న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాగా వేయనుందా..! ఎస్పీని, బీఎస్పీని, కాదని ఆ రాష్ట్ర ప్రజలు బేజేపీని ఆహ్వానిస్తారా! అంటే అవుననే సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో చాలా స్పష్టమైన మెజార్టీ వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తమ సర్వేలో తెలిసినట్లు ఇండియా టుడే తెలిపింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంతో ఇండియా టుడే తాను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో యూపీలో ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించగా ఈసారి ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని బీజేపీ అధిష్టించనుందని తేలింది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బీజేపీకి ఓట్ల శాతాన్ని పెంచుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో బీజేపీకి మద్దతు పెరుగుతూ వచ్చిందని ఈ సర్వే వెల్లడించింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అక్టోబర్ నెలాఖరులో బీజేపీకి 31శాతం ఓట్లు వాటా ఉండగా అది డిసెంబర్‌నాటికి 33శాతానికి పెరిగిందని, సీట్ల వారిగా చూస్తే బీజేపీకి 206 నుంచి 216 సీట్లు వస్తాయని తెలిపింది. 2012 బీజేపీకి 15శాతం ఓట్ల వాటా ఉందని, 47 సీట్లు వచ్చాయని గుర్తు చేసింది. రెండో పెద్ద పార్టీగా 26శాతం ఓట్ల షేరింగ్‌తో సమాజ్ వాది పార్టీ నిలుస్తుందని 92నుంచి 97 సీట్లు వస్తాయని, ఇక బీఎస్పీ కూడా ఎస్పీ అంత స్థాయి ఓట్లను పొంది 79 నుంచి 85 సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది.
యూపీ పోల్ సర్వే ఏం చెప్పిందంటే?
Published Thu, Jan 5 2017 10:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
Advertisement
Advertisement