kin
-
నిందితుడి బంధువుల దాడి.. 10 మంది పోలీసులకు గాయాలు
మధ్యప్రదేశ్ : పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడి బంధువులు దాడి చేశారు. వివరాలు..దేవాస్ జిల్లా చాంద్గడ్ గ్రామానికి చెందిన సీతారాం గుర్జార్(23) ఇటీవలే దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆదివారం టాంక్ కుర్ద్ పోలీస్ స్టేషన్ నుంచి బేడీలతో సీతారం పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిని పట్టుకునేందుకు పోలీసులు అతని స్వగ్రామం చాంద్గడ్కు బయలుదేరారు. అతని ఇంటిని సమీపించగానే నిందితుడి బంధువులు కాల్పులకు దిగారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఓ పోలీసుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారు. పోలీసుల కర్తవ్యాన్ని అడ్డుకున్నందుకు, వారిపై హత్యాయత్నం చేసినందుకు గానూ 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాన ఇప్పటి వరకూ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న సీతారం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. -
ఆభరణాలు చోరీ.. వెంటనే రికవరీ
చాదర్‌ఘాట్: లక్షల విలువ చేసే నగలు చోరీకి గురైన గంటల వ్యవధిలో పోలీసులు రికవరీ చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న ఓల్డ్ మలక్‌పేటకు చెందిన లాయక్ ఉన్నీసా బేగం ఇంటికి ఆమె సమీప బంధువు నజియా బేగం వచ్చింది. ఈ సందర్భంగా లాయక్ ఉన్నిసా ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను తీసి నజియాకు చూపింది. అనంతరం వాటిని బీరువాలో పెట్టి తాళం వేయకుండా పనిమీద బయటకు వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న నజియాబేగం నగలను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పది గంటల సమయంలో బీరువాను తెరిచి చూసిన లాయక్ ఉన్నీసా నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నజియాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నగలు కాజేసిన నదియా తనపై అనుమానం రాకుండా ఉండేందుకు చోరీ జరిగిన ఇంట్లోని బాత్రూంలో కమోడ్‌లో చోరీ సొత్తును దాచింది. పోలీసులు ఆమెతోనే వాటిని వెలికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్తయ్య తెలిపారు. -
వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్!
తిరుచ్చి: పెళ్లి జరుగుతుంటే వీడియో తీయట్లేదని తెలిసి.. పెళ్లికూతురు ఆ పెళ్లినే రద్దు చేసేసింది. ఈ సంఘటన కేరళలోని తిరుచ్చి జిల్లా తురైయ్యూర్ లో చోటుచేసుకుంది. మరి కొద్ది నిమిషాల్లోనే పెళ్లి ఉందనగా.. ఇలా పెళ్లిని రద్దు చేయడంతో వరుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరంబలూర్ కు చెందిన సెంథిల్ (33)తో తంగారసుకు చెందిన అమ్మాయికి ఈ నెల 26న పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఆదివారం వివాహ ఆచారాలు మొదలైన తర్వాత పెళ్లిని వీడియో తీయట్లేదని వధువు సోదరులు ఇద్దరూ గుర్తించారు. సెంథిల్ తండ్రిని ఈ మేరకు ప్రశ్నించగా.. ఆయన తనకంత స్థోమత లేదని సమాధానం ఇవ్వడంతో ముగ్గురి మధ్య పెళ్లిమండపంలో పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపగించుకున్న వధువు కుటుంబసభ్యులు అమ్మాయిని తీసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కూతురు కూడా వీడియో లేని పెళ్లి తనకు అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
పెళ్లి చేసుకుని..
నాగోలు: రెండో వివాహం చేసుకుని కులం పేరుతో భర్త, అతని కుటుంబ సభ్యుల దూషించడంతో ఓ మహిళ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్బీ నగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ఎమ్ నాగలక్ష్మీ అలియాస్ రమ్య(27) ఎలక్ట్రిసిటీ డిపార్టెమెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. వివాహిత అయిన రమ్య భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో కూతురితో కలిసి నగరంలో నివాసం ఉంటోంది. కాగా, నల్లగొండకు చెందిన గట్టు సుమన్ బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తపేటలోని స్వర్ణకంచి షాపింగ్ మాల్ లో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్న సుమన్ రమ్యను పెళ్లి చేసుకుని ఆమెకు అండగా ఉంటానని చెప్పి నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరి 8న కంచీపురం లో వివాహం చేసుకున్నాడు. మన్సూరాబాద్ లోని మల్లికార్జుననగర్ లో కుటుంబసభ్యులకు తెలియకుండా కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న సుమన్ కుటుంబసభ్యులు గట్టు ఉదయ్ కుమార్, లక్ష్మీలు ఇంటికి వచ్చి సుమన్ ను వదిలేసి వెళ్లిపోవాలని రమ్యను బెదిరించారు. ఈ క్రమంలో వీరు రమ్యను కులం పేరుతో దూషించారు. ఆ తర్వాత సుమన్ ఇంటికి రాకుండా ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న రమ్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నాచెల్లెళ్లను నరికి చంపిన సమీప బంధువు
విశాఖపట్నం: జిల్లాలోని గోలుకొండ మండలం గుండుపాలెంలో దారుణం జరిగింది. భూ వివాదం అన్నాచెళ్లను బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగపల్లిరాము, పోతమ్మ అనే అన్నాచెల్లెలిని వారి సమీప బంధువు ఈగల చిన్నయ్య సోమవారం రాత్రి కిరాతకంగా వేటకొడవలితో నరికి చంపాడు. అడ్డమొచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నర్సీపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జానారెడ్డి కంపెనీలకు నోటిసులు