
రాఖీ పండుగ రోజు సోదరుల చేతికి రాఖీ కట్టి కష్టసుఖాలలోసోదరుడు తోడునీడై ఉండాలని కోరుకోవడం సహజం. అయితే అన్నతమ్ముల లేదా అక్కచెల్లెళ్లు లేనివారు ఏం చేయాలి? సోదరులుగా భావించే వారి చేతికి రక్షాబంధనం కట్టాలి. కానీ, అటువంటి అవకాశం కూడా లేనివారు ఏం చేయవచ్చంటే... ఒక పచ్చని చెట్టుకు లేదా ఒక మూగజీవికి రక్షాబంధనం కట్టచ్చు. ఆ చెట్టు లేదా ఆ మూగజీవి సంరక్షణ బాధ్యత తీసుకోవచ్చు. చెట్టుకు కడితే వృక్షబంధనమనీ, జీవ రక్షణమనీ పిలుచుకోవచ్చు. పేరు ఏదైతేనేం... రక్షన వహించడమే కదా అసలు ఉద్దేశ్యం. వృక్షాలైతే స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు ఫలాలు ఇస్తాయి. జంతువులైతే మానసిక ఆహ్లాదాన్నిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment