ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు అధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గతంతో పోల్చితే ఈసారి కొంత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా విడుదలైన ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్’ ఎన్నికల ఫలితాల అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. 2019లో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి దాని కంటే ఒక సీటు అదనంగా గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇక.. బెంగాల్‌లో అధికారంలో టీఎంసీ ఈసారి కూడా 22 స్థానాలకే పరిమితమవుందని వెల్లడించింది. గత పార్లమెంట్‌లో టీఎంసీ 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అయితే 2024 పార్లమెంగ్ ఎన్నికల్లో సైతం 22 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. ఇక.. కాంగ్రెస్ ఈసారిగా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచి.. మూడు స్థానంలో నిలవనున్నట్లు తెలిపింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఓటు షేరు విషయంలో కూడా ఎన్డీయే కూటమి గతం పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 40 శాతం.. ఈసారి కూడా సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఓటు షేరు విషయంతో ఇండియా కూటమి బెంగాల్‌లో 2019 పార్లమెంట్ ఎన్నికల సాధించిన 57 శాతానికి 4 శాతం తగ్గి.. 53 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గమనిస్తే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్ ప్రజలు నమ్మకం కలిగి ఉండరని తెలుసుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక వ్యవహరించే టీఎంసీ అధినేత్రి.. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న బెంగాల్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కీలకంగా మారనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment