సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(గురువారం) ప్రజలందరూ రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్..‘కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంది. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుంది. సీఎం పేర్కొన్నారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనది. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment