అన్నాచెల్లెళ్లను నరికి చంపిన సమీప బంధువు | brother and sister murdered by their kin in visakha district | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్లను నరికి చంపిన సమీప బంధువు

Published Mon, May 18 2015 10:28 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

brother and sister murdered by their kin in visakha district

విశాఖపట్నం: జిల్లాలోని గోలుకొండ మండలం గుండుపాలెంలో దారుణం జరిగింది. భూ వివాదం అన్నాచెళ్లను బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగపల్లిరాము, పోతమ్మ అనే అన్నాచెల్లెలిని వారి సమీప బంధువు ఈగల చిన్నయ్య సోమవారం రాత్రి కిరాతకంగా వేటకొడవలితో నరికి చంపాడు.

అడ్డమొచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నర్సీపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement