letter to PM Modi
-
ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు.తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని జగన్ తన లేఖలో రాశారు.Kind Attention: Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister Narendra Modi Ji regarding the severe pain caused to the religious sentiments of Hindu devotees https://t.co/TI3vgkaZ0e. @rajnathsingh @AmitShah @nitin_gadkari…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2024ఇంకా ఆ లేఖలో.. ఏపీలో ప్రభుత్వం 100 రోజులు పూర్తైంది. తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని జగన్ తన లేఖలో కుట్ర కోణాన్ని ప్రస్తావించారు. ఇదీ చదవండి: చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం' -
సీఎం మమతాకు మద్దతుగా! ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ.. సీఎం మమతా బెనర్జీ గతంలో చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘నేను పశ్చిమ బెంగాల్లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల దుస్థితి తెలపాడానికి లేఖ రాస్తున్నా. నేను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా బెంగాల్‌లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్మికుల పరిస్థితి స్వయంగా గమనించారు. వారు కూడా పెద్ద ఎత్తున నా యాత్రలో పాల్గోని తమ సమస్యలపై వినతిపత్రం అందించారు కూడా. ..పశ్చిమ బెంగాల్లో ఉపాధి హామి కార్మికుల ఇబ్బందులను తెలుపుతూ పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి నాయకులు నాకు వినతిపత్రం అందజేశారు. వారు రాసిన లేఖ ప్రతిని కూడా మీకు జత చేశాను. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసే నిధులను నిలిపివేయటంతో లక్షలాది పశ్చిమ బెంగాల్ సోదరీ సోదరీమణులు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారు.’అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ఇక.. మమతా బేనర్జీ టీఎంసీ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం నిధులు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాయి. అఖరికి ఫిబ్రవరి 21 వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 21 లక్షల ఉపాధిహామీ పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందజేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గత ఏదాడి డిసెంబర్లో కూడా సీఎం మమతా.. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ టీఎంసీ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతాను బుజ్జగించే పనిలో భాగంగా తాజాగా అక్కడి గ్రామీణ ఉపాథి హామీ పథకం కార్మికుల నిధులకు విడుదలకు కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. -
మహమ్మారిపై పోరులో టీకాయే కీలకం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిపై పోరులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం చాలా అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. కోవిడ్–19 సంక్షోభంపై కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేత అయిన మన్మోహన్ సింగ్ ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన నిర్మాణాత్మక సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని నమ్మకం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న అంశాలివీ... ► దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్లో ఎంతమందికి టీకా వేశామన్నది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి టీకా అందిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం జనాభాతో పోలిస్తే కోవిడ్ బాధితుల సంఖ్య చాలా సంఖ్య చాలా తక్కువ కాబట్టి, సత్వరమే సరైన విధానాలను అమలు చేస్తే మెరుగైన ఫలితాలను మనం సాధించవచ్చు. ► కోవిడ్–19 నివారణలో వాడే కీలక ఔషధాల ఉత్పత్తిని పెంచాలి. హెచ్ఐవీ/ఎయిడ్స్ డ్రగ్స్ అనుమతుల విషయంలో విధించిన నిబంధనలనే కోవిడ్ విషయంలోనూ అమలు చేయాలి. దీని ఫలితంగా, కరోనా టీకా ఉత్పత్తిని చేపట్టే కంపెనీల సంఖ్య పెరుగుతుంది. ► వ్యాక్సిన్ అందాల్సిన 45 ఏళ్లలోపు ఫ్రంట్‌లైన్ వర్కర్ల ఎంపిక విషయంలో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కల్పించాలి. ► వచ్చే 6 నెలలకు గాను ఎన్ని డోసుల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది? ఆయా డోసులను రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయనుంది? వంటి అంశాలనుబహిరంగ పర్చాలి. ► దేశ అవసరాలకు తగ్గట్లుగా టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రభుత్వం సాయంగా నిలవాలి. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా.. యూరోపియన్ యూనియన్, అమెరికాలలో పర్మిషన్ పొందిన విదేశీ టీకాలను నేరుగా వ్యాక్సినేషన్‌కు అనుమతించాలి. -
ప్రధాని మోదీకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, కడప : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. యురేనియం ప్లాంట్ సమస్యను ఆయన తన లేఖలో పేర్కొన్నారు. టైల్‌పాండ్ వ్యర్థాల వల్ల ఏడు గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, పంటలు, పశు సంపద దెబ్బతింటోదని, సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని వైవీ అవినాష్ రెడ్డి తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాగా జిల్లాలోని వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటైన యురేనియం శుద్ధికర్మాగారం వ్యర్థాల వల్ల వేముల మండలంలోని ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కెవి కొట్టాలు, కనంపల్లి, మబ్చుచింతలపల్లి, భూమయ్యగారిపల్లితో పాటు మరో గ్రామంలో పంటలకు, మనుషులకు తీవ్ర నష్టం కలిగే పరిణామాలు క్రమక్రమంగా అధికం అవుతున్న విషయం తెలిసిందే. -
మోదీజీ.. మా నోట్లను మీరే మార్చాలి!
ప్రధానికి అన్నాచెల్లెళ్ల లేఖ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు తోబుట్టువుల నుంచి ఓ లేఖ అందింది. తమవద్దనున్న 96,500 పాతనోట్లను మార్చి ఇవ్వాలన్నది ఆ లేఖ సారాంశం. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన అన్నాచెల్లెళ్లు సరవాడ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరు మరణించడంతో వీరిద్దరిప్పుడు అనాథలయ్యారు. అయితే కూలీగా బతుకీడ్చిన తల్లి.. బిడ్డ పెళ్లి కోసమని పైసా పైసా కూడబెట్టింది. ఇటీవలే ఆమె హత్యకు గురికావడంతో ఈ డబ్బు విషయం పిల్లలిద్దరికీ తెలియలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం పాతనోట్లను రద్దు చేయడం, దాని గడువు కూడా ముగియడం తెలిసిందే. అయితే తల్లిదాచిన నోట్లు ఇటీవలే బయటపడ్డాయి. దీంతో వాటిని ఎక్కడికి తీసుకెళ్లినా.. అవి చెల్లవని, పైగా వాటిని దగ్గర ఉంచుకోవడం కూడా నేరమని చెబుతుండడంతో అన్నాచెల్లెళ్లిద్దరు ఏకంగా ప్రధానికే లేఖ రాశారు. ఆ డబ్బును చెల్లి పెళ్లి కోసం అమ్మ దాచిపెట్టిందని, చెల్లి పేరుమీదే బ్యాంకులు జమ చేసేందుకు చొరవ చూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. -
వగలాడి వలలో వరుణ్..!