దండేపల్లి: చనిపోయిన పెంపుడు కుక్కను అన్నగా భావి స్తూ.. ఏటా సమాది వద్ద రాఖీలు కడుతూ అభి మానం చాటుకుంటున్నారు ఇద్ద రు అక్కా చెల్లెళ్లు. దండేపల్లి మండలం కన్నె పల్లి గ్రామానికి చెందిన మర్రిపెల్లి మల్లయ్య– కమల దంపతులకు 20 ఏళ్ల క్రితం పిల్లల్లేక పోవడంతో ఓ కుక్కను తెచ్చి రాము అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు.
దాన్ని పెంచుకున్న కొద్ది రోజులకు వారికి ఆడపిల్లలు రమ, రమ్య జన్మించారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకు కుక్క చనిపోవడంతో తమ పొలం వద్ద సమాధి కట్టించారు. అయితే మల్లయ్య–కమల దంపతుల ఇద్దరు కూతుళ్లు ఆ కుక్కను అన్నయ్య లా భావిస్తారు. ఏటా రాఖీ పౌర్ణమి రోజున పొలం వద్ద ఉన్న కుక్క సమాధి వద్దకు వెళ్లి రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment