కొత్త సీఎం టాప్‌ 5 డేరింగ్‌ కామెంట్స్‌.. | Top 5 Controversial Statements of Yogi Adityanath | Sakshi
Sakshi News home page

కొత్త సీఎం టాప్‌ 5 డేరింగ్‌ కామెంట్స్‌..

Published Sun, Mar 19 2017 4:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కొత్త సీఎం టాప్‌ 5 డేరింగ్‌ కామెంట్స్‌.. - Sakshi

కొత్త సీఎం టాప్‌ 5 డేరింగ్‌ కామెంట్స్‌..

లక్నో: ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు వివాదాలు కొత్తేమి కాదు. వ్యక్తిత్వపరంగా, రాజకీయపరంగా ఆయనకు మంచి మార్కులే ఉన్నప్పటికీ.. వివాదాస్పదంగా, నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడటంలో ఆయనకు సాటి ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే ఆయన మాట్లాడిన ప్రతిసారి వార్తల్లో ప్రథమ వరుసలో ఉంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను పరిశీలిస్తే..

మైనారిటీలపై..
‘పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాది పార్టీ రెండున్నరేళ్ల పాలనలో 450అల్లర్ల కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉంటున్న ఓ ప్రత్యేక కమ్యూనిటీ భిన్నరకాల చర్యలకు పాల్పడుతోంది. ఎందుకు ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లో ఇలా జరగడం లేదు? ఎక్కడ 10-20శాతం మైనారిటీ పాపులేషన్‌ ఉంటే అక్కడ చెదురుమదురు అల్లర్లు జరుగుతాయి. అలాగే, వారు ఎక్కడ 20-35శాతంమంది ఉంటారో అక్కడ చాలా తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకుంటాయి. ఇక ఎక్కడ 35శాతానికిపైగా వారుంటారో అక్కడ ముస్లిమేతరులకు చోటే ఉండదు.

కైరానా వలసలపై..
యోగి నేటి గురించి మాట్లాడటం లేదు. భవిష్యత్‌ గురించి మాట్లాడుతున్నాడు. వలసలు అనేది మనకు అతిపెద్ద సమస్య. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను మరో కశ్మీర్‌గా బీజేపీ మారనివ్వదు.

మదర్‌ థెరిసాపై..
భారతదేశాన్ని మదర్‌ థెరిసా క్రైస్తవ దేశంగా మార్చాలనుకుంటున్నారు. సేవ పేరుతో హిందువులను మతమార్పిడి చేసి క్రిస్టియన్లుగా మార్చే కుట్ర ఆమె సేవలో ఉంది.

యోగాపై..
యోగాను ప్రారంభించిన శంకరుడే అతిపెద్ద యోగి. దేశంలోని ప్రతి పదార్థంలో పరమ శివుడు ఉన్నాడు. ఎవరైనా యోగాను పట్టించుకోకుండా ఉండాలని భావిస్తే శివుడు హిందుస్థాన్‌ విడిచి వెళతాడు

షారుక్‌ఖాన్‌పై..
ప్రజలు గనుక షారుక్‌ చిత్రాలను బహిష్కరిస్తే ఆయన కూడా ఓ సాధారణ ముస్లింల మాదిరిగా వీధుల్లో తిరగాల్సిందే. వీళ్లంతా ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నారు. హఫీజ్‌ సయీద్‌ భాషకు షారుక్‌ ఖాన్‌ ఉపయోగించే భాషకు పెద్ద భేదమేమి లేదని నాకు అనిపిస్తోంది.
ఇలా యోగి ఆదిత్యనాథ్‌ గతంలో ఎన్నో సంచలనాత్మక కామెంట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement