india today pole survey
-
మమతా వర్సెస్ మోదీ: బెంగాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు!
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు అధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గతంతో పోల్చితే ఈసారి కొంత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్’ ఎన్నికల ఫలితాల అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. 2019లో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి దాని కంటే ఒక సీటు అదనంగా గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక.. బెంగాల్లో అధికారంలో టీఎంసీ ఈసారి కూడా 22 స్థానాలకే పరిమితమవుందని వెల్లడించింది. గత పార్లమెంట్లో టీఎంసీ 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అయితే 2024 పార్లమెంగ్ ఎన్నికల్లో సైతం 22 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. ఇక.. కాంగ్రెస్ ఈసారిగా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచి.. మూడు స్థానంలో నిలవనున్నట్లు తెలిపింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓటు షేరు విషయంలో కూడా ఎన్డీయే కూటమి గతం పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 40 శాతం.. ఈసారి కూడా సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఓటు షేరు విషయంతో ఇండియా కూటమి బెంగాల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల సాధించిన 57 శాతానికి 4 శాతం తగ్గి.. 53 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గమనిస్తే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్ ప్రజలు నమ్మకం కలిగి ఉండరని తెలుసుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక వ్యవహరించే టీఎంసీ అధినేత్రి.. బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న బెంగాల్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కీలకంగా మారనున్న విషయం తెలిసిందే. -
ఇండియా టుడే పోల్: భావి ప్రధాని ఎవరంటే..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత్ ఇటీవల పాక్‌లో చేపట్టిన వైమానిక దాడుల అంశం ప్రభావం చూపదని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 21 శాతం మంది నిరుద్యోగం ప్రదాన అంశమని చెబుతుండగా, తాగునీరు అంశం ప్రధానమని 20 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. ఇక మెరుగైన పారిశుధ్యం, ధరల పెరుగుదల ప్రభావం చూపుతాయని 9 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే పీఎస్ఈ సర్వే కోసం యాక్సిస్-మై-ఇండియా నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు తాము ఓటు వేసే ముందు ఆయా రాజకీయ పార్టీల సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటామని 39 శాతం మంది ఓటర్లు వెల్లడించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనే ప్రాతిపదికపై ఓటు వేస్తామని కేవలం 16 శాతం మంది ఓటర్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఓటు వేసే వారు 13 వాతం కాగా, అభ్యర్ధుల ఆధారంగా ఓటు వేస్తామని 12 శాతం మంది ఓటర్లు తెలిపారు. జాతీయవాదం, ఎన్నికల ప్రణాళికలు, హామీల ఆధారంగా ఓటుపై నిర్ణయం తీసుకునే వారు కేవలం 1 శాతం కావడం గమనార్హం. ప్రధానిగా మోదీ వైపే మొగ్గు ఇక ప్రధానిగా నరేంద్ర మోదీవైపు అత్యధిక ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఆయన జనాదరణ గత ఏడాది అక్టోబర్‌లో 46 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 48 శాతానికి పెరగ్గా ఏప్రిల్‌లో 53 శాతానికి పెరిగిందని పీఎస్ఈ డేటా వెల్లడించింది. ఇక భావి ప్రధానిగా రాహుల్‌ను కోరుకునేవారు గత ఏడాది సెప్టెంబర్‌లో 32 శాతంగా ఉండగా, ఇప్పుడు 35 శాతానికి పెరిగింది. మరోవైపు మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఈ ఏడాది ఏప్రిల్‌లో 48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 30 శాతం ఓటర్లు ఆయన పాలన పట్ల పెదవివిరిచారు. 52 శాతం ఓటర్లకు చేరువైన న్యాయ్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించన కనీస ఆదాయ హామీ పధకం (న్యాయ్) ప్రకటించిన రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా 52 శాతం ఓటర్లకు చేరువైంది. నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తామని కాంగ్రెస్ ఈ హామీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పధకాన్ని అమలు చేస్తుందని 32 శాతం ఓటర్లు విశ్వసించగా, 51 మంది ఓటర్లు దీనిపై నోరుమెదపలేదు. ఇక 17 శాతం మంది న్యాయ్ అమలుపై ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఈ పధకంపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకోగా కేవలం 28 శాతం ఓటర్ల నిర్ణయాన్నే ఇది ప్రభావితం చేస్తుందని, 53 శాతం ఓటర్లను ప్రభావితం చేయలేదని, 19 శాతం ఓటర్లు దీనిపై అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోల్ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, పలు వర్గాలకు చెందిన 1,75,544 మంది ఓటర్లను ఫోన్ ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా పీఎస్ఈ పోల్ నిర్వహించింది. -
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
-
కర్ణాటకలో హంగ్!
హోరాహోరీ ప్రచార హోరు కొనసాగుతున్న కర్ణాటకలో.. ఓటరు తుది తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ వ్యతిరేకతను కాదని కాంగ్రెస్ మళ్లీ అధికార పీఠం అధిరోహిస్తుందా? లేక బీజేపీ చీఫ్ అమిత్ షా మంత్రాంగం ఫలించి దక్షిణ భారతావనిలోనూ బీజేపీ హవా ప్రారంభమవుతుందా? సీఎంగా సిద్దరామయ్య ఓకేనా? యడ్యూరప్పకు లభిస్తున్న మద్దతెంత?.. తదితర ప్రశ్నలకు ఇండియాటుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కొంతవరకు సమాధానాలు లభించాయి. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని, కాంగ్రెస్(90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్(34–43 సీట్లు) కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ(78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కన్నా సీఎంగా సిద్దరామయ్యకే ఎక్కువ మద్దతు లభించడం విశేషం. బెంగళూరు: కన్నడనాట హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఇండియాటుడే–కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తెలిపింది. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్ ఆంగ్లో సాక్సన్)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు. తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత లేకపోయినా అధికారానికి అవసరమైన సీట్లు రావని సర్వేలో తేలింది. ఉపాధి కల్పన, స్వచ్ఛమైన తాగునీరు సహా పలు అంశాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ కోల్పోనున్న సీట్లలో బీజేపీ పాగా వేయనుంది. అయితే కమలదళం కూడా సంపూర్ణంగా ప్రజల మద్దతు సంపాదించలేదని తేలింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా రిజర్వేషన్ల అంశం బీజేపీకి భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో 40 సీట్లున్న జేడీఎస్ తన సీట్లను కాపాడుకోనుంది. కన్నడ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికల కన్నా గణనీయంగా పెరగనున్నట్లు ఇండియాటుడే–కార్వీ సర్వేలో వెల్లడయింది. అయితే ఈ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేదని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 35 శాతం ఓట్లను సాధించొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో లాగే 37 శాతం ఓట్లను గెలుచుకోనుండగా.. జేడీఎస్–బీఎస్పీ కూటమి 19 శాతం ఓట్లను గెలవొచ్చని సర్వే పేర్కొంది. ప్రజాభిప్రాయం కాంగ్రెస్+జేడీఎస్ ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి జేడీఎస్ మద్దతుండాలనే ప్రశ్నకు.. కాంగ్రెస్‌కే జేడీఎస్–బీఎస్పీ కూటమి మద్దతివ్వాలని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది కన్నడిగులు అభిప్రాయపడ్డారు. కేవలం 29 శాతం మందే కుమారస్వామి బీజేపీతో వెళ్తే బాగుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 224 నియోజకవర్గాల్లో 27,919 మందిని ఈ సర్వే బృందం ఇంటర్వ్యూ చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిపిన ఈ సర్వేలో 62 శాతం సర్వే శాంపుల్స్ గ్రామీణ కర్ణాటకలో.. మిగిలింది పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నారు. 45 శాతం మంది సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 65 శాతం ముస్లింలు, 44 శాతం హిందువులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులాల వారిగా చూస్తే.. 55 శాతం మంది కురుబ గౌడ(సిద్దరామయ్య సామాజిక వర్గం)లు, 53 శాతం మంది దళితులు, 37 శాతం మంది లింగాయత్‌లు, 36 శాతం మంది బ్రాహ్మణులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో కీలకాంశాలు కన్నడ ఎన్నికల్లో ఉపాధికల్పన ప్రధాన అజెండాగా మారింది. 56 శాతం మంది ఉద్యోగాల్లేకపోవటం.. చాలా తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ విషయంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, సరైన తాగునీరు అందుబాటులో లేకపోవటం మొదలైన అంశాలపైనా ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిద్దరామయ్యపైనే మెజారిటీ కన్నడిగులు సానుకూలంగా ఉన్నారు. 38 శాతం మంది సిద్దరామయ్య పనితీరు బాగుంది, చాలా బాగుందని తెలపగా..31 శాతం మంది పర్వాలేదన్నారు. 29 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. భాష, జెండా, టిప్పు సుల్తాన్.. కర్ణాటకలో కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న అంశాలపైనా రాష్ట్ర ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. అన్ని పాఠశాలల్లో కన్నడ భాషను తప్పనిసరి చేయటాన్ని 73 శాతం మంది అంగీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండే అంశంలోనూ 59 శాతం మంది సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించటంపై మాత్రం 33 శాతం మందే సానుకూలంగా స్పందించగా.. 44 శాతం మంది వ్యతిరేకించారు. ముస్లింల్లోనూ 58 శాతం మంది మాత్రమే టిప్పు జయంతికి మద్దతు తెలిపారు. లింగాయత్‌లకు రిజర్వేషన్లపై మాత్రం ఆచితూచి స్పందించారు. 52 శాతం మంది ఈ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. -
యూపీ పోల్ సర్వే ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాగా వేయనుందా..! ఎస్పీని, బీఎస్పీని, కాదని ఆ రాష్ట్ర ప్రజలు బేజేపీని ఆహ్వానిస్తారా! అంటే అవుననే సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో చాలా స్పష్టమైన మెజార్టీ వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తమ సర్వేలో తెలిసినట్లు ఇండియా టుడే తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంతో ఇండియా టుడే తాను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో యూపీలో ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించగా ఈసారి ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని బీజేపీ అధిష్టించనుందని తేలింది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బీజేపీకి ఓట్ల శాతాన్ని పెంచుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో బీజేపీకి మద్దతు పెరుగుతూ వచ్చిందని ఈ సర్వే వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అక్టోబర్ నెలాఖరులో బీజేపీకి 31శాతం ఓట్లు వాటా ఉండగా అది డిసెంబర్‌నాటికి 33శాతానికి పెరిగిందని, సీట్ల వారిగా చూస్తే బీజేపీకి 206 నుంచి 216 సీట్లు వస్తాయని తెలిపింది. 2012 బీజేపీకి 15శాతం ఓట్ల వాటా ఉందని, 47 సీట్లు వచ్చాయని గుర్తు చేసింది. రెండో పెద్ద పార్టీగా 26శాతం ఓట్ల షేరింగ్‌తో సమాజ్ వాది పార్టీ నిలుస్తుందని 92నుంచి 97 సీట్లు వస్తాయని, ఇక బీఎస్పీ కూడా ఎస్పీ అంత స్థాయి ఓట్లను పొంది 79 నుంచి 85 సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది.