![Tirupati Laddu Row: Jagan Asks Union Ministers to Read His Letter To PM](/styles/webp/s3/article_images/2024/09/23/Jagan_Ask_Union_Ministers.jpg.webp?itok=ZvUd1RO2)
గుంటూరు, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు.
తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని జగన్ తన లేఖలో రాశారు.
Kind Attention: Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister Narendra Modi Ji regarding the severe pain caused to the religious sentiments of Hindu devotees https://t.co/TI3vgkaZ0e. @rajnathsingh @AmitShah @nitin_gadkari…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2024
ఇంకా ఆ లేఖలో.. ఏపీలో ప్రభుత్వం 100 రోజులు పూర్తైంది. తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని జగన్ తన లేఖలో కుట్ర కోణాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం'
Comments
Please login to add a commentAdd a comment