హెలికాప్టర్ ఎక్కుతున్న విరాజ్ కవాడియా సోదరి, బావ
సాక్షి, ముంబై: సాధారణంగా తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకురావడానికి బైక్ లేదా ఆటోలో వెళతారు. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే సొంత కారులో లేదా అద్దె వాహనంలో వెళతారు. కానీ, జల్గావ్ జిల్లాలో తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి ఏకంగా హెలికాప్టర్‌లో తీసుకొచ్చిన సంఘటన సర్వత్రా చర్చనీయంశమైంది. తన సోదరికి వినూత్నంగా స్వాగతం పలకాలనే ఉద్ధేశంతో విరాజ్ కావడియా అనే వ్యక్తి ఈ ఏర్పాట్లు చేశాడు. అకస్మాత్తుగా హెలికాప్టర్ గ్రామం బయట ల్యాండ్ కావడంతో కొద్దిసేపు గ్రామస్తులకు అర్థం కాలేదు. తరువాత ఇటీవల పెళ్లయిన తన సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌లో వచ్చినట్లు తెలియగానే ఆశ్చర్యపోయారు.
సోదరికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని.
జల్గావ్ జిల్లాకు చెందిన శివాని కావడియా పెళ్లి పర్లీలోని వైజ్యనాథ్ ప్రాంతంలో ఉంటున్న జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ కుణాల్ జైన్‌తో ఇటీవల పెళ్లైంది. కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన కొద్ది రోజులకు పెళ్లి కూతురును పుట్టింటికి తీసుకురావాలి. దీంతో తన సోదరిని తానే తీసుకురావాలని సోదరుడు విరాజ్ కావడియా భావించాడు. కానీ, కారులో లేదా బైక్‌పై తీసుకురావడం సర్వసాధారణం. దీంతో సర్‌ఫ్రైజ్ చేయాలని కొత్త పద్దతిని ఆలోచించాడు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని సోదరి గ్రామానికి వెళ్లాడు. ఊరు బయటున్న బారిస్టర్ నికం మైదానంలో ల్యాండింగ్ చేశాడు. ఈ వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..)
Comments
Please login to add a commentAdd a comment