
తిరుమలాయపాలెం: ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సోమవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్‌ను పరిశీలించి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారంపై ఉద్యోగులకు సూచనలు చేశారు.
రాఖీ పండుగ కావడంతో అక్కడి ఐకేపీ ఏపీఎం అలివేలు మంగ కలెక్టర్‌కు రాఖీ కట్టి హారతి ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారి కావడంతో.. తనలాంటి ఉద్యోగి రాఖీ కట్టడాన్ని ఎలా భావిస్తారోనన్న సంశయంతోనే ఆమె రాఖీ కట్టారు. అయితే, బొట్టు పెట్టకుండా రాఖీ కట్టడాన్ని గమనించిన ఆయన ‘ముందు బొట్టు పెట్టాలి కదా..’అంటూ ఆమెకు సంప్రదాయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment