Up Man Beheads Sister Walks With Severed Head - Sakshi
Sakshi News home page

యూపీలో చెల్లి తల నరికిన అన్న.. కారణం ఏమిటంటే?   

Published Sat, Jul 22 2023 12:52 PM | Last Updated on Sat, Jul 22 2023 1:19 PM

Up Man Beheads Sister Walks With Severed Head  - Sakshi

లక్నో: యూపీలోని బారాబంకిలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్ళ మధ్య వాగ్వాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి హత్యకు దారితీసింది. అన్న ఆవేశాన్ని ఆపుకోలేక తోడబుట్టిన చెల్లెలిని కిరాతకంగా తల నరికి చంపి తలతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. 

మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. 
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని బారాబంకి మిత్వారా గ్రామంలో నివాసముంటున్న రియాజ్(22) అతని సోదరి ఆషిఫా(18) మధ్య ప్రేమ విషయమై చిన్న వివాదం చోటుచేసుకుంది. చెల్లెలు ఆషిఫా అదే గ్రామానికి చెందిన చాంద్ బాబుతో వెళ్ళిపోయినందుకు రియాజ్ ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె అన్నయ్యకు మొదట నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా రియాజ్ శాంతించకపోవడంతో ఆషిఫా కూడా ఎదురు  సమాధానం చెప్పింది. 

ఆలోచన పనిచేయక..   
ఆగ్రహోద్రిక్తుడైన రియాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. దగ్గర్లోని పదునైన కత్తిని తీసుకుని ఒక వేటుకు చెల్లి తలా మొండెం వేరుచేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం చెందకుండా తెంచిన తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిందంతా వివరించి లొంగిపోయాడని తెలిపారు. ఈ సంఘటను పరువు హత్యగా పేర్కొంటూ సాక్ష్యాధారాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.      

ఇటీవల కాలంలో పరువు హత్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. వయసుకొచ్చిన అమ్మాయిలు ఎవరికి వారు తమ జీవితభాగస్వాములను ఎంచుకుని తొందరపాటులో చేసే చిన్న పొరపాటే ఇంతటి అనర్ధాలకు దారితీస్తోంది. నచ్చజెప్పడమైనా సర్దుకుపోవడమైనా ఓ మెట్టు దిగే గుణంలోనే ఉంటుందన్న ఇంగితాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. ఎవరికీ ప్రయోజనం లేని నిర్ణయాలతో ఆవేశానికి లోనై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.  

ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement