
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై పార్లమెంట్ చైర్మన్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రాజ్యసభ సభ్యుడు కె.ఎం.ఖాన్ చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మెట్రో ప్రారంభోత్సవానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు. అధికారంలో ఎవరున్నా ప్రజాస్వామిక సాంప్రదాయాలు, ప్రొటోకాల్‌ను పాటించాలన్నారు. మేయర్‌గా ఎవరున్నా వ్యక్తిగా కాకుండా, హోదాను గౌరవించాలన్నారు. మేయర్‌నూ అవమానించడం దారుణమని అన్నారు.