gundupalem
-
గుండుపాలెంలో అఖిలపక్ష నేతల పర్యటన
విజయవాడ : మచిలీపట్నం పోర్టు కోసం తమ నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో భూపరిరక్షణ పోరాట సమితి నేతలతోపాటు అఖిలపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణపై సదరు నేతలకు రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతోపాటు భూపరిరక్షణ పోరాట సమితి నేతలు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పేర్ని నాని కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
అన్నాచెల్లెళ్లను నరికి చంపిన సమీప బంధువు
విశాఖపట్నం: జిల్లాలోని గోలుకొండ మండలం గుండుపాలెంలో దారుణం జరిగింది. భూ వివాదం అన్నాచెళ్లను బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగపల్లిరాము, పోతమ్మ అనే అన్నాచెల్లెలిని వారి సమీప బంధువు ఈగల చిన్నయ్య సోమవారం రాత్రి కిరాతకంగా వేటకొడవలితో నరికి చంపాడు. అడ్డమొచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నర్సీపురం రూరల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.