ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ.. సీఎం మమతా బెనర్జీ గతంలో చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
‘నేను పశ్చిమ బెంగాల్‌లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల దుస్థితి తెలపాడానికి లేఖ రాస్తున్నా. నేను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా బెంగాల్‌లోని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్మికుల పరిస్థితి స్వయంగా గమనించారు. వారు కూడా పెద్ద ఎత్తున నా యాత్రలో పాల్గోని తమ సమస్యలపై వినతిపత్రం అందించారు కూడా.
..పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామి కార్మికుల ఇబ్బందులను తెలుపుతూ పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి నాయకులు నాకు వినతిపత్రం అందజేశారు. వారు రాసిన లేఖ ప్రతిని కూడా మీకు జత చేశాను. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసే నిధులను నిలిపివేయటంతో లక్షలాది పశ్చిమ బెంగాల్ సోదరీ సోదరీమణులు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారు.’అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
ఇక.. మమతా బేనర్జీ టీఎంసీ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం నిధులు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాయి. అఖరికి ఫిబ్రవరి 21 వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 21 లక్షల ఉపాధిహామీ పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందజేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గత ఏదాడి డిసెంబర్‌లో కూడా సీఎం మమతా.. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ టీఎంసీ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతాను బుజ్జగించే పనిలో భాగంగా తాజాగా అక్కడి గ్రామీణ ఉపాథి హామీ పథకం కార్మికుల నిధులకు విడుదలకు కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు జోరుగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment