు. అయితే.. నాందేడ్‌కు వెళ్లి మళ్లీ తిరిగి ఐదురోజులకే హైదరాబాద్‌కు రావాలంటే దారి ఖర్చులు ఎక్కువ అవుతాయని భావించిన పాండురంగ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆస్పత్రి సమీపంలో ఓ చెట్టుకింద ఆశ్రయం పొందాడు. నోటి కేన్సర్ కారణంగా ఆమె ఘనాహారం తీసుకోవడం లేదు. దీంతో ఇలా తన అక్కకు పైపు ద్వారా ద్రవాహారం అందిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. కూలీనాలీ చేసుకునే తనకు ఖర్చులు భరించే శక్తి లేదని, గదిని కూడా అద్దెకు తీసుకునే స్థోమత లేదని చెప్పుకొచ్చాడు. ఈ దారిగుండా వెళ్లిన వారంతా ఈ దృశ్యం చూసి చలించిపోయారు. -ఫోటోలు: దయాకర్ తూనుగుంట్ల చదవండి: మార్కెట్లోకి రూ.20 నాణేలు -
ఎంత కర్కశం: తోబుట్టువులనే కనికరం లేకుండా..
ఆస్తిపై పెంచుకున్న మమకారం ఆప్తులపై లేకుండా పోయింది. రూ.5 లక్షల డబ్బుపై పెరిగిన ప్రేమ రక్తం పంచుకు పుట్టిన అన్న, అక్కలపై ద్వేషానికి కారణమైంది. పరిహారం విషయంలో తలెత్తిన స్ఫర్థ ఓ కుటుంబంలో దారుణ హత్యలకు దారి తీసింది. తలకెక్కిన దురాశ విచక్షణను కోల్పోయేలా చేసింది. రణస్థలం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ వ్యక్తి సొంత అన్న, అక్కలనే హత్య చేశాడు. కేవలం ఆస్తిలో వాటా డబ్బు కోసం తోబుట్టువులను కర్కశంగా నరికి మట్టు పెట్టాడు. రణస్థలం (శ్రీకాకుళం): కొవ్వాడ మత్స్యలేశం పంచాయతీలో గల రామచంద్రాపురం గ్రామంలో గొర్లె సన్యాసిరావు (54), అక్క జయమ్మ(50)లు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. సొంత తమ్ముడు రామకృష్ణ వీరి పాలిట కాలయముడయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కశంగా దాడి.. గ్రామంలో ఉదయం 5.45 గంటల సమయంలో గొర్లె సన్యాసిరావు తన ఇంటి వ ద్ద ఆవు పాలు పితుకుతుండగా.. వెనక నుంచి వచ్చిన రామకృష్ణ కత్తిలో బలంగా అతడి తలపై వేటు వేశాడు. ఆ తర్వాత కూడా మెడ, ఇతర భాగాలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధతో అతను అరుస్తుంటే.. లోపల నుంచి అక్క జయమ్మ బయటకు వచ్చి చూసి నిశ్చేష్టురాలైంది. దివ్యాంగురాలైన ఆమె వచ్చి ప్రతిఘటించగా రామకృష్ణ ఆమెపైనా దాడికి దిగా డు. శరీరమంతా కత్తితో గాయాలు చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వారు చూసి వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయా డు. సన్యాసిరావును ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా కొద్ది దూరం వెళ్లే సరికే ప్రాణాలు వదిలేశాడు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహీంద్ర, సీఐ వి.చంద్రశేఖర్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత నిందితుడు రామకృష్ణ జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. జేఆర్ పురం ఎస్ఐ కె.వాసునారాయణ మృతదేహాలను శవ పంచనామాకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారసత్వ ఇంటితోనే వివాదం.. రామచంద్రాపురంలో సన్యాసిరావు కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. సన్యాసిరావు ఇద్దరు అక్కలు అవివాహితులు కావడంతో వారు అన్నతోనే ఉంటున్నారు. రామకృష్ణ తన కుటుంబంతో వేరేగా ఉంటున్నారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భాగంగా ఊరి వారికి పరిహారాలు చెల్లిస్తున్నారు. పరిహారాల పంపిణీలో భాగంగా వీరికి పంపకాలు జరిగిపోయాయి. అయితే అవివాహితులైన మహిళలు ఇంతకు ముందు ఓ పెంకుటింట్లో ఉండేవారు. ఆ ఇంటికి కూడా రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చింది. ఆ డబ్బులో తనకు వాటా కావాలని రామకృష్ణ పంచాయతీ పెట్టాడు. ఆడవాళ్ల సొమ్ము మనకు వద్దని సన్యాసిరావు సర్ది చెప్పినా వినలేదు. తన వాటాగా రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనిపై తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఆఖరకు రామకృష్ణకు రూ.5లక్షలు ఇవ్వడానికి సన్యాసిరావు, అక్కలు ఒప్పుకున్నారు. అయితే ఇకపై తమతో ఆర్థిక లావాదేవీలేవీ పెట్టుకోకూడదని, తమను ఏ విషయంలోనూ వేధించకూడదని పెద్ద మనుషుల సమక్షంలో రాత పూర్వకంగా ఒప్పుకోవాలనే డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ విషయంలో రామకృష్ణ కోపోద్రిక్తుడయ్యాడు. తానెందుకు సంతకం పెట్టాలంటూ గొడవ పెట్టుకున్నాడు. తెల్లవారే సరికి ఆ కోపంతోనే అన్న, అక్కలపై దాడి చేసి హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు కూతుళ్ల భవిష్యత్ ఏంటి..? సన్యాసిరావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు మే 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా తీశారు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు నిందితుడు రామకృష్ణ తన కూతురికి ఓ పోలీసు అధికారితో వివాహం చేయడం గమనార్హం. సన్యాసిరావు మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి.. ‘అప్పు తీరుస్తారా.. బిడ్డను అమ్ముతారా..?’ -
అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని..
కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఓ అన్న చెల్లెలిపైనే దాడిచేసి ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి పుట్టుకతోనే అంధురాలు. ఈమెకు ముగ్గురు అన్నలు. ఆమె మూడో అన్న తిప్పేస్వామి వద్ద ఉంటోంది. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల్లో ఆమె పెద్దన్న ఉలిగన్న సాయంతో ఓటు వేసింది. రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలైన తిప్పేస్వామి, అతని కుటుంబ సభ్యులు నువ్వు టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి వేశావంటూ దుర్భాషలాడుతూ లక్ష్మీదేవిపై దాడిచేసి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. విషయం సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో బుధవారం ఉదయం కూడా తిప్పేస్వామి కుటుంబ సభ్యులు మరోసారి ఆమెపై దాడికి పాల్పడ్డారు. చదవండి: కానిస్టేబుల్ పాడు పనులు.. అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా.. -
టీడీపీకి ఓటేయలేదని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన అన్న
సాక్షి, కళ్యాణదుర్గం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఓ అన్న చెల్లెలిపైనే దాడిచేసి ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి పుట్టుకతోనే అంధురాలు. ఈమెకు ముగ్గురు అన్నలు. ఆమె మూడో అన్న తిప్పేస్వామి వద్ద ఉంటోంది. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల్లో ఆమె పెద్దన్న ఉలిగన్న సాయంతో ఓటు వేసింది. రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలైన తిప్పేస్వామి, అతని కుటుంబ సభ్యులు నువ్వు టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి వేశావంటూ దుర్భాషలాడుతూ లక్ష్మీదేవిపై దాడిచేసి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం కూడా తిప్పేస్వామి కుటుంబ సభ్యులు మరోసారి ఆమెపై దాడికి పాల్పడ్డారు. -
సోదరిపై ప్రేమ: అతడు చేసిన పని హాట్‌టాపిక్..
సాక్షి, ముంబై: సాధారణంగా తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకురావడానికి బైక్ లేదా ఆటోలో వెళతారు. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే సొంత కారులో లేదా అద్దె వాహనంలో వెళతారు. కానీ, జల్గావ్ జిల్లాలో తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి ఏకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చిన సంఘటన సర్వత్రా చర్చనీయంశమైంది. తన సోదరికి వినూత్నంగా స్వాగతం పలకాలనే ఉద్ధేశంతో విరాజ్ కావడియా అనే వ్యక్తి ఈ ఏర్పాట్లు చేశాడు. అకస్మాత్తుగా హెలికాప్టర్ గ్రామం బయట ల్యాండ్ కావడంతో కొద్దిసేపు గ్రామస్తులకు అర్థం కాలేదు. తరువాత ఇటీవల పెళ్లయిన తన సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్లో వచ్చినట్లు తెలియగానే ఆశ్చర్యపోయారు. సోదరికి సర్ప్రైజ్ ఇవ్వాలని. జల్గావ్ జిల్లాకు చెందిన శివాని కావడియా పెళ్లి పర్లీలోని వైజ్యనాథ్ ప్రాంతంలో ఉంటున్న జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ కుణాల్ జైన్‌తో ఇటీవల పెళ్లైంది. కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన కొద్ది రోజులకు పెళ్లి కూతురును పుట్టింటికి తీసుకురావాలి. దీంతో తన సోదరిని తానే తీసుకురావాలని సోదరుడు విరాజ్ కావడియా భావించాడు. కానీ, కారులో లేదా బైక్‌పై తీసుకురావడం సర్వసాధారణం. దీంతో సర్ఫ్రైజ్ చేయాలని కొత్త పద్దతిని ఆలోచించాడు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని సోదరి గ్రామానికి వెళ్లాడు. ఊరు బయటున్న బారిస్టర్ నికం మైదానంలో ల్యాండింగ్ చేశాడు. ఈ వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..) -
ఈ అన్నా చెల్లెలి బంధం చాలా వెరైటీ!
లూబా తొమ్మిది నెలల వయసుకు వచ్చింది. నెలనాళ్ల పిల్లగా ఉండగా వెయ్యి రూపాయలు పెట్టి లూబాను కొని ఇంటికి తెచ్చుకున్నాడు టెర్డే యోమ్చా. సొంత చెల్లిలా చూసుకున్నాడు. లూబా అందమైన ఆడ ఎలుగు పిల్ల. గౌన్లు కుట్టించాడు. వెంటపెట్టుకుని ఊళ్లో తిప్పాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపు ఈ అన్నా చెల్లెళ్లది. చెల్లికి తనే స్నానం చేయించేవాడు టెర్డే. చెల్లిని పూర్తి శాకాహారిగా పెంచాడు. పప్పన్నం, క్యాబేజీ, మొక్కజొన్న, టమాటా, చెరకుగడలు, పండ్లు ప్రేమగా తినిపించేవాడు. పాలు తాగించేవాడు. లూబా కూడా ఎప్పుడూ టెర్డే అన్నయ్య వెంటే ఉండేది. అన్నయ్య ఏం చేస్తుంటే అది చెయ్యాలని చూసేది. అన్నయ్య పాఠ్యపుస్తకాలు చదువుతుంటే తనూ చదవడానికి తయారయ్యేది! మనిషి, ఎలుగు తోడబుట్టినట్లు ఉండేవారు. ఇన్ని చెబుతుంటే.. ‘అయ్యో భగవంతుడా లూబాకు ఏమైనా అయిందా?’ అనిపిస్తుంది. పాత సినిమాల్లో అంతే కదా. హీరో చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్ లో ’అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’ అనో, ’అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం’ అనో పాట పూర్తి అవగానే ఎక్కడినుంచో దోపిడీ దొంగలు వచ్చి ఆమెను కిడ్నాప్ చేసేవారు. లేదంటే తుపాకీతో కాల్చేసి వెళ్లేవారు. లూబాకు అలాంటిదేమీ కాలేదులెండి. అన్న టెర్డే కే అయింది. లూబాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఇచ్చేశాడు! వాళ్లు లూబాను అడవిలో వదిలేయబోతుంటే.. ‘వద్దొద్దు. అడవిలో ఎలా పెరుగుతుందో ఏమో పిచ్చిపిల్ల‘ అని వెనక్కు తీసుకుని వాళ్ల చేతే ఇటానగర్ లోని ‘జూ’ లో చేర్పించాడు. రాజధాని నగరం అది. అక్కడైతే తన చెల్లి కంఫర్ట్‌గా పెరుగుతుందని అన్న మనసు తలచింది. చెల్లిని చూడాలనిపించినప్పుడు వెళ్లి చూసే ఒప్పందం కూడా జూ అధికారులతో చేసుకున్నాడు. చెల్లిని వదిలేసి వస్తున్నప్పుడు అన్నని, ‘ఇప్పటివరకు అన్నయ్య నాతోనే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమయ్యాడు!’ అని బోను లోపలి నుంచి అన్నయ్యను వెతుక్కుంటున్న చెల్లినీ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాలేదంటే వాళ్లు మనుషులు గానీ, ఎలుగులు కానీ అయి ఉండరు. అయినా టెర్డే అన్నయ్య మనసు చంపుకుని ఇంత పని ఎందుకు చేసినట్లు? స్కూల్ చదువు పూర్తయి, కాలేజ్‌కి వచ్చాడు. కాలేజ్‌లో చేరేందుకు వేరే ఊరు వెళ్లిపోతున్నాడు. చదువులెంత కనికరం లేనివి! -
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల దుర్మరణం
శ్రీకాకుళం, రణస్థలం: సోమవారం తూరుపు తెల్లారకముందే ఇద్దరి జీవితాలు తెల్లారిపోయాయి. టైర్ పంక్చర్ అయ్యిందని ఓ డ్రైవర్ లారీని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన రోజుల తరబడి నిలిపివేస్తే.. మరో డ్రైవర్ అంతకంటే నిర్లక్ష్యంతో అతివేగంగా బండి నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. వీరిద్దరి అలసత్వం కారణంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రణస్థలం మండలం కోష్ట వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మందస మండలం చిన్న నారాయణపురానికి చెందిన మడియా ఢిల్లీశ్వరరావు(22), మడియా వసంత(20)గా గుర్తించారు. ఈ ఘటనలోనే డ్రైవర్ మూర్తి, పాప కుసుమ(8)లకు తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్ పురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించడంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల ముందే ఇంటికి వద్దామని అక్కడి సిటీ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లతో పాటు మేనమామ కూతురు కుసుమ కూడా బయల్దేరింది. సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్ వీరిని తీసుకుని కారులో మందస మండలానికి పయనమయ్యారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి సమీపానికి వచ్చేసరికి.. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీటులో ఉన్న ఢిల్లీశ్వరరావు, వసంతలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుసీట్లలో ఉన్న డ్రైవర్ మూర్తి, కుసుమలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మేమున్నాం సేవా సంస్థ అంబులెన్స్‌లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్‌పురం ఎస్ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు రిమ్స్‌లోనే శవ పంచనామా చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. చిన్ననారాయణపురంలో విషాద ఛాయలు మందస: మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన మడియా పాపారావు కుమారుడు ఢిల్లీశ్వరరావు, మడియా త్రినాథ్ కుమార్తె వసంతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నా యి. పాపారావు, త్రినాథ్ అన్నదమ్ములు. ఉన్న త ఉద్యోగాలు చేసి కుటుంబాలకు అండగా నిలబడతారని అనుకుంటే ఇలా యుక్త వయసులో నే వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు రోదించారు. వసంత తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో సమాచారం వారికి చేరవేశారు. అక్కడి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో వారు జిల్లాకు ప్రయాణమయ్యారు. -
తమ ప్రేమను అంగీకరించడం లేదని..
కుల్కచర్ల: వరుసకు ఇద్దరూ అక్కాతమ్ముడు. అయినా, వారి మనసులు కలిశాయి. కొంత కాలంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు.. వరుస సరికాదు.. వద్దని వారించి సర్దిచెప్పారు. తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరించడం లేదని మనోవేదనకు గురైన యువతి, యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కామునిపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రశాంత్ (19) అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20) పదో తరగతి వరకు చదివారు. యువతి ఇంటి వద్దే ఉంటోంది. వీరిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు. ప్రశాంత్ తల్లిదండ్రులు నగరంలో ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్నారు. యువకుడు వారికి సాయంగా ఉంటే అక్కడే ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రశాంత్, యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు విషయం తెలుసుకొని వారించారు. వరుస సరికాదని వద్దని సర్దిచెప్పి హెచ్చరించారు. అయినా, యువతి, యువకుడు తమ ప్రేమను కొనసాగించారు. ప్రశాంత్ సోమవారం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున యువతితోపాటు ప్రశాంత్ తన ఇంట్లో ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొరుగింటి వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
చిన్నారులను కాపాడి అన్న, చెల్లెలు మృతి
తూప్రాన్: విహారం విషాదాంతం అయింది. నీటిగుంత అన్న, చెల్లెలిని మింగేసింది. రెండు కుటుంబాలు ఆనందంగా ఉన్న తరుణంలో పెను విషాదం చోటు చేసుకుంది. మునిగిపోతున్న వారిని కాపాడి అన్న, చెల్లెలు విగత జీవులైన ఘటన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో జరిగింది. ఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నర్సింహులు దేవుని మొక్కు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నరసింహస్వామి గుట్ట వద్దకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. తన ఇద్దరు చెల్లెళ్లయిన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన సునీత, నరేందర్ దంపతులు, కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత, వారి కుటుంబ సభ్యులను ఆహా్వనించాడు. దేవుని వద్ద మొక్కులు తీర్చుకొని భోజనాలు చేశారు. అనంతరం పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినోద్‌కుమార్ అనే బాలుడితో పాటు మరో బాలిక గుట్ట కింద ఉన్న నీటిగుంతలో పడిపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న లలిత కుమారుడు ప్రశాంత్(22) వెంటనే గుంతలో పడి ఉన్న ఇద్దరు చిన్నారులను పైకి లాగేసి ఒడ్డున పడేశాడు. కానీ తరువాత అతడు ఆ గుంతలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన అతని చిన్నమ్మ కూతురు పావని (17) అన్నను కాపాడేందుకు గుంతలోకి దిగి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో పావనిని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావని మృతి చెందింది. అలాగే నీటి గుంతలో పడి మృతిచెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
అన్న చెల్లెళ్లు లేనివారు ఏం చేయాలి?
రాఖీ పండుగ రోజు సోదరుల చేతికి రాఖీ కట్టి కష్టసుఖాలలోసోదరుడు తోడునీడై ఉండాలని కోరుకోవడం సహజం. అయితే అన్నతమ్ముల లేదా అక్కచెల్లెళ్లు లేనివారు ఏం చేయాలి? సోదరులుగా భావించే వారి చేతికి రక్షాబంధనం కట్టాలి. కానీ, అటువంటి అవకాశం కూడా లేనివారు ఏం చేయవచ్చంటే... ఒక పచ్చని చెట్టుకు లేదా ఒక మూగజీవికి రక్షాబంధనం కట్టచ్చు. ఆ చెట్టు లేదా ఆ మూగజీవి సంరక్షణ బాధ్యత తీసుకోవచ్చు. చెట్టుకు కడితే వృక్షబంధనమనీ, జీవ రక్షణమనీ పిలుచుకోవచ్చు. పేరు ఏదైతేనేం... రక్షన వహించడమే కదా అసలు ఉద్దేశ్యం. వృక్షాలైతే స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు ఫలాలు ఇస్తాయి. జంతువులైతే మానసిక ఆహ్లాదాన్నిస్తాయి. -
అప్పు చెల్లించలేదని తమ్ముడిపై అక్క దౌర్జన్యం
-
ఇంటికొచ్చిన ఆకాశం
ప్రాణం పోయినంత పనౌతుంది.. దగ్గరి బంధువు పోతే!జ్ఞాపకాలు గుచ్చిగుచ్చి ఏడ్పిస్తాయి.. నిర్లక్ష్యాలు వెక్కిరిస్తాయి!అనుబంధాలు చక్కిలిగిలి పెడ్తాయ్!మనిషిపోతే.. ఇంకా ఎంతో ఉంటుంది..లేమి గుండె నింపుతుంది... తలపు తలుపు తెరుస్తుంది..ఆకాశం ఇంటికొస్తుంది!! ‘‘నిరంజన్... ఓ అన్న. జానకి.. అతని చెల్లెలు. కుటుంబం కోసం కష్టపడ్డం తప్ప ఇంకేం తెలియని.. పట్టని మనిషి అతను. అన్న అనుబంధం కోసం తపించే చెల్లెలు ఆమె. ఈ ఇద్దరి కథే... ‘‘హ్యాపీ జర్నీ’’.. మరాఠీ సినిమా. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. రక్తసంబంధంగా మాత్రమే మిగిలిన ఆ బంధం.. ఆప్యాయతానురాగాల అనుబంధంగా ఎలా బలపడిందో చూపే ప్రయాణం. తొలి మజిలీ గ్యారేజ్ నడుపుతున్న తండ్రి ఆర్థిక బాధ్యతను పంచుకోవడానికి టీనేజ్లోనే గల్ఫ్‌కి వెళ్తాడు నిరంజన్. అప్పటికి జానకి వయసు రెండేళ్లు. అవసరమున్నప్పుడు అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడ్డం తప్ప దాదాపుగా ఇండియాకు రాకుండానే పనిలో మునిగిపోతాడు. ఇంటికి డబ్బులు పంపించడమే అతని ధ్యేయం. అలాంటి నిరంజన్.. కుటుంబంలో జరిగిన ఓ విషాదం వల్ల ఇండియా వస్తాడు. అప్పటికి అతని చెల్లెలి వయసు పదిహేడేళ్లు. మూడో రోజు.. నిరంజన్ గల్ఫ్ నుంచి వచ్చిన మూడోరోజున .. నాలుగువేల రూపాయల ఇంటర్నెట్ బిల్ వస్తుంది. ‘‘ఇంత బిల్ ఏంటీ’’ అంటూ పేరెంట్స్‌ని కేకలేస్తాడు. ‘‘నాకేం తెలీదు.. జానకే వాడేది’’ తల్లి చెప్తుంది అమాయకంగా. ఆ రాత్రి .. ఇంటి బయట.. వ్యాన్‌లో చెల్లెలు ఉన్నట్టు నిరంజన్‌కు కలొస్తుంది. దిగ్గున లేచి ఆరుబయటకు వస్తాడు. వ్యాన్లోకెళ్తాడు. వెనక సీట్లో ఓ అమ్మాయి అటు తిరిగి పడుకుని ఉంటుంది. షాక్ అవుతాడు. శంకిస్తూనే ఆ అమ్మాయి భుజం తడ్తాడు. ఆ పిల్ల ఇటు తిరుగుతుంది. అవాక్కవుతాడు. చెల్లెలు! ‘‘నువ్వు .. ఇక్కడ?’’ విస్మయంగా అతను. ‘‘అవున్నేనే’’ అంటూ లేచి కూర్చుంటుంది జానకి. లాంగ్‌డ్రైవ్‌కి తీసుకుపొమ్మని అడుగుతుంది. ‘‘లాంగ్ డ్రైవ్ లేదు ఏం లేదు. ముందు ఇక్కణ్ణుంచి వెళ్లిపో’’ అని కోప్పడ్తూ వ్యాన్ దిగి ముందున్న పచ్చికలో కూర్చుని కునికిపాట్లు పడ్తుంటాడు. హఠాత్తుగా మెలకువ వస్తుంది. వ్యాన్ విండో సీట్లోంచి తననే చూస్తూ జానకి కనిపిస్తుంది. పెంకిపిల్ల అని విసుక్కుంటూ ‘‘లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళితే వెళ్లిపోతావా?’’ అని అడుగుతాడు. ‘‘నేననుకున్న పని పూర్తవగానే వెళ్లిపోతా.. నువ్వు ఉండమన్నా ఉండను’’ అంటుంది. తెల్లవారి... ఇంటిముందున్న వ్యాన్ని చూపిస్తూ ‘‘అది బాగైపోతే డెలివరీ చేయొచ్చు కదా’’ అంటాడు తండ్రితో నిరంజన్. ‘‘ఇంకా కొంచెం పనుంది’’ చెప్తాడు తండ్రి. లోపల గదిలో.. బట్టలు మూటకడుతూ ‘‘జానకి బట్టలు.. అనాథాశ్రమంలో ఇచ్చొస్తావా?’’ బాధ నిండిన స్వరంతో అడుగుతుంది నిరంజన్ వాళ్లమ్మ. ‘‘అమ్మా.. ఆత్మలుంటాయా?’’ అడుగుతాడు. ‘‘కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా మారి కోరికలు తీర్చుకుని పోతారు. అవునూ .. ఎందుకడిగావ్ ఇది?’’ అంటుంది తల్లి. ‘‘తెలుసుకుందామని’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ లోపు బయటనుంచి ఒకటే హార్న్.. చెవులు చిల్లులు పడేలా. చిరాకు పడుతూనే ఇంట్లో ఎవరూ చూడకుండా టీ తీసుకెళ్లి వ్యాన్ విండోలోంచి చెల్లికి ఇస్తాడు. ‘‘కాఫీ లేదా? టీ తెచ్చావ్’’ అయిష్టంగా మొహం పెడుతూ చెల్లి. ‘‘ఇచ్చింది తాగు’’ అని వెళ్లబోతుంటే ‘‘నిరంజన్... నోట్పాడ్ తెచ్చివ్వా?’’ అడుగుతుంది జానకి. ‘‘నోట్పాడా? నీకేమన్నా బుద్ధుందా? ఇంటర్నెట్ బిల్ నాలుగువేలొచ్చింది తెల్సా? అవునూ... ఆ పెన్‌డ్రైవ్‌లో ఆ పోర్న్ వీడియోలేంటీ? నీ వయసేంటి? నువ్ చేస్తున్న పనులేంటి?’’ అని బెదిరిస్తాడు. ‘‘అవి నా పర్సనల్ థింగ్స్. చెక్ చేయడం మ్యానర్సేనా?’’ జానకి ఎదురు మాట్లాడుతుంది. ఎప్పటిలాగే వినిపించుకోకుండా వెళ్లిపోతాడు అతను. ఇంట్లో అల్మారా సర్దుతుంటే ఫోటోలతో ఉన్న జానకి బ్యాగ్ కనపడుతుంది. జానకికి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు దిగిన ఫోటోలు. అమ్మ, నాన్న, జానకి... తన ఫోటో ఉన్న ఫ్రేమ్ పట్టుకుని. కొన్ని ఫొటోల్లో జానకి.. తన ఫోటో ఫ్రేమ్ పట్టుకొని. అమ్మ, నాన్న, జానకి.. ముగ్గురే దిగిన ఫోటో ఒక్కటీ లేదు. తను లేకపోయినా తన ఫోటో పట్టుకుని కుటుంబ ఛాయాచిత్రాన్ని పూర్తి చేసింది చెల్లెలు. కళ్లు చెమ్మగిల్లుతాయి నిరంజన్‌కు. తను గల్ఫ్‌లో ఉన్నా చెల్లెలు తనను ఆ కుటుంబంతో కలిపే ఉంచింది. మనసు ఆర్ద్రమవుతుంది. వెంటనే నోట్‌ప్యాడ్ తీసుకొని చెల్లికి ఇచ్చొస్తాడు. ఆమె ఆనందానికి అవధులుండవ్. లక్షన్నర బిల్లు.. రెండోరోజుకల్లా ఓ ఆరు జతల కొత్తబట్టలు ఇంటికి డెలివరీ అవుతాయి. లక్షన్నర రూపాయలు క్రెడిట్‌కార్డ్ నుంచి డెబిట్ అయినట్టూ మెస్సేజ్ వస్తుంది. అనుమానం చెల్లి మీదకు మళ్లి ఆ కొత్తబట్టల బ్యాగ్స్‌తో విసావిసా చెల్లి దగ్గరకు వస్తాడు. నోట్ ప్యాడ్‌లో మ్యూజిక్ వింటున్న జానకి చెవుల్లోంచి ఇయర్ ఫోన్స్ లాగేసి.. ‘‘ఏంటీ పని?’’ అని గద్దిస్తాడు. ‘‘అరే వ్వా.. వచ్చేశాయా బట్టలు? ఏం నచ్చలేదా?’’ అంటుంది. కోపాన్ని దిగమింగుకుంటూ.. ‘‘నా జీవితంలో ఇంత ఖరీదైన బట్టలు నేనెప్పుడూ వేసుకోలేదు. నాకెవ్వరూ ఇప్పించలేదు’’ అరుస్తాడు. ‘‘అందుకే ఇప్పుడు వేసుకో నిరంజన్.. నేను ఇప్పించానుగా’’ అంటుంది. ‘‘మతి ఉండే మాట్లాడుతున్నావా? వీటికి లక్షన్నర తగలేస్తావా? డబ్బులనుకున్నావా? ఇంకేమన్నానా? ఎంత కష్టపడితే వస్తాయో తెలుసా?’’ అంటూ కన్నెర్ర చేస్తాడు. ‘‘తెలుసు. మా కోసం నీ ఇష్టాలను చంపుకొని ఎంత కష్టపడ్డావో తెలుసు. మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నువ్వెన్ని కోల్పోయావో తెలుసు. నా ట్రీట్మెంట్ కోసం పైసాపైసా కూడబెట్టిందీ తెలుసు. కానీ ఏమైంది? నిరంజన్... ఇప్పటినుంచైనా నీ కోసం నువ్వు బతుకు. నచ్చినట్టు ఉండు. ముసలోడిలా ఉండకు. స్టయిల్ మార్చు’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే.. ‘‘నోర్ముయ్’’ ఆవేశంగా అతను. అంతే! ఏడుపు లంకించుకుంటుంది ఆ పిల్ల. కంగారుపడి ‘ఏడ్వకు’ అంటూ చెల్లెలిని బతిమాలుతాడు. సారీ చెప్తాడు. మలి మజిలీ... ఆ రోజు రాత్రి మళ్లీ లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తారు అన్నాచెల్లెళ్లు. ఊరవతల ఓ సెలయేటి ఒడ్డున వ్యాన్ ఆపి.. దిగుతాడు నిరంజన్. ఒడ్డున కూర్చుని బీర్ తాగుతుంటాడు. వ్యాన్ విండో దగ్గర జానకి. ‘‘ఖతర్‌కి వెళ్లినప్పుడు నీ వయసెంత అన్నయ్యా?’’ అడుగుతుంది. ‘‘పదహారుంటాయేయో. వారానికి ఒక్కరోజు రెండు పూటలా భోజనం చేసే చాన్స్ దొరికేది. ఓ నాలుగేళ్లకు అక్కడి నుంచి దుబాయ్కొచ్చా. ఉద్యోగం చేస్తూనే కంప్యూటర్స్ నేర్చుకున్నా. తర్వాత కొన్నాళ్లకు మంచి జాబ్ దొరికింది. అంటే రోజూ రెండుపూటలా భోజనం చేసే అవకాశం ఇచ్చిన కొలువన్నమాట’’ బీర్ తాగుతూ తన జీవితం గురించి చెప్తాడు చెల్లికి. ఆమె కళ్లల్లో నీళ్లు. ‘‘నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అన్నయ్యా? అందరిలాగే నాకూ నీతో షికారుకెళ్లాలని.. కలిసి ఆడాలని.. పాడాలని.. సినిమాలు చూడాలని.. నీ దగ్గర అలగాలని..’’ తీరని కోరికలన్నీ వివరిస్తుంది. నిరంజన్ కళ్లల్లోనూ నీటి చెమ్మ. ‘‘నాకూ ఇవ్వవా బీర్...’’ అడుగుతుంది కిటికీలోంచి చేయి చాస్తూ. ‘‘ఆ..’’ గదమాయిస్తాడు. ‘‘ప్లీజ్’’ రిక్వెస్ట్ చేస్తుంది. నవ్వుతూ బీర్ ఇస్తాడు. గటగటా తాగేసి బాటిల్ నీళ్లల్లో పడేస్తూ.. ‘‘గర్ల్ ఫ్రెండ్?’ అడుగుతుంది. ‘‘ఏంటీ, ఈ మెకానిక్కు.. అదీ గల్ఫ్‌లో గర్ల్‌ఫ్రెండా?’’ నవ్వేస్తాడు. చివుక్కుమంటుంది చెల్లి మనసు. ‘‘అవునూ.. స్కూల్ డేస్‌లో నీకో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని విన్నానే?’’ అంటుంది.‘‘అలీస్. కాని నేను గల్ఫ్కెళ్లిపోయా కదా.. అక్కడితో ఎండ్ అయింది’’ అంటాడు విచారంగా. నిట్టూరుస్తుంది జానకి. అలా ఆ రోజు నుంచి ఆ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం పెరుగుతూంటుంది. ప్రతిరోజూ ఇద్దరూ కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం.. ఆ ప్రయాణంలో చిన్నప్పటి నుంచి మిస్ అయినవన్నీ గుర్తు చేసుకోవడం.. మాట్లాడుకోవడం వాళ్ల దినచర్య అవుతుంది. ఆ అన్నకు బిడ్డగా.. చెల్లికి నచ్చినట్టుగా వ్యాన్‌ను క్యారవాన్‌లా మోడిఫై చేస్తాడు. స్టవ్ అమరుస్తాడు. కాఫీనుంచి డిన్నర్ దాకా కలిసే చేస్తుంటారు. చెల్లి మెచ్చేట్టుగా తన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ మార్చుకొని యంగ్లుక్కి వచ్చేస్తాడు. నిరంజన్ తల్లిదండ్రులకు ఆశ్చర్యంతోపాటు అనుమానమూ కలుగుతూంటుంది. ఎప్పుడు చూసినా అతను వ్యాన్‌లో ఉండడం.. వ్యాన్ గోడలకు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మరకలూ కనిపిస్తూండడంతో నిరంజన్ తల్లి ఆందోళన పడ్తూంటుంది. ‘‘పోనీలే.. ఇప్పటికైనా ఓ తోడు కావాలని వాడికి అర్థమైంది. అనవసరంగా టెన్షన్ పడకు’’ అంటూ ఆమెకు సర్దిచెప్తాడు తండ్రి. ఆ టైమ్‌లోనే తన బాయ్‌ఫ్రెండ్‌ను అన్నకు చూపిస్తుంది జానకి.తామిద్దరూ మాట్లాడుకునే అవకాశం కల్పించమని కోరుతుంది అన్నను. కల్పిస్తాడు నిరంజన్. అలా మొత్తానికి చిన్నప్పటి నుంచి తామిద్దరూ కోల్పోయిన అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఇద్దరూ ఆస్వాదించేలా చేస్తుంది జానకి. డబ్బు సంపాదించే యంత్రంలా కష్టపడ్డం మాత్రమే తెలిసిన అన్నను మనిషిగా మలచి అతనికి మనసుందన్న విషయాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ క్రమంలోనే.. నిరంజన్ చిన్నప్పటి గర్ల్‌ఫ్రెండ్ అలీస్‌తో కలుపుతుంది అతణ్ణి. ఇరువైపుల పెద్దలూ ఆ పెళ్లికి అంగీకరిస్తారు. ఆ సంతోషంలో.. ఆ రాత్రి.. అన్నతో ... ‘‘నిరంజన్ నీకు కూతురు పుడితే... పిచ్చిపిచ్చి రిస్ట్రిక్షన్స్ పెట్టకు. సెల్‌ఫోన్స్.. మెయిల్స్ చెక్ చేయకు...’’ అని ఆమె చెప్తూంటే అన్నిటికీ ‘‘సరే’’ అంటూంటాడు నిరంజన్. ‘‘ఆమె బాయ్‌ఫ్రెండ్ సిగరెట్ అడిగితే ‘నో స్మోకింగ్’ అంటూ లెక్చర్స్ ఇవ్వకు’’ అంటుంది.. ‘‘నో.. దీనికి ఒప్పుకోను’’ అంటాడు అతను. నవ్వుకుంటారు. ఆమె నిద్రపోయాక వ్యాన్ దిగి వెళ్లిపోతాడు నిరంజన్.తెల్లవారుతుంది. ఎందుకో డౌట్ వచ్చి వ్యాన్ దగ్గరకు పరిగెత్తుకొస్తాడు నిరంజన్. చెల్లి కనిపించదు. అంతా వెదుకుతాడు.. డిక్కీతో సహా. ఎక్కడా కనిపించదు. ఏడుస్తాడు.. పొగిలి పొగిలి. ‘‘నేను వచ్చిన పని అయిపోగానే వెళ్లిపోతా’’ అన్న చెల్లెలి మాటలు గుర్తొస్తాయి. ఆ వ్యాన్‌ను ఆప్యాయంగా తడిమి వెనుదిరుగుతాడు. నిరంజన్‌కు అలీస్‌తో పెళ్లవుతుంది. జానకి మళ్లీ పుడుతుంది.అసలు సంగతి ఏమిటంటే, నిరంజన్ చెల్లి జానకి బ్లడ్ క్యాన్సర్‌తో చనిపోతుంది. అందుకే ఇండియా వస్తాడు నిరంజన్. ఆ వ్యాన్‌లో ఉన్నది ఆమె ఆత్మ. సరస్వతి రమ -
భగినీ హస్తభోజనం పవిత్రం
ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా భగినీ హస్తభోజనాలు చేసేందుకు మహిళలంతా సిద్ధమయ్యారు. భగినీ అంటే తోబుట్టువు అయిన సోదరి. ఆమె చేతివంట తినడం భగినీ హస్తభోజనం. ఇది దీపావళి వెళ్లిన రెండో రోజు వస్తుంది. దీనినే యమ ద్వితీయ అంటారు. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్ఠత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె తన అన్న దగ్గరకు ప్రతినిత్యం వెళ్లి తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి తీరిక దొరకలేదు. దీంతో ఎలాగైనా ఒక రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి ఆయనకు కార్తీకమాసం, శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు విరామం దొరికింది. ఆరోజున సోదరైన యమున ఇంటికి వెళ్లాడు. చాలాకాలం తర్వాత తన ప్రార్థన మన్నించి వచ్చిన అన్నకు యమున షడ్రషోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం యమధర్మరాజుకు కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ప్రతి ఏడాది రావాలని.. అప్పుడామె ‘అగ్రజా నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినాలి. అంతేకాక ప్రతి సంవత్సరం కార్తీక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో అలాంటి వాళ్లకు నరకబాధ ఉండకూడదు’ అని వరం కోరింది. యముడు తథాస్తు అని వరమిచ్చాడు. నాటి నుంచి ఈ వేడుకను యమ ద్వితీయ, భాతృద్వితీయ, అన్నదమ్మల భోజనాలు ప్రసిద్ధికెక్కాయి. భగినీ హస్తభోజనం అనాదిగా వస్తున్న సంప్రదాయ ఆచారం. ఇందులో మానవ జీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి జీవించలేడు. కుటుంబంలో తల్లిదండ్రులు ముఖ్యులు. వారు సంతానాన్ని కని, పెంచి, పోషించి విద్యాబుద్ధులను ప్రసాదించి తమ సంతానానికి కుటుంబాలను ఏర్పాటు చేస్తారు. మనిషికి తల్లిదండ్రుల తర్వాత ఆత్మీయులైనవారు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే. తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక తమ సంతానం జీవించినంతకాలం వారు జీవించి ఉండలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం జీవించే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి అంతేకాక ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? కనుక ఈ అన్నదమ్ముల భోజన సంప్రదాయం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య జీవితాంతం ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకుదెరువుకోసం దూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఈ ఆధునిక కాలంలో ఉపాధి కోసం రాష్ట్రాల సరిహద్దులేకాదు దేశాలు, ఖండాలూ దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికోసారే కాదుగదా రెండు, మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్మలు, అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతివంటను భుజించి తమకున్నదాంట్లో ప్రేమగా కానుకలు ఇస్తే ఆత్మీయబంధాలు వర్థిల్లుతాయి. ఒకరికొకరు అండగా ఉన్నామనే భావన కలుగుతుంది. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమంకోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్యక్రమంలో పాటించినప్పుడే సంప్రదాయాలవుతాయనీ పెద్దలమాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్టమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకుని వాటిని సవరించుకొని చక్కగా ఆచరించడమే ఉత్తమం. ఆత్మావై పుత్రనామాసి అన్నది వేదం. అంటే తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతంకు సమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంటకూడా సుధామయమే. కనుక భగినీ హస్తభోజనం అన్నివిధాలా అమృతభక్షణంతో సమానం. ఏ ఆచారమైనా మానవాళి మధ్య సద్భావలను పెంపొందింపజేసి స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగానిలపడంకోసమే. -
పేదింటికి పుట్టెడు కష్టం
దొరవారిసత్రం: చిన్నారుల ఆటపాటలు, సరదాలతో ఆనందంగా గడపాల్సిన కుటుంబం పుట్టెడు కష్టంతో విలవిల్లాడుతోంది. శారీరక, మానసిక ఎదుగుదల లేకుండా జన్మించిన ఇద్దరు పిల్లలను చూసి తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతుపట్టలేకుండా ఉంది. మెరుగైన చికిత్సను అందించే స్తోమత సైతం లేకపోవడంతో కుటుంబం అంతులేని ఆవేదనకు గురవుతోంది. దొరవారిసత్రం మండలం తీర గ్రామమైన మీజూరు పంచాయతీ పరిధిలో గల కారికాడు ఎస్సీ కాలనీకి చెందిన కొమ్మక శేఖర్, వసంతమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు అమ్ములు(13), శ్రీమంజుల(11), రాజేష్(09). వీరిలో అమ్ములు, రాజేష్ పుట్టిన ఏడాది నుంచే కాళ్లు, చేతులు చచ్చుబడి నడవలేకపోయారు. పిల్లల ఆలనాపాలనకే తండ్రి పిల్లవాడికైతే మాట కూడా సక్రమంగా రాదు. అప్పట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వయస్సు పెరిగినా, శారీరకంగా ఇద్దరి పిల్లల్లో ఎదుగుదల్లేదు. ఇద్దరు పిల్లలకు ఎవరో ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని పరిస్థితి. కుటుంబ పరిస్థితి బాగొలేకపోవడంతో తడ ప్రాంతంలోని అపాచీ కంపెనీలో తల్లి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి మాత్రం ఇంటి వద్దే ఉండి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అమ్ములు ఐదో తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే తండ్రి సాయంతో చదివింది. ఉన్నత విద్యకు బయట పాఠశాలకు పంపలేని పరిస్థితి. రాజేష్‌కు నోటి మాట కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలకు పంపలేదు. పింఛన్ మంజూరులో అన్యాయం దివ్యాంగులైన అమ్ములు, రాజేష్‌కు 100 శాతం వికలత్వ సర్టిఫికెట్ ఉన్నా, ప్రభుత్వం నుంచి పింఛన్ అందడంలేదు. పింఛన్ కోసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తండ్రి ఏడేళ్లుగా తిరుగుతున్నా, ప్రయోజనం శూన్యమవుతోంది. గతేడాది రేషన్ కార్డులో పిల్లలను నమోదు చేసుకుంటే పింఛన్ వస్తుందని అధికారులు సూచించారు. పలుచోట్ల తిరిగి రేషన్‌కార్డులో పేర్లు నమోదు చేయించి పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం మాత్రం కానరాలేదు. తాజాగా ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్లు లేవని, ఈ క్రమంలోనే దివ్యాంగుల పింఛన్ రావడంలేదని మండలాధికారులు తెలిపారు. ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్ల నమోదుకు కొన్ని రోజులు నుంచి తిరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం కనికరం చూపడంలేదు. పింఛనైనా వస్తే పిల్లలకు మంచి ఆహారాన్ని అందించవచ్చనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.