మోదీజీ.. మా నోట్లను మీరే మార్చాలి! | brother and sister from Rajasthan wrote a letter to PM Modi | Sakshi
Sakshi News home page

మోదీజీ.. మా నోట్లను మీరే మార్చాలి!

Published Sun, Mar 26 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

మోదీజీ.. మా నోట్లను మీరే మార్చాలి!

మోదీజీ.. మా నోట్లను మీరే మార్చాలి!

ప్రధానికి అన్నాచెల్లెళ్ల లేఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు తోబుట్టువుల నుంచి ఓ లేఖ అందింది. తమవద్దనున్న 96,500 పాతనోట్లను మార్చి ఇవ్వాలన్నది ఆ లేఖ సారాంశం. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన అన్నాచెల్లెళ్లు సరవాడ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరు మరణించడంతో వీరిద్దరిప్పుడు అనాథలయ్యారు. అయితే కూలీగా బతుకీడ్చిన తల్లి.. బిడ్డ పెళ్లి కోసమని పైసా పైసా కూడబెట్టింది. ఇటీవలే ఆమె హత్యకు గురికావడంతో ఈ డబ్బు విషయం పిల్లలిద్దరికీ తెలియలేదు. 
 
అయితే కేంద్ర ప్రభుత్వం పాతనోట్లను రద్దు చేయడం, దాని గడువు కూడా ముగియడం తెలిసిందే. అయితే తల్లిదాచిన నోట్లు ఇటీవలే బయటపడ్డాయి. దీంతో వాటిని ఎక్కడికి తీసుకెళ్లినా.. అవి చెల్లవని, పైగా వాటిని దగ్గర ఉంచుకోవడం కూడా నేరమని చెబుతుండడంతో అన్నాచెల్లెళ్లిద్దరు ఏకంగా ప్రధానికే లేఖ రాశారు. ఆ డబ్బును చెల్లి పెళ్లి కోసం అమ్మ దాచిపెట్టిందని, చెల్లి పేరుమీదే బ్యాంకులు జమ చేసేందుకు చొరవ చూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement