
ప్రతీకాత్మక చిత్రం
మధ్యప్రదేశ్ : పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడి బంధువులు దాడి చేశారు. వివరాలు..దేవాస్ జిల్లా చాంద్‌గడ్ గ్రామానికి చెందిన సీతారాం గుర్‌జార్(23) ఇటీవలే దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆదివారం టాంక్ కుర్ద్ పోలీస్ స్టేషన్ నుంచి బేడీలతో సీతారం పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిని పట్టుకునేందుకు పోలీసులు అతని స్వగ్రామం చాంద్‌గడ్‌కు బయలుదేరారు. అతని ఇంటిని సమీపించగానే నిందితుడి బంధువులు కాల్పులకు దిగారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి.
ఓ పోలీసుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారు. పోలీసుల కర్తవ్యాన్ని అడ్డుకున్నందుకు, వారిపై హత్యాయత్నం చేసినందుకు గానూ 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాన ఇప్పటి వరకూ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న సీతారం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment