
కమల్‌హాసన్.
‘శ్రీదేవి ఎన్ తంగచ్చి’ అనే షాకింగ్ కామెంట్ చేశారు కమల్‌హాసన్. అర్థం కావడం లేదా? ‘శ్రీదేవి నా సోదరి’ అంటున్నారు కమల్. సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న కమల్‌హాసన్–శ్రీదేవి ఆఫ్ స్క్రీన్‌లో అన్నాచెల్లెలిలా మెలిగేవారట. శ్రీదేవి మరణించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆమెతో వాళ్లకున్న అనుబంధం గురించి షేర్ చేసుకుంటున్నారు. శ్రీదేవితో 27 సినిమాలు చేసిన కమల్‌హాసన్ కూడా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
ఓ తమిళ పత్రికతో ఆయన మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో పెళ్లిళ్లలో జంటను చూసి అచ్చం ‘కమల్‌హాసన్–శ్రీదేవి’లా ఉన్నారు కదా అనుకునేవారు. సినిమాలో మేం ఇద్దరం డ్యూయెట్‌లు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ కనిపించడంతో అలా అనుకొని ఉండుంటారు. వాళ్ల కలల్ని కూల్చేయటం ఎందుకు? అని మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ బయటపెట్టలేదు. సినిమాలో దేవుడు–దేవత పాత్రలు పోషించేవాళ్లు.. వాళ్లకు జోడీగా నటించే ఆర్టిస్ట్‌ను అన్నయ్య అనో చెల్లెమ్మ అనో పిలిచేవారు.
నేను, శ్రీదేవి కూడా అన్నాచెల్లెలమే. సునిశితంగా గమనిస్తే.. ఆన్ స్క్రీన్ మేం అన్నాచెల్లెలు లాగా కనిపిస్తాం. మా కాంబినేషన్ ఎంత హిటై్టందంటే మమ్మల్ని సంప్రదించకుండానే ఈ స్టోరీలో వీళ్లిద్దరూ యాక్ట్ చేసేస్తారులే అనుకునేవారు దర్శక–నిర్మాతలు. ఇలా వరుసగా సినిమాలు చేసేసరికి ‘మళ్లీ శ్రీదేవేనా?’ అనుకునేవాణ్ణి. ఏదో అలా అనుకున్నాను కానీ ‘శ్రీదేవితో యాక్ట్ చేయాలని ప్రతి నటుడు కోరుకునేవాడు’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్.
Comments
Please login to add a commentAdd a comment