అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది! | ISIS has become a fashion: Asaduzzaman Khan | Sakshi
Sakshi News home page

అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది!

Published Mon, Jul 4 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది!

అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది!

ఢాకాః ఐసిస్ లో చేరడం, ఐసిస్ మిలిటెంట్లు అని చెప్పుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయిందని బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసదుజ్జమన్ ఖాన్ అన్నారు. 20 మందిని రెస్టారెంట్లో బంధించి ఢాకాలో మారణ హోమం సృష్టించిన వారు బంగ్లాదేశ్ కు చెందిన వారేనని ఆయన స్సష్టం చేశారు. ఒకప్పుడు దేశంలో బ్యాన్ చేసిన జమీయుతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థ కు చెందిన సభ్యులుగా వారిని  పేర్కొన్నారు.  దాడులకు పాల్పడిన వారికీ ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపిన మంత్రి .. వారంతా స్థానిక ధనిక కుటుంబాలకు చెందినవారేనన్నారు.

ఢాకా రెస్టారెంట్లో మారణహోమానికి పాల్పడ్డవారికీ, ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ తెలిపారు. వారంతా స్థానిక సంపన్న కుటుంబాలకు చెందిన వారేనని, దాడులు తామే నిర్వహించామని చెప్తున్న ఐసిస్ మాటలు నిజం కాదని ఆయన స్సష్టం చేశారు. ఉగ్ర దాడులకు పాల్పడిన వారంతా  పదేళ్ళక్రితం దేశంలో బ్యాన్ చేసిన జమీయతుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన సభ్యులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై గత శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని బందీలుగా చేసిన విషయం తెలిసిందే.  వారిని రక్షించేందుకు సైనికులు దాదాపు 11 గంటలపాటు శ్రమించారు. అదే నేపథ్యంలో భద్రతాదళాలు, ఉగ్రమూకలకు జరిగిన హోరా హోరీ పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. 20 మంది సాధారణ పౌరులు సైతం చనిపోయారు. అయితే మారణహోమానికి మేమే కారణమంటూ ఐసిస్ వెల్లడించినా అదంతా అబద్ధమేనని బంగ్లాదేశ్ అధికారులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ జిహాదీ గ్రూపులకు బంగ్లాదేశ్ దాడులకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. దాడులకు పాల్పడి చనిపోయిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా... బంగ్లాదేశ్ నిఘా అధికారులు అతడిని  విచారిస్తున్నారు.

ఢాకా దాడుల్లో పాల్తొన్న ఉగ్రవాదులంతా యూనివర్శిటీల్లో చదువుకున్నవారేనని, ఎవ్వరూ మదర్సాలనుంచి వచ్చినవారు కాదని ఖాన్ వివరించారు. అయితే వారంతా ఇస్టామిస్ట్ మిలిటెంట్లుగా ఎందుకు మారుతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఖాన్... ఇటీవల ఐసిస్ అని చెప్పుకోడం కూడ ఓ  ఫ్యాషన్ గా మారిపోతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement