యూపీ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ! | PM Modi meets Uttar Pradesh MPs | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!

Published Thu, Mar 23 2017 9:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

యూపీ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ! - Sakshi

యూపీ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీతో ఏర్పాటైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అభివృద్ధిని ఉరకలెత్తించాలని సూచించేందుకు ప్రధాని మోదీ ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్‌ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 71 ఎంపీ స్థానాలను యూపీలో గెలుపొందింది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ యూపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. '15 ఏళ్ల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పార్టీ సంకల్పమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, అందులో ఎంపీల పాత్రను గురించే చర్చించేందుకే ప్రధాని మాతో భేటీ అవుతున్నారు' అని ఈ సమావేశానికి ముందు యూపీ బీజేపీ ఎంపీ ఒకరు మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement