బాల్కనీలో ఆరేసిన లోదుస్తులు చోరీ చేస్తుండగా ఓ టీనేజర్‌ను ఆ జంట చూసింది. అతన్ని వెంటాడి పట్టుకుని గదిలో బంధించింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ టీనేజర్ ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
భోపాల్: రవి(24), అతని భార్య స్థానికంగా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు.
అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment