![Marriage Stopped Due To Grooms Friends Misbehaviour With Bride - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/14/marriage_0.jpg.webp?itok=gJIH4JEd)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : మద్యం మత్తులో స్నేహితులు చేసిన పనికి ఓ వ్యక్తి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. వరుడి స్నేహితులు డ్యాన్స్ చేయాలంటూ వధువును బలవంతపెట్టడంతో పెళ్లి ఆపుచేసుకున్నారు ఆమె కుటుంబసభ్యులు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి రోజు కావటంతో మేలతాళాలతో పెళ్లికూతురు తరుపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే తరుణం ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతుర్ని డ్యాన్స్ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్ చేసే వేదికపైకి లాక్కెళ్లారు. దీనిపై పెళ్లి కుమార్తె కుటుంబం అభ్యతరం తెలిపింది. ( బావమరదళ్ల ఆత్మహత్యాయత్నం )
దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులను రంగంలోకి దింపారు. అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పెళ్లి కుమారుడి కుటుంబంపై పెళ్లి కూతురి కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసుల మధ్యవర్తిత్వంతో పెళ్లి కుమారుడి కుటుంబం 6.5 లక్షల రూపాయులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. పెళ్లి జరిపించటానికి వరుడి తరుపు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు మర్యాద ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment