
సాక్షి, హైదరాబాద్: పైన ఫొటోలో కన్పిస్తున్న దృశ్యం చూస్తే అయ్యో అనకుండా ఉండలేం కదా. అవును..ఇది ఓ కేన్సర్ పేషెంట్ దీనగాథ. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన పాండు రంగ కరాడే సోదరి ఇందూబాయికి నోటి కేన్సర్ సోకింది. దీంతో మంగళవారం చికిత్స కోసం ఆమెను బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు పాండురంగ. పరీక్షించిన వైద్యులు తగిన వైద్యం చేసి..తిరిగి ఐదు రోజులకు మళ్లీ ఆస్పత్రికి తీసుకురమ్మన్నారు.
అయితే.. నాందేడ్‌కు వెళ్లి మళ్లీ తిరిగి ఐదురోజులకే హైదరాబాద్‌కు రావాలంటే దారి ఖర్చులు ఎక్కువ అవుతాయని భావించిన పాండురంగ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆస్పత్రి సమీపంలో ఓ చెట్టుకింద ఆశ్రయం పొందాడు. నోటి కేన్సర్ కారణంగా ఆమె ఘనాహారం తీసుకోవడం లేదు. దీంతో ఇలా తన అక్కకు పైపు ద్వారా ద్రవాహారం అందిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. కూలీనాలీ చేసుకునే తనకు ఖర్చులు భరించే శక్తి లేదని, గదిని కూడా అద్దెకు తీసుకునే స్థోమత లేదని చెప్పుకొచ్చాడు. ఈ దారిగుండా వెళ్లిన వారంతా ఈ దృశ్యం చూసి చలించిపోయారు.
-ఫోటోలు: దయాకర్ తూనుగుంట్ల
చదవండి: మార్కెట్‌లోకి రూ.20 నాణేలు
Comments
Please login to add a commentAdd a comment