
తమిళసినిమా: ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయన వారసురాలు శ్రుతిహాసన్ గురించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్‌గా వెలిగిపోతున్న లోకేశ్ కనకరాజ్ క్రేజ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు కలిస్తే ఆ ప్రాజెక్ట్ మజానే వేరు కదా?. అవును కమలహసన్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను నటింపజేశారు. అయితే ఇది చిత్రంలో కాదు. ఒక స్పెషల్ మ్యూజికల్ ఆల్బమ్‌లో. ఈ ఆల్బమ్‌ను కమలహాసన్ రూపొందించడంతో పాటు, అందులోని పాటను రాయడం విశేషం. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శ్రుతిహాసన్ పాడడంతో పాటు సంగీతాన్ని అందించడం. ఈ ఆల్బమ్‌కు ఇనిమేల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
దీనికి ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భువన్‌గౌడ చాయాగ్రహణం అందించారు. ఆల్బమ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా శ్రుతిహాసన్‌కు మ్యూజిక్ ఆల్బమ్‌లు రూపొందించడం కొత్తేమి కాదు. ఇంతకు ముందు ఎడ్జ్, షీస్ ఏ హీరో, మాస్టర్ మోషన్ పేర్లతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్స్ సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. దీంతో తాజాగా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#Inimel all your Delulus become Trulus#Ulaganayagan #KamalHaasan#InimelIdhuvey@ikamalhaasan #Mahendran @Dir_Lokesh @shrutihaasan @RKFI @turmericmediaTM@IamDwarkesh @bhuvangowda84 @philoedit #SriramIyengar @SowndarNallasa1 @gopiprasannaa @Pallavi_offl @iGeneDIandVFX… pic.twitter.com/awY7qzQpHF
— Raaj Kamal Films International (@RKFI) March 14, 2024