వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్! | Bride's kin stop wedding for want of videographer in Tiruchy | Sakshi
Sakshi News home page

వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్!

Published Mon, Jun 27 2016 1:10 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM

వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్! - Sakshi

వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్!

తిరుచ్చి: పెళ్లి జరుగుతుంటే వీడియో తీయట్లేదని తెలిసి.. పెళ్లికూతురు ఆ పెళ్లినే రద్దు చేసేసింది. ఈ సంఘటన కేరళలోని తిరుచ్చి జిల్లా తురైయ్యూర్ లో చోటుచేసుకుంది. మరి కొద్ది నిమిషాల్లోనే పెళ్లి ఉందనగా.. ఇలా పెళ్లిని రద్దు చేయడంతో వరుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెరంబలూర్ కు చెందిన సెంథిల్ (33)తో తంగారసుకు చెందిన అమ్మాయికి ఈ నెల 26న పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఆదివారం వివాహ ఆచారాలు మొదలైన తర్వాత పెళ్లిని వీడియో తీయట్లేదని వధువు సోదరులు ఇద్దరూ గుర్తించారు. సెంథిల్ తండ్రిని ఈ మేరకు ప్రశ్నించగా.. ఆయన తనకంత స్థోమత లేదని సమాధానం ఇవ్వడంతో ముగ్గురి మధ్య పెళ్లిమండపంలో పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపగించుకున్న వధువు కుటుంబసభ్యులు అమ్మాయిని తీసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కూతురు కూడా వీడియో లేని పెళ్లి తనకు అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement