రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినంతనే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బైడెన్ తన ప్రకటన అనంతరం అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పేరును ఆమోదించారు. దీంతో భారత సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా అధ్యక్షురాలిగా కాబోతున్నారనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది.
తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షురాలిగా హారీస్ ఎన్నిక కానున్నారని జోస్యం చెప్పడంతో ఈ తరహా ఊహాగానాలు మరింతగా జోరందుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాజీవ్ నారాయణ్ శర్మ.. కమలా హారీస్ భవిష్యత్ గురించి తెలిపారు. ఆమె జాతకంలో ప్రస్తుతం రాహు, శుక్ర దశ జరుగుతోందని, ఆమెకు రాజయోగం ఈ ఏడాది జూలై 27 నుండి ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ సమయం కమలా హారీస్ జీవితంలో బంగారు దశ అవుతుందన్నారు.
జ్యోతిష్కులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విషయమై కూడా జోస్యం చెప్పారు. బైడెన్ 1942, నవంబర్ 11న జన్మించారని, అతనిది వృశ్చిక రాశి అని, ప్రస్తుతం అతని జాతకంలో శని దశ నడుస్తున్నదన్నారు. అలాగే కుజుడు, బుధుడు పెన్నెండవ ఇంట కలిసి ఉన్నారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో అది మనస్సును ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే అతను ఎన్నికల బరి నుంచి నుంచి తప్పుకుని ఉండవచ్చన్నారు.
Kamla Devi Harris(20.10.64), has Gemini Lagna, Aries sign. Dasha running Rahu, Venus. From 27.07.24 her Rajyog is starting. This period will be a golden phase of her life.@ANI @DainikBhaskar @aajtak @BJP4India @INCIndia @the_hindu @NewYorkTimes_es @washingtonpost @timesofindia
— Rajeev Narain Sharma (@AstroGuru_Rjv) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment