become
-
కమలా హారీస్‌కు రాజయోగం?
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినంతనే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బైడెన్ తన ప్రకటన అనంతరం అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పేరును ఆమోదించారు. దీంతో భారత సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా అధ్యక్షురాలిగా కాబోతున్నారనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది.తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షురాలిగా హారీస్ ఎన్నిక కానున్నారని జోస్యం చెప్పడంతో ఈ తరహా ఊహాగానాలు మరింతగా జోరందుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాజీవ్ నారాయణ్ శర్మ.. కమలా హారీస్ భవిష్యత్ గురించి తెలిపారు. ఆమె జాతకంలో ప్రస్తుతం రాహు, శుక్ర దశ జరుగుతోందని, ఆమెకు రాజయోగం ఈ ఏడాది జూలై 27 నుండి ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ సమయం కమలా హారీస్ జీవితంలో బంగారు దశ అవుతుందన్నారు.జ్యోతిష్కులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విషయమై కూడా జోస్యం చెప్పారు. బైడెన్ 1942, నవంబర్ 11న జన్మించారని, అతనిది వృశ్చిక రాశి అని, ప్రస్తుతం అతని జాతకంలో శని దశ నడుస్తున్నదన్నారు. అలాగే కుజుడు, బుధుడు పెన్నెండవ ఇంట కలిసి ఉన్నారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో అది మనస్సును ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే అతను ఎన్నికల బరి నుంచి నుంచి తప్పుకుని ఉండవచ్చన్నారు. Kamla Devi Harris(20.10.64), has Gemini Lagna, Aries sign. Dasha running Rahu, Venus. From 27.07.24 her Rajyog is starting. This period will be a golden phase of her life.@ANI @DainikBhaskar @aajtak @BJP4India @INCIndia @the_hindu @NewYorkTimes_es @washingtonpost @timesofindia— Rajeev Narain Sharma (@AstroGuru_Rjv) July 21, 2024 -
హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. ఇదీ చదవండి: జేజేపీ అవుట్ చేసేందుకే బీజేపీ వ్యూహం! 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
ఇక మొబైల్ ఫోన్లే.. బ్యాంకులు, పర్సులు
కాన్పూర్ :ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీమానిటైజేషన్ పై చర్చ జరగ్గకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిని కాపాడడానికే ప్రతిపక్షాలు పెద్ద నోట్లపై చర్చనుంచి దూరంగా పారిపోయాయని ధ్వజమెత్తారు. అయితే దేశంలో అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ మరోసారి నొక్కి వక్కాణించారు. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో చివరికి స్పీకర్ పై పేపర్లు విసిరడం అమానుషమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీని విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కాన్పూర్ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మోదీ పేదల కోసం అనేక సంక్షేమ కర్యక్రమాలను చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఆరుశిక్షణ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక శిక్షణ అందించడం నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలే శక్తి యువతలోనే ఉందని అన్నారు. డీమానిటైజేషన్ కష్టాలు త్వరలోనే తగ్గనున్నాయిన భరోసా ఇచ్చారు. దేశంలో వెయ్యి రూపాయల నోటు చలామణీలో ఉన్నపుడు రూ. 500, రూ.100 రూపాయల నోటు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, పెద్దనోట్లు రద్దు నిర్ణయం అనంతరం ఇప్పుడు 100 రూపాయల నోటుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ అన్నారు. మోదీ ప్రసంగంలో కొన్ని అంశాలు విప్లవాత్మకమైన డిమానిటేజేషన్ చరిత్రలో రికార్డు కాకపోవచ్చుకానీ, అవినీతిని రూపుమాపడంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ఘనత ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పేదల అండదండలు ప్రభుత్వానికి ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై లక్కీ డ్రా ద్వారా బహుమతులను పేదలు అందుకోనున్నారు. ప్రతి పక్షాల బలం నాకు తెలుసు.. బ్యాంకు ఆఫీసర్లకు లంచాలిస్తూ వారు ఏదైనా చేయగలరు. కానీ మా పోరాటం కొనసాగుతుంది. నల్లధనం కుబేరులకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ వాడుతున్నాం. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నాం. ఇక మీ మొబైల్ ఫోన్లే మీ బ్యాంకులు , పర్సులుగా మారనున్నాయి. మా అజెండా అవినీతి ఆపడానికి, వారి (ప్రతిపక్షాల) ఎజెండా పార్లమెంట్ అడ్డుకోవడం. జవాబుదారీగా, అవినీతికి వ్యతిరేకంగా ఉండటం కాంగ్రెస్ వల్లకాదు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా విరాళాలు తీసుకునే సమయంలో అవినీతి రహిత రాజకీయాలకు ఉదాహరణగా నిలవాలి. నల్లధనంపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారనంతవరకు గుండారాజకీయాలకు అడ్డుకట్టవేయలేమని మోదీ పేర్కొన్నారు. -
అవిశ్రాంత సవారీ..
సిరిసిల్ల : ఉరుకులు... పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. సరైన వ్యాయామం లేక మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఈ తరుణంలో సైకిల్ సవారీతో నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా గడొచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు. ఆరు పదుల వయసు దాటినా 20 ఏళ్ల యువకుల్లా ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పై సవారీ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యాయామంలో భాగంగా సైకిల్‌పై సంచరిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. రోజూ సైకిల్ తొక్కడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న రిటైర్డు ఉద్యోగులపై ప్రత్యేక కథనం.. ఏళ్ల తరబడి సైకిల్‌పై.. ఒకటి.. రెండు రోజులో కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు. ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరపడి కార్లు, బైక్‌లు, మోపెడ్లు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ సైకిల్‌పైనే ప్రయాణంచేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణ సామగ్రి దాకా అన్నింటికీ సైకిలే. నిత్యం ఉదయం గంటసేపు సైకిల్ తొక్కుతూ యువకుల్లా ఉత్సాహంగా గడుపుతున్నారు. సిరిసిల్లలో పాతిక మంది రిటైర్డు ఉద్యోగులు ఎవరికి వారు తీరిక వేళల్లో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. యువతకు ఆదర్శం.. ఏ చిన్న పనైనా.. కొద్దిపాటి దూరమైనా బైక్‌పై వెళ్తున్న ఈ రోజుల్లో యువతకు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ పని అయినా సైకిల్‌పై వెళ్లి చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగడకుండా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 30 ఏళ్లు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న నేటితరం యువతకు అవిశ్రాంత సైకిలిస్టులు ఆదర్శంగా ఉన్నారు. సైకిల్ తొక్కడంతో చెమట వస్తుందని, గుండెవేగం పెరిగి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మోకాళ్లు, మడిమెల, కీళ్లనొప్పులు ఉండి వాకింగ్ చేయలేని వారికి సైతం సైకిల్ తొక్కమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో సిరిసిల్ల వీధుల్లో సైకిల్ సవారీతో రిటైర్డు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచి.. – అబ్దుల్ అజీమ్(75), పోస్టుమెన్ 15 ఏళ్ల వయసు నుంచి నేను సైకిల్ తొక్కుతున్నా. నాకు పది మంది పిల్లలు. 1965లో పోస్టల్ శాఖలో చేరా. 2010లో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉండగా.. నిత్యం సైకిల్‌పైనే ఉత్తరాలను పంచేవాడిని. అదే అలవాటుతో ఇప్పటికీ సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. మనవడి సైకిల్ తొక్కుతున్నా.. – మాణిక్‌రావు లక్ష్మీనారాయణ(68), రిటైర్డు ఉద్యోగి మా మనవడి సైకిల్ నేను తొక్కుతున్న. రోజూ ఉదయం గంట సైకిల్ తొక్కుత. 2009లో ఉద్యోగ విరమణ చేశా. వ్యాయామం కోసం సైకిల్ తొక్కమని డాక్టర్లు చెప్పారు. మూడేళ్లుగా సైకిల్ తొక్కుతున్నా. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటడు. మా మనవడి సైకిల్‌ను వాడుకుంటున్నా. ఉల్లాసంగా ఉంది. సైకిల్‌పైనే బడికి.. – నర్సింగోజు సుదర్శన్(69), రిటైర్డు టీచర్ నేను 2005లో సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా రిటైర్డు అయ్యాను. సైకిల్‌పైనే బడికి వెళ్లేవాడిని. ఇప్పుడు బయటకు సైకిల్‌పైనే వెళ్తా. ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్ తొక్కడం మంచిది. 12 ఏళ్లుగా సైకిల్ తొక్కుతున్నా. బజారులో ఏ పని ఉన్నా.. సైకిల్‌పైనే వెళ్లి చేసుకుని వస్తా. నేను చిన్నప్పుడు సైకిళ్లు రిపేర్లు చేశా. కారు, స్కూటర్ ఉన్నా.. –గుడ్ల రవి(60), రిటైర్డు ఉపాధ్యాయుడు నాకు కారుంది. స్కూటర్ ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం కోసం రోజూ సైకిల్ తొక్కుతా. ఉదయం వ్యాయామంలో భాగంగా సిరిసిల్ల వీధుల్లో సైకిల్ తొక్కుతా. కొందరు కొత్తగా చూశారు. కానీ నాకు అలవాటైంది. ఐదేళ్లుగా సైకిల్‌పైనే వ్యాయామం చేస్తున్నాను. పార్కింగ్ సమస్య ఉండదు. పెట్రోల్ అవసరం లేదు. అన్నింటికీ సైకిలే బెటర్. -
అలా చెప్పుకోవడం ఫ్యాషనైపోయింది!
ఢాకాః ఐసిస్ లో చేరడం, ఐసిస్ మిలిటెంట్లు అని చెప్పుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయిందని బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసదుజ్జమన్ ఖాన్ అన్నారు. 20 మందిని రెస్టారెంట్లో బంధించి ఢాకాలో మారణ హోమం సృష్టించిన వారు బంగ్లాదేశ్ కు చెందిన వారేనని ఆయన స్సష్టం చేశారు. ఒకప్పుడు దేశంలో బ్యాన్ చేసిన జమీయుతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థ కు చెందిన సభ్యులుగా వారిని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారికీ ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపిన మంత్రి .. వారంతా స్థానిక ధనిక కుటుంబాలకు చెందినవారేనన్నారు. ఢాకా రెస్టారెంట్లో మారణహోమానికి పాల్పడ్డవారికీ, ఇస్టామిక్ స్టేట్ కు ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ తెలిపారు. వారంతా స్థానిక సంపన్న కుటుంబాలకు చెందిన వారేనని, దాడులు తామే నిర్వహించామని చెప్తున్న ఐసిస్ మాటలు నిజం కాదని ఆయన స్సష్టం చేశారు. ఉగ్ర దాడులకు పాల్పడిన వారంతా పదేళ్ళక్రితం దేశంలో బ్యాన్ చేసిన జమీయతుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన సభ్యులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై గత శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని బందీలుగా చేసిన విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు సైనికులు దాదాపు 11 గంటలపాటు శ్రమించారు. అదే నేపథ్యంలో భద్రతాదళాలు, ఉగ్రమూకలకు జరిగిన హోరా హోరీ పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. 20 మంది సాధారణ పౌరులు సైతం చనిపోయారు. అయితే మారణహోమానికి మేమే కారణమంటూ ఐసిస్ వెల్లడించినా అదంతా అబద్ధమేనని బంగ్లాదేశ్ అధికారులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ జిహాదీ గ్రూపులకు బంగ్లాదేశ్ దాడులకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. దాడులకు పాల్పడి చనిపోయిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా... బంగ్లాదేశ్ నిఘా అధికారులు అతడిని విచారిస్తున్నారు. ఢాకా దాడుల్లో పాల్తొన్న ఉగ్రవాదులంతా యూనివర్శిటీల్లో చదువుకున్నవారేనని, ఎవ్వరూ మదర్సాలనుంచి వచ్చినవారు కాదని ఖాన్ వివరించారు. అయితే వారంతా ఇస్టామిస్ట్ మిలిటెంట్లుగా ఎందుకు మారుతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఖాన్... ఇటీవల ఐసిస్ అని చెప్పుకోడం కూడ ఓ ఫ్యాషన్ గా మారిపోతోందన్నారు. -
మ్యూజియంగా మారనున్న 'ప్రిన్స్' హోమ్
లాస్ ఏంజెలెస్ః పాప్ గాత్రంతో అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ గాయకుడు ప్రిన్స్ ఎస్టేట్... త్వరలో మ్యూజియంగా మారబోతోంది. 1980 లో స్వంత ఆల్బమ్స్ తో మొదలైన ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ప్రస్థానం... ఆయన్ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చేసింది. 57 ఏళ్ళ వయసులో 21 ఏప్రిల్ 2016 న ప్రిన్స్ మినెసోట్టోలోని ఆయన స్వగృహంలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు ఆయన స్మారకార్థం సంగీత ప్రియులకు గుర్తుండిపోయేలా ఆయన నివసించిన పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చేందుకు నిర్ణయించారు. 'పర్పుల్ రైన్' హిట్ మేకర్ ప్రిన్స్... తన పాప్ గానంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. దీంతో ఆయన హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన గాయకుడు, మ్యూజిక్ లెజెండ్ ఫ్యాన్స్ మమనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు గుర్తుగా ప్రిన్స్ నివసించిన గృహం 'పైస్లే పార్క్ ఎస్టేట్' ను ఆయన స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయించినట్లుగా ఎటోన్ లైన్ డాట్ కామ్ నివేదించింది. ప్రిన్స్ సంగీతానికి జ్ఞాపక చిహ్నంగా పైస్లే పార్క్ ఎస్టేట్... ను మార్చనున్నట్లు ఆయన బంధువు ఫిలిప్స్ కూడ ఓ పత్రికకు తెలిపారు. అయితే తన నివాస గృహాన్ని మ్యూజియంగా మార్చాలన్న కోరిక ప్రిన్స్ కు ముందే ఉండేదని, అదే ఆలోచనతో ఆయన మరణించక ముందే ప్రిజర్వేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రిన్స్ సహాయకురాలు, మాజీ ప్రేమికురాలు షెయీలా ఓ పోస్ట్ లో వివరించారు. దాంతో పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చే పనులు కొనసాగించి ఆయన కోరికను తీర్చే ప్రయత్నం చేస్తామని ఆమె వివరించారు. ప్రిన్స్ సంగీతం ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఆలోచనలో ఉండేవారని అందుకే తన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు సిద్ధ పడ్డారని, ఈ నేపథ్యంలో ఆయన డ్రమ్స్, మోటార్ సైకిల్ వంటి కొన్ని వస్తువులను సైతం సేకరించి పెట్టారని షెయీలా తెలిపారు. వచ్చిన అవార్డులు, రివార్డులపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేకపోయినా, ఫ్యాన్స్ నుంచి తనకు అందిన అభిమానానికి గుర్తుగా, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికతో వాటన్నింటిని ప్రిన్స్ హాలులో భద్రంగా ప్రదర్శనకు పెట్టారని షెయీలా తెలిపారు. -
హీరోలే ఇక విలన్స్
-
ప్రొడ్యూసర్‌గా మారనున్న తాప్సీ ?