Khan
-
ముందు బొట్టు పెట్టాలి కదా!
తిరుమలాయపాలెం: ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సోమవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్‌ను పరిశీలించి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారంపై ఉద్యోగులకు సూచనలు చేశారు. రాఖీ పండుగ కావడంతో అక్కడి ఐకేపీ ఏపీఎం అలివేలు మంగ కలెక్టర్‌కు రాఖీ కట్టి హారతి ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారి కావడంతో.. తనలాంటి ఉద్యోగి రాఖీ కట్టడాన్ని ఎలా భావిస్తారోనన్న సంశయంతోనే ఆమె రాఖీ కట్టారు. అయితే, బొట్టు పెట్టకుండా రాఖీ కట్టడాన్ని గమనించిన ఆయన ‘ముందు బొట్టు పెట్టాలి కదా..’అంటూ ఆమెకు సంప్రదాయాన్ని గుర్తు చేశారు. -
బిల్ గేట్స్ ప్రశ్నకు ఖాన్ సమాధానం - వీడియో వైరల్
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల తన సొంత పోడ్కాస్ట్ 'అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తయింది. రెండవ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్లో సాల్ ఖాన్‌కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫోటో చూపించి.. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఈ వ్యక్తి కనిపించారా? ఇద్దరి పేర్లూ ఒకేలా ఉన్నాయని ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ నాకు తెలుసు, నేను అకాడమీ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఫ్యాన్స్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పాడు. ఇదీ చదవండి: అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అంతే కాకుండా.. మెయిల్స్‌లో నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు మ్యాథ్స్ అంత సులభంగా ఎలా చేస్తారు అని ఉండేదని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు బిల్ గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
భారత్‌తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్‌లో జన్మించారు. కొంతకాలం పాక్‌లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్‌కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్ఎఫ్ఎల్కు చెందిన జాక్సన్విల్లే జాగ్వార్‌కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్‌బాల్ కంపెనీ కూడా ఉంది. ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో.. షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. చదువుకునే సమయంలో కష్టాలు షాహిద్‌ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్‌ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది. ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట! -
బహదూర్‌పుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొనసాగనుందా..?
బహదూర్‌పుర నియోజకవర్గం బహదూర్‌పుర నియోజకవర్గంలో నాలుగోసారి మజ్లిస్ నేత మౌజం ఖాన్ విజయం సాదించారు. గతంలో ఉన్న అసిఫ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలోను, ఆ తర్వాత బహదూర్‌పుర నియోజకవర్గం నుంచి మూడుసార్లుగా మౌజం ఖాన్ గెలుస్తున్నారు. మౌజంఖాన్ ఈ ఎన్నికలో 82518 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయనకు 96993 ఓట్లు రాగా, సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది ఇనాయత్ అలీ బక్రీకి 14475 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధి హనీఫ్ అలీకి 7800 ఓట్లు వచ్చాయి. మౌజం ఖాన్ ముస్లిం వర్గం నేత. 2014లో బహదూర్‌పురాలో మౌజంఖాన్ తెలంగాణలో అత్యధికంగా 95045 ఓట్ల మెజార్టీతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది రహమాన్ మహమూద్‌పై గెలుపొందారు. బహదూర్‌పుర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కర్నూలు కు ఏమిచేయని చంద్రబాబు ఇప్పుడు ఓట్లకోసం వస్తున్నాడు : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-
కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తనియా మృతి
-
ఆయన కనిపిస్తే సెల్ఫీలు కోసం వెంటపడతారు
-
ప్రైమ్ మినిస్టర్
ప్రధాని నరేంద్ర మోదీ ఎవరితోనైనా కనీసం అరగంట సేపు మాట్లాడారంటే.. వాళ్లు, దేశంలోని ప్రముఖులైనా అయి ఉంటారు. లేదా ప్రత్యేక విదేశీ ఆహ్వానితులైనా అయి ఉంటారు. అయితే ఇటీవల మోదీతో అరగంట సేపు ముచ్చటించిన ఉత్తరప్రదేశ్ యువతి.. 18 ఏళ్ల నజియా ఖాన్ ఆ ప్రముఖులందరిలోకీ ప్రముఖురాలిగా గుర్తింపు పొందారు. బి.ఎ. ప్రథమ సంవత్సరం చదువుతున్న నజియా.. ‘సాహస పురస్కారం (బ్రేవరీ అవార్డు) అందుకోవడానికి మరో 14 మందితో కలిసి ఢిల్లీ వచ్చిన సందర్భంగా మోదీ ఆమెతో ప్రత్యేకంగా సంభాషించారు. కిడ్నాప్ కాబోతున్న ఆరేళ్ల బాలికను దుండగుల బారి నుంచి కాపాడటమే కాకుండా, ఆగ్రాలో తన కుటుంబ పరిసరాలలో జూదాన్ని అరికట్టడానికి తెగువ చూపడంతో ఈ అవార్డుకు నజియా ఎంపికయ్యారు. అవార్డును స్వీకరించేందుకు తల్లితో కలిసి ఢిల్లీ వచ్చిన నజియాతో మాట్లాడుతూ ఆ వివరాలన్నిటినీ కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు మోదీ. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుని అనేక అవార్డులను గెలుచుకున్న నజియాకు.. మోదీ తనతో అంతసేపు మాట్లాడడం సహజంగానే సంతోషాన్ని కలిగించింది. ‘‘మోదీజీ నన్ను ‘లడకు’ అని పిలిచారు అని ఇప్పటికీ ఆమె ఎంతో అబ్బురంగా చెప్పుకుంటున్నారు. లడకా, లడికీ (అబ్బాయి, అమ్మాయి) లను కలిపి.. మోదీ మురిపెంగా ‘లడకు’ అని చేసిన పద ప్రయోగంలో అమ్మాయిలు అబ్బాయిలకన్నా ఏమీ తక్కువ కాదు అనే భావన ఉంది. అయితే మోదీ అక్కడితో ఆగలేదు. ‘‘నజియా మీతో పోట్లాడుతుంటుందా?’’ అని నజియా తల్లిని దగ్గరకు పిలిచి మరీ అడిగారు. దానికి ఆ తల్లి మనసు ఉప్పొంగిపోయింది. అవార్డు తీసుకున్న అనంతరం రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా నజియా పాల్గొన్నారు. మొత్తం 18 మంది అవార్డు గ్రహీతలలో నజియా ఒకరు. వారిలో ముగ్గురికి మరణానంతరం అవార్డు లభించింది. -
అవమానంపై ఫిర్యాదు చేస్తా: ఎంపీ ఖాన్
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై పార్లమెంట్ చైర్మన్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రాజ్యసభ సభ్యుడు కె.ఎం.ఖాన్ చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మెట్రో ప్రారంభోత్సవానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు. అధికారంలో ఎవరున్నా ప్రజాస్వామిక సాంప్రదాయాలు, ప్రొటోకాల్‌ను పాటించాలన్నారు. మేయర్‌గా ఎవరున్నా వ్యక్తిగా కాకుండా, హోదాను గౌరవించాలన్నారు. మేయర్‌నూ అవమానించడం దారుణమని అన్నారు. -
మరోసారి కరీనా బిడ్డడి హల్చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల కొడుకు మరోసారి వార్తల్లో నిలిచాడు. మంగోలు మహారాజు తైమూర్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ బుడ్డోడి ఫోటో ఇపుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. తాజాగా కరీనా సహా, ఆమె లిటిల్ ఏంజెల్ ఫోటోను ఓ ఫ్యాన్ ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు. తల్లిదండ్రుల పోలికలతో ముద్దులొలుకుతూ అమ్మ ఒడిలో ఒదిగిపోయిన ఈ చిన్నిరాజా ఫోటో ఇపుడు స్టార్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అభిమానుల షేర్లు, లైక్ లతో నిండిపోయింది. కాగా కపూర్, సైఫ్ జంటకు తైమూర్ ఖాన్ డిసెంబర్ 20, 2016 న జన్మించాడు. అయితే తమ చిన్నారికి తైమూర్ అలీఖాన్ పటౌడీ నవాబ్ అని పేరు పెట్టడం అప్పట్లో సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. -
నిర్మాతగా... 300 కోట్లు!
వరుస చిత్రాలతో, వందల కోట్ల వసూళ్ళతో బాలీవుడ్లో దూసుకుపోతున్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పుడు నిర్మాతగా వందల కోట్ల ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్స్‌పై ఆయన రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక చిత్రం తెరకెక్కించనున్నారు. 1914లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. టొరొంటోలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న భారతీయుడు అజయ్ వీర్మాణితో కలిసి సల్లూ ఈ చిత్రం నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇర్ఫాన్‌ఖాన్‌ను హీరోగా ఎంపిక చేశారట. అజయ్ వీర్మాణి మాట్లాడుతూ- ‘‘అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు భారీ బడ్జెట్ పెడుతున్నాం. ఈ చిత్రానికి సల్మాన్ భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతోంది. ఆ పరిస్థితులనే చూపించనున్నాం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని చెప్పారు. -
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది!
ఢాకాః ఐసిస్ లో చేరడం, ఐసిస్ మిలిటెంట్లు అని చెప్పుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయిందని బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసదుజ్జమన్ ఖాన్ అన్నారు. 20 మందిని రెస్టారెంట్లో బంధించి ఢాకాలో మారణ హోమం సృష్టించిన వారు బంగ్లాదేశ్ కు చెందిన వారేనని ఆయన స్సష్టం చేశారు. ఒకప్పుడు దేశంలో బ్యాన్ చేసిన జమీయుతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థ కు చెందిన సభ్యులుగా వారిని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారికీ ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపిన మంత్రి .. వారంతా స్థానిక ధనిక కుటుంబాలకు చెందినవారేనన్నారు. ఢాకా రెస్టారెంట్లో మారణహోమానికి పాల్పడ్డవారికీ, ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ తెలిపారు. వారంతా స్థానిక సంపన్న కుటుంబాలకు చెందిన వారేనని, దాడులు తామే నిర్వహించామని చెప్తున్న ఐసిస్ మాటలు నిజం కాదని ఆయన స్సష్టం చేశారు. ఉగ్ర దాడులకు పాల్పడిన వారంతా పదేళ్ళక్రితం దేశంలో బ్యాన్ చేసిన జమీయతుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన సభ్యులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై గత శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని బందీలుగా చేసిన విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు సైనికులు దాదాపు 11 గంటలపాటు శ్రమించారు. అదే నేపథ్యంలో భద్రతాదళాలు, ఉగ్రమూకలకు జరిగిన హోరా హోరీ పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. 20 మంది సాధారణ పౌరులు సైతం చనిపోయారు. అయితే మారణహోమానికి మేమే కారణమంటూ ఐసిస్ వెల్లడించినా అదంతా అబద్ధమేనని బంగ్లాదేశ్ అధికారులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ జిహాదీ గ్రూపులకు బంగ్లాదేశ్ దాడులకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. దాడులకు పాల్పడి చనిపోయిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా... బంగ్లాదేశ్ నిఘా అధికారులు అతడిని విచారిస్తున్నారు. ఢాకా దాడుల్లో పాల్తొన్న ఉగ్రవాదులంతా యూనివర్శిటీల్లో చదువుకున్నవారేనని, ఎవ్వరూ మదర్సాలనుంచి వచ్చినవారు కాదని ఖాన్ వివరించారు. అయితే వారంతా ఇస్టామిస్ట్ మిలిటెంట్లుగా ఎందుకు మారుతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఖాన్... ఇటీవల ఐసిస్ అని చెప్పుకోడం కూడ ఓ ఫ్యాషన్ గా మారిపోతోందన్నారు. -
పెళ్ళికోసమే ఛస్తున్నాః సల్మాన్ ఖాన్
తన మాటలతో ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈసారి తనడైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేట్లు చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఖాన్.... 'నేను పెళ్ళికోసం పడి ఛస్తున్నానని, అయితే ఇతరుల అంగీకారం కోసం వేచి చూస్తున్నానని' చెప్పడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సింగింగ్ రియాలిటీ షో 'సా రే గా మా పా' లో పాల్గొన్న దబాంగ్ స్టార్ ను ఓ పోటీదారుడు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో అడ్వైజ్ అడగడంతో ఖాన్ అలా సమాధానం ఇచ్చాడు. లులియా వంటోర్.. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అని, అతడు ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని వస్తున్న పుకార్లపై ఎదరయ్యే ప్రశ్నలను తప్పించుకునేందుకే సల్మాన్.. సింగింగ్ రియాలిటీ షో 'స రే గా మా పా' లో తాను పెళ్ళికోసం ఛస్తున్నానంటూ చమత్కరించి ఉండొచ్చని జనం గుసగుసలాడుతున్నారు. ఏభై ఏళ్ళ వయసున్న ప్రసిద్ధ సినీ స్టార్.. తానెప్పుడూ స్థిరపడాలనే అనుకుంటున్నానని, అయితే తనను ఇతరులు అంగీకరించడం కోసమే వేచి చూస్తున్నట్లు తెలిపాడు. స రే గా మా పా పోటీదారుడు జగ్ ప్రీత్ బజ్వా... జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటూ సల్మాన్ ను సలహా అడగడంతో.. ''మీరు తప్పుడు వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు జగ్ ప్రీత్... ఆ విషయంలో నేను చాలా అన్ లక్కీ పర్సన్.. నా గురించి జనం అనుకుంటున్నది కూడ తప్పే..'' అంటూ సల్మాన్ చమత్కరించినట్లు.. టీవీ షో జారీ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పైగా... ఇది పురుషులు చెప్పే విషయం కాదని, అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఈ విషయాన్ని చెప్పాలని సల్మాన్ చమత్కరించాడట. మరోవైపు నేను సల్మాన్ ఖాన్ కి అతి పెద్ద ఫ్యాన్ అని, ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, భాయ్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అదే సంవత్సరంలో నేను కూడ పెళ్ళి చేసుకుంటానని కార్యక్రమానికి మెంటార్ గా ఉన్న మిల్కా సింగ్ చెప్పడం.. రియాలిటీ షో లో నవ్వులు పూయించింది. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'సా రే గా మా పా షోలో' సల్మాన్ హాజరైన ఈ భాగం టీవీలో జూన్ 26న ప్రసారం కానుంది. -
మాటకు భూతద్దం
కాంట్రవర్సీ ‘రేప్ తప్పనిసరి అయినప్పుడు ఆస్వాదించాలి’ ఇదో విదేశీ నానుడి. అయితే మన దగ్గర రేప్ సంఘటనలు జరిగినప్పుడు ఓ పెద్దాయన ఈ మాటను స్టేట్మెంట్గా వాడి వివాదానికి మూలమయ్యాడు. అభాసు పాలయ్యాడు. విషయం తీవ్రమైనది, సున్నితమైనదీ అయినప్పుడు చేసే వ్యాఖ్యలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ పెద్దమనిషిలా పరాభావం చెందుతారు. అయితే ప్రతి వాళ్ల వ్యాఖ్యలను, ప్రతి విషయాన్నీ అంతే సునిశితంగా జల్లెడబట్టాల్సిన అవసరంలేదు. సునిశితంగా పరిశీలించడమూ అనవసరం! ఈ ప్రస్తావన ఎందుకు అంటే... మొన్న సల్మాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల గురించి రేగిన దుమారం తెలిసిందే! ’సుల్తాన్’ సినిమాలో తాను ఫైటర్‌తో ఫైట్ చేయడానికి చాలా శ్రమపడ్డానని సల్మాన్ చెప్తూ ‘ఆ సమయంలో రేప్‌కి గురైన అమ్మాయిలా ఫీలయ్యా’నని చెప్పాడు. ఈ మాటలకు దేశంలోని మహిళా సంఘాలన్నీ అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ ఏకంగా క్షమాపణే కోరింది. సల్మాన్‌కి బదులు సల్మాన్ తండ్రి సలీమ్ క్షమాపణ చెప్పి గండం గట్టెక్కించాడు. కొడుకు తప్పు మాట్లాడితే తండ్రి అపాలజీ చెప్పడమేంటనే నిరసనా వ్యక్తమయిందనుకోండి అది వేరే విషయం! స్టేట్మెంట్లు... వ్యాఖ్యలు సమయం, సందర్భాన్ని బట్టి ఉండాలి. వీటిల్లో తేడా వస్తే మొదటికే మోసం వస్తుందనేది గమనించాల్సిన విషయం. అయితే సల్మాన్ విషయంలో దీనికి మినహాయింపు ఉందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. కారణం.. అది అసంబద్ధమైన వ్యాఖ్య తప్ప దురుద్దేశంతో అన్నది కాదు అంటారు కొంతమంది. ఆయన ఇచ్చిన ఉపమానం సరైంది కాదు తప్ప స్త్రీల పట్ల తప్పుడు అభిప్రాయంతో అన్న మాట కాదనేది వాళ్ల వాదన. అది తెలియనితనమే కాని పురుషహంకారం కాదు అంటున్నారు. ఈ మధ్య మనుషులం ప్రతిదానికీ అతిగా స్పందిస్తున్నామేమో. ఆ అతి స్పందనలోంచే ఈ గగ్గోలంతా అంటున్నారు ఆ పెద్దలు. సమాజంలో కాస్త పేరుప్రతిష్టలు, గౌరవమర్యాదలున్న వ్యక్తులు ఏం మాట్లాడినా భూతద్దంలోంచి చూస్తున్నాం.. ఈ లెక్కన ఏ విషయం మీద ఎవరూ ఏమీ మాట్లాడలేని స్థితి రావచ్చు అని హెచ్చరిస్తున్నారు. సల్మాన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పూజాబేడీ ఈ మాటే అంది.. ‘సల్మాన్ వాడిన మాట తప్పయితే పిచ్చి, మతిస్థిమితం లేకపోవడం, ఉరి, హత్య, ఉన్మాదం లాంటి మాటలను ఉచ్చరించడం కూడా తప్పే’ అన్నారు. అంటే మనం ఓవర్సెన్సిటైజ్ అవుతున్నాం అంటారు ఆమె. కులాలను దూషిస్తూ, కించపరుస్తూ ఉన్న సామెతలు, నానుడులు, స్త్రీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు, వ్యాఖ్యలు, చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టే మాటలు, మత ఆచారవ్యవహారాలను అవమానపరుస్తూ చేసే వ్యాఖ్యలు, స్టేట్మెంట్లు వంటి వాటిని నిలువరించడంలో అర్థం ఉంది కాని ప్రతి మాటను ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా సెన్సార్ కట్లు విధిస్తే భవిష్యత్తులో భావస్వేచ్ఛ ఉంటుందికాని వ్యక్తీకరణస్వేచ్ఛ హరించే ప్రమాదం ఉందని వాపోతున్నారు పెద్దలు! తండ్రి క్షమాపణ ఏంటి? నిజమే.. ఈ మధ్య ఏం మాట్లాడినా తప్పే అవుతోంది. అంటే... సాధారణ జనం ఏం మాట్లాడినా చెల్లుతుంది కాని ఓ ఇమేజ్ ఉన్న మనుషులు కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరమేర్పడుతుంది. అయితే సల్మాన్ అన్న మాట మరీ అభ్యంతరకరమైనది కాదు కానీ అసంబద్ధమైందని చెప్పొచ్చు. ఆయన చెప్పిన ఉపమానం సరైంది కాదు. ఎవరికైనా స్త్రీలకు సంబంధించిన ఉపమానాలు, పదాలు చాలా సులభంగా తడ్తాయి. అందుకే ఇలాంటి వాటిని చాలా తేలికగా అనేస్తారు. అయితే సల్మాన్ వ్యాఖ్యకు ఉద్యమాలు చేయాల్సిన అవసరంలేదు. ఆయన కావాలని ఆ మాట అనలేదు. స్త్రీ పట్ల ఆయనకు దురుద్దేశమేమీ లేదు. చటుక్కున ఒక ఉపమానం తోచింది. అనేశాడు. అలాంటప్పుడు క్షమాపణ ఆయన చెప్పక వాళ్ల నాన్న చెప్పడమేంటి? అన్నది సల్మానే కాబట్టి క్షమాపణా ఆయనే ఇవ్వాలి. - మృణాళిని, రచయిత, ప్రొఫెసర్ మాట్లాడడమే కష్టం ఈ మధ్య ప్రముఖులు ఏం మాట్లాడినా విపరీతమైన అర్థాలు తీసి క్షమాపణలు అడగడం.. దాని మీద కోర్టుకెళ్లడాలు పరిపాటి అయింది. ఓవర్సెన్సిటైజ్ అవుతున్నామేమో! మాట్లాడిన ప్రతిదాన్నీ సీరియస్‌గానే తీసుకొని ఈకలు ఈకి, పీకలు పీకితే అసలు మాట్లాడడమే కష్టమవుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత -
సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష ఖరారవడం నగరవాసుల్లో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ హీరోల్లో బహుశా ఎవరికీ లేనంత అనుబంధం సల్మాన్‌ఖాన్‌కి సిటీతో ఉంది. సల్లూభాయ్ నగరానికి వస్తే చాలు అతడిని చూడడానికి ఎగబడతారు. తన సినిమాలను సూపర్‌హిట్ చేయడంలో రికార్డులు సృష్టించిన జోధ్‌పూర్ వంటి నగరాలను దాటి సల్మాన్ మన హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి అభిమానులు సల్మాన్ మానియాకు కేరాఫ్‌గా నిలిచారనేది అధికారికంగా రూఢీ అయిన విషయం. అందుకే.. ‘సల్లూభాయ్ వుయ్ లవ్ యు’ అంటూ సిటీ సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి క్రేజ్‌కి కేరాఫ్ సల్లూభాయ్ సల్మాన్‌కి సిటీ అంటే మహా ఇష్టం. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్స్ అంటే ఇష్టపడేవాడని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారు. తెలుగు నటి భూమికాచావ్లాతో నటించిన ‘తేరేనామ్’ ఇక్కడి సిటీ కాలేజ్‌లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఇంకా ‘వాంటెడ్’ తదితర సినిమాలూ షూటింగ్ జరుపుకున్నాయిక్కడ. మన బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా సల్మాన్‌కి చాలా ఇష్టం. తన సోదరి అర్పిత పెళ్లి నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయడం సిటీ మీద సల్మాన్‌కి ఉన్న అభిమానానికి నిదర్శనం. సల్మాన్ హోస్ట్ చేసిన టీవీ షో ‘బిగ్‌బాస్’లో తొలి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఖాసిఫ్ ఖురేషి నగరవాసే. సిటీలోని సబేరీ కళ్లజోడు షోరూమ్‌కి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి నడుడికి శిక్ష పడడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందరికీ మంచి చేసే వ్యక్తి.. పలు ఈవెంట్స్‌తో పాటు అర్పిత మ్యారేజ్‌కు సల్మాన్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా పనిచేశా. సీసీఎల్ ఆఫ్టర్ పార్టీలో సంతోష్‌నగర్‌కు చెందిన బౌన్సర్ రఫీఖ్.. సల్మాన్‌ని ఆర్మ్ రెజ్లింగ్‌లో ఓడించాడు. దీనికి ఏ మాత్రం ఫీలవ్వకపోగా, అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రశంసించాడు. తన దగ్గర పనిచేసేవారిని సల్లూభాయ్ బాగా చూస్తాడు. అందరికీ మంచి చేసే వ్యక్తికి శిక్ష పడడం వేదనకు గురిచేసింది. - మహ్మద్ అబ్రార్, సల్మాన్‌కు సిటీలో సెక్యూరిటీ చాలా మారిపోయాడు.. చాలా బాధగా ఉంది. సిటీకి సల్మాన్ ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూసేవాడిని. తనని చూసే రెగ్యులర్‌గా బ్రాస్లెట్ వాడుతున్నా. హీరోగా ఎంత మంచి నటుడో.. వ్యక్తిగా అంత సహృదయుడు. ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ వంటి చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఐదేళ్ల ఖైదు వల్ల సినిమాలకు మాత్రమే కాదు.. ఆయన్ను నమ్ముకున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత తను చాలా మారాడు. వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఒక అభిమానిగానే కాకుండా ఆయన కారణంగా సాయం పొందుతున్న వారి తరపున ఆలోచించి బాధపడుతున్నా. - అహ్మద్‌ఖాన్, ఈవెంట్ కో ఆర్డినేటర్ రియల్ ‘హ్యూమన్’ సల్మాన్ చిన్నప్పటి నుంచీ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు కలవాలనుకున్నా కుదర్లేదు. అతను చేసే చారిటీ కార్యక్రమాలు నాలో మరింత అభిమానాన్ని పెంచాయి. అలాంటిది.. అతనికి ఇలా శిక్ష పడడం చాలా బాధగా అనిపిస్తోంది. తన వల్ల చాలా మంది చిన్నారులు సేవ్ అయ్యారు. దేవుడు అతనికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. - ప్రత్యూష, సిటీ మోడల్ -
నెగిటివ్ రోల్స్ ఇష్టం
ఆయన సినిమా చూస్తుంటే మన పక్కింటి బాషా భాయ్... ఎదురింటి శంకరన్న మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాదీ గల్లీలు మన కళ్లకు కడతాయి. బాలీవుడ్ బాద్షాలా... హైదరాబాదీలకు ఓ ఖాన్ ఉన్నాడు. హాఫ్ ప్రై, జబర్దస్త్, గుళ్లుదాదాల్లో నెగిటివ్ రోల్స్‌లో మెప్పించి, ఏక్తా సర్దార్తో కథానాయకుడిగా హైదరాబాదీల మనసు దోచుకున్న ఆ ఖాన్.. తౌఫిక్ ఖాన్. నటుడిగానే పరిమితమవ్వకుండా మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి... సిటీ కల్చర్‌ను, సిటీకే సొంతమైన భాషను దృశ్యమానం చేస్తున్నాడు. త్వరలో మరో సినిమా ముహూర్తానికి రెడీ అవుతున్న ఖాన్‌ను సాక్షి సిటీప్లస్ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ..:: దార్ల వెంకటేశ్వరరావు తెరపై నన్ను నేను చూసుకోవాలని మెహిదీపట్నంలోని రిషి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగానే కళాశాల నాటకాల్లో నటించేవాణ్ణి. డ్రామాల్లో నన్ను చూసిన ఫ్రెండ్స్ మెచ్చుకునే వాళ్లు. అప్పుడే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. స్నేహితుల సహకారంతో మొదట నాలుగు సినిమాల్లో నటించాను. నెగిటివ్ రోల్స్ ఇష్టం. అందుకే మొదట అవి చేశాను. తరువాత సొంత బ్యానర్ ‘మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ ఏర్పాటు చేశాను. ఈ క్రమంలో నా దోస్తులు సయ్యద్ హమీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, జయంత్‌ల ప్రోత్సాహం మరువలేనిది. రియల్ స్టోరీ... నాలుగు చిత్రాల తర్వాత ఏక్తాసర్దార్ సొంత బ్యానర్‌పైనే నిర్మించాను. ఇందులో లీడ్‌రోల్ చేశాను. హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం గడిపే ఓ ఆటోడ్రైవర్ పోలీసుల వేధింపులతో సర్దార్‌గా ఎలా మారాడనేది ఆ చిత్ర సారాంశం. హైదరాబాదీ భాష, వ్యవహారంతో పాటు అచ్చ హైదరాబాదీ చిత్రంలా ఉండేందుకు నా ఫ్రెండ్స్ అక్బర్బిన్ తబర్, అద్నాన్ సాజిద్, గుళ్లుదాదా, ఆర్కే మామ, అజీజ్ నాసిర్, అల్తాఫ్ హైదర్ గ్యాంగును తీసుకున్నా. ఈ చిత్రంలో బాగా నటించేందుకు ముంబై నుంచి శిక్షకులను పిలిపించుకుని, వారి దగ్గర మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నా. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్లో పెద్ద నటుడైన ముఖేష్ రిషీని ఒప్పించాం. ఆయన అంగీకరించడం సంతోషాన్నిస్తే... ఆ చిత్రం హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సీక్వెల్‌గా కొత్త సినిమా ప్రారంభిస్తున్నా. సొంతానికి వాడుకోను... సినిమాలో నటించినపుడు వచ్చిన డబ్బు, చిత్ర నిర్మాణం తర్వాత వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను. వచ్చిన డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా. ఆ అల్లా దయతో నాకు ఈ జీవితానికి కావాల్సినంత డబ్బు బిజినెస్ ద్వారా వస్తుంది. సినిమాలో వచ్చినా రాకపోయినా 365 రోజులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటా. బియ్యం, రంజాన్ సమయంలో దుస్తులు, పండుగ సరుకులు అందిస్తుంటా. సేవలో ఉండే ఆనందం చాలా గొప్పది. తల్లిదండ్రుల పేరుతో యాకుత్‌పుర అమన్‌నగర్‌లో అమీనా యూసుఫ్ మసీదు నిర్మించా. సినిమాల్లో నటించడం డబ్బు కోసం కాదు కాబట్టే ఇంత కాలం ఇతర సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదులుకున్నా. అయితే ఈ సారి వస్తే నటించి, ఆ డబ్బు ట్రస్టులకు ఇవ్వాలని అనుకుంటున్నా. పేరు తెచ్చుకోవాలని... ఏక్తాసర్దార్ ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా బాగా ఆడింది. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. మక్కాకు వెళితే అక్కడ చాలా మంది గుర్తు పట్టి ‘సర్దార్’ అంటూ పిలిచారు. దుబాయ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇలా అభిమానులు వచ్చి పిలుస్తూ ఫొటోలు దిగుతుంటే చాలా మజా అనిపిస్తుంది. ‘యే షహర్ మేతో సిర్ఫ్ ఏకీ రహ్సక్తా... ఓ హై సర్దార్’ డైలాగ్ లాగే హైదరాబాద్ సర్దార్‌గా ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉంది. సన్నీ డియోల్, నానా పటేకర్ అంటే ఇష్టం. తెలుగులో ప్రకాష్‌రాజ్ నటన అంటే అమితమైన ప్రేమ. ప్రోత్సాహమివ్వాలి... చిన్న నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. హైదరాబాద్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అది మారాలి! -
సోలార్ డ్రయ్యర్‌తో మేలు
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అయినకాడికి తెగనమ్ముకోవడమో లేక చెత్తకుప్పలో పారేయడమో కాకుండా.. వ్యవసాయోత్పత్తులను చక్కగా శుద్ధిచేసి, రూపం మార్చి అమ్ముకోగలిగితే రైతు కుటుంబాలు లేదా రైతు సంఘాల ఆదాయం బాగా పెరుగుతుంది. ఉదాహరణకు.. టమాటా మార్కెట్ ధర బాగా తగ్గిపోయినప్పుడు టమాటాలను ముక్కలు కోసి ఒరుగులుగా ఎండబెట్టి, పొడి చేసి అమ్ముకునే వీలుంది. సంప్రదాయ పద్ధతుల్లో కన్నా సోలార్ డ్రయ్యర్ల సహాయంతో ఈ పనిచేస్తే వేగంగా పని కావడంతోపాటు, సరుకు నాణ్యత కూడా చాలా బాగుంటుంది. టమాటాతోపాటు కొబ్బరి, ద్రాక్ష, అంజూర, క్యారెట్, మామిడి, ఉల్లి, కరివేపాకు, అల్లం, గోధుమగడ్డి వంటి వ్యవసాయోత్పత్తులతోపాటు మాంసం, చేపలు, రొయ్యలను కూడా ఈ పద్ధతిలో వేగంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఎండబెట్టవచ్చు. మాంసాన్ని సోలార్ డ్రయ్యర్లో ఒక్క రోజులోనే దుమ్మూ ధూళి పడకుండా ఎండబెట్టవచ్చని, కిలో మాంసం ఎండబెడితే అరకిలో ఒరుగులు వస్తాయని ఎన్ఐఆర్డీ కన్సల్టెంట్ ఖాన్ ‘సాక్షి’తో చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ- రాజేంద్రనగర్, హైదరాబాద్) ఇందుకు మార్గం చూపుతోంది. ఎన్ఐఆర్డీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రామీణ సాంకేతిక ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శించాయి. సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్(040-23608892) 8 కిలోలు, 50 కిలోలు, 100 కిలోల సామర్థ్యం కలిగిన సోలార్ డ్రయ్యర్లను అందుబాటులోకి తెచ్చింది. టీవేవ్ పవర్‌టెక్ సంస్థ (040-27266309) సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శనకు ఉంచింది. డ్రయ్యర్లను కొనుగోలు చేసే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి 40 శాతం రాయితీ లభించే వీలుందని చెబుతున్నారు. సోలార్ ఫ్రిజ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే రైతులు, మత్స్యకారులు, యువతీ యువకులు సోలార్ డ్రయ్యర్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. వివరాలకు ఎన్ఐఆర్డీలోని గ్రామీణ మౌలిక సదుపాయాల కేంద్రం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ శివరాం (94408 46605 టజీఠ్చిః జీటఛీ.జౌఠి.జీ)ను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డె్స్క్ -
బాలీవుడ్ ఖాన్ లా రంజాన్ సంబరాలు
-
ఆరోజు అక్కడ ఎవరున్నారు?
కామ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న శ్రుతిహాసన్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఓ అగంతకుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించడం... ఆమెపై రకరకాల చర్చలకు కారణమైంది. ఇన్సిడెంట్ జరిగిన 48 గంటల్లో ఆ అగంతకుణ్ణి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల శ్రుతి ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అతనికి తగిన శిక్షవేయాల్సిందే అని మీడియా సాక్షిగా శ్రుతి నొక్కివక్కాణించారు కూడా. తన సోదరుని ఉద్యోగం పనిమీదే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లుగా చెబుతున్న నిందితుని వివరణ గురించి మీడియా ప్రస్తావిస్తే... పని ఆడగడానికి వచ్చినవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియనంత అమాయకురాలిని కానని కొట్టిపారేశారు శ్రుతి. పోలీసులకు అతని ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని, షూటింగ్ లొకేషన్లో కూడా అతణ్ణి తాను గమనించానని, తన సోదరుని ఉద్యోగం విషయాన్ని తాను ఎవరివద్దా సంప్రదించనేలేదని చెప్పారు శ్రుతి. ఇదిలావుంటే... బాలీవుడ్ మీడియాలో ఈ సంఘటనపై ఓ కొత్త కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే... ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించబోయిన సమయంలో శ్రుతితో పాటు ఆ ఇంట్లో ఓ ‘ఖాన్’ హీరో కూడా ఉన్నాడని, సదరు హీరోగారి భార్యగారే... వీరి గుట్టును రట్టు చేయడానికి కావాలనే.. ఆ అగంతకుణ్ణి శ్రుతి ఇంటికి పంపిందని ఈ కొత్త కథనం సారాంశం. మరి... ఈ మూడు వెర్షన్లలో ఏది కరెక్టో ఆ దేవుడికే తెలియాలి.