ఆరోజు అక్కడ ఎవరున్నారు?
ఆరోజు అక్కడ ఎవరున్నారు?
Published Tue, Nov 26 2013 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
కామ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న శ్రుతిహాసన్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఓ అగంతకుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించడం... ఆమెపై రకరకాల చర్చలకు కారణమైంది. ఇన్సిడెంట్ జరిగిన 48 గంటల్లో ఆ అగంతకుణ్ణి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల శ్రుతి ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అతనికి తగిన శిక్షవేయాల్సిందే అని మీడియా సాక్షిగా శ్రుతి నొక్కివక్కాణించారు కూడా. తన సోదరుని ఉద్యోగం పనిమీదే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లుగా చెబుతున్న నిందితుని వివరణ గురించి మీడియా ప్రస్తావిస్తే... పని ఆడగడానికి వచ్చినవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియనంత అమాయకురాలిని కానని కొట్టిపారేశారు శ్రుతి.
పోలీసులకు అతని ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని, షూటింగ్ లొకేషన్లో కూడా అతణ్ణి తాను గమనించానని, తన సోదరుని ఉద్యోగం విషయాన్ని తాను ఎవరివద్దా సంప్రదించనేలేదని చెప్పారు శ్రుతి. ఇదిలావుంటే... బాలీవుడ్ మీడియాలో ఈ సంఘటనపై ఓ కొత్త కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే... ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించబోయిన సమయంలో శ్రుతితో పాటు ఆ ఇంట్లో ఓ ‘ఖాన్’ హీరో కూడా ఉన్నాడని, సదరు హీరోగారి భార్యగారే... వీరి గుట్టును రట్టు చేయడానికి కావాలనే.. ఆ అగంతకుణ్ణి శ్రుతి ఇంటికి పంపిందని ఈ కొత్త కథనం సారాంశం. మరి... ఈ మూడు వెర్షన్లలో ఏది కరెక్టో ఆ దేవుడికే తెలియాలి.
Advertisement
Advertisement