undergarments
-
లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అజ్మీర్‌లోని విజయనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి -
లోదుస్తులు కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ పరువుపాయే!
ఇస్లామాబాద్: సొంత దేశంలోనే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్‌లో భాగంగా లోదుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ తరుణంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఎయిర్‌లైన్స్. గురువారం పీఐఏ.. క్యాబిన్ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. అంతేకాదు.. అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్ ఆ ఆదేశాల్లో అభిప్రాయపడింది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది. ఇంకేం.. అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్. అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు. అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పీఐఏ. How do undergarments potray positive image of PIA (Pakistan International Airlines)?#Pakistan #PIA #Undergarments pic.twitter.com/gPEmyDc2O9 — lyfmail.com (@lyfmailcom) September 30, 2022 @nailainayat @Arzookazmi30 Its Very important news coming from Pakistan. This decison by #PIA will be helpful in revenue generation. 🤣🤣🤣🤣🤣 Kuch Bhi, kya akal andhe baithe hai bhai #PIA me 🤣🤣 — मौलाना काण्डकारी अल हरामी مولانا کندکاری الحرامی۔ (@Maulanakandkari) September 30, 2022 డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన. పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్. రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది. అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 8 కోట్ల కారు.. నీటిపాలు -
రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్
పాట్నా: బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగమే కారణం. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసకుంది. అసలేం జరిగిందంటే.. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌లోని దిల్‌నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు(బనియన్,అండర్వేర్)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు. అయితే అదే కంపార్ట్మెంట్లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్ వేషాధారణపై అ్యభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్ ఆ వ్యక్తితో వాదనకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను సైతం దూషించాడు. కాగా మండల్ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని, వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడటంతో కాల్చి వేస్తామని కూడా బెదిరించాడని పాశ్వాన్ ఆరోపించారు. అయితే అతను బిహార్ ఎమ్మెల్యే అని తనకు తెలీయదని పేర్కొన్నారు. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మండల్‌ను రైలులోని మరో కోచ్‌కు మార్చారు. అయితే చివరికి గోపాల్ మండల్ తన చర్యలను సమర్థించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పి ఉందని అందులే కేవలం లోదుస్తులు ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫోటోలు, వివరణ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతన్ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘అండర్ వేర్లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని మాకు తెలియదే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. గోపాల్ మండల్ స్నేహితుడు కునాల్ సింగ్ మాట్లాడుతూ.. మండల్ డయాబెటిస్ పేషెంట్ అని, ఏదో "అత్యవసర పని మీదసం ఢిల్లీ వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మండల్ అధిక బరువు కారణంగా బట్టలతో వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయాడని అందుకే లుంగీ మీద వాష్‌రూమ్ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు. ‘రైలు ఎక్కిన తర్వాత, గోపాల్ వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. తొందరపాటులో తన లోదుస్తుల్లో వెళ్లాడు. అప్పుడే ఓ ప్యాసింజర్ మండల్‌తో మాట్లాడాడు. దీనికి మండల్ బదులేమి ఇవ్వకుండా వాష్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాసింజర్‌తో మాట్లాడారు "అని కునాల్ సింగ్ చెప్పారు. #WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq — ANI (@ANI) September 3, 2021 -
టీనేజర్ ఉసురు తీసిన చోరీ.. చేతిలో లోదుస్తులతో పరిగెడుతుండగా
బాల్కనీలో ఆరేసిన లోదుస్తులు చోరీ చేస్తుండగా ఓ టీనేజర్‌ను ఆ జంట చూసింది. అతన్ని వెంటాడి పట్టుకుని గదిలో బంధించింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ టీనేజర్ ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. భోపాల్: రవి(24), అతని భార్య స్థానికంగా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు. అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు. -
పైశాచికత్వం: యువతుల లోదుస్తులు కాజేసి..
భోపాల్ : బాలికల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులు కాజేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఓ దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇండోర్ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్స్, అమ్మాయిలు అద్దెకు ఉండే నివాసాల్లో గత కొన్ని రోజులుగా లోదుస్తులు మాయం అవుతున్నాయి. అయితే ఈ ఘటనలు రాత్రి వేళల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఇటీవల లోదుస్తుల చోరీలు అధికమవుతున్న నేపథ్యంలో బాధిత మహిళలు విజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోదుస్తులు, బట్టలను దొంగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేగాక వాటిని చింపేస్తున్నది కూడా తానేనని ఒప్పుకున్నాడు. (బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి) కాగా ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోగా, ఆ కేసులో కూడా ఇతడే నిందితుడని తేలడంతో నిందితుడిని జైలుకు తరలించారు.ఈ విషయంపై విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి తెమజీబ్ ఖాజీ మాట్లాడుతూ.. తమకు లేడీస్ హాస్టల్స్ నుంచి లోదుస్తులు మాయమవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసు బృందాలను రాత్రి సమయాల్లో బాలికలు నివసించే హాస్టళ్ల ప్రాంతంలో మోహరించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. (ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య ) -
నటి ఇన్నర్‌వేర్‌లతోసహా దోచుకుపోయారు
సాక్షి, ముంబై : నటి మేఘనా నాయుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లో అద్దెకుంటున్న ఓ జంట ఆమెను దారుణంగా మోసం చేశారు. ఈ క్రమంలో వారు ఆమె సామాన్లతో సహా ఉడాయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్ బుక్‌లో తెలియజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నటి మేఘనా నాయుడిక గోవాలో ఓ ఇల్లు ఉంది. దానికి ఆమె ఓ గార్డియన్‌ను నియమించి.. ఆమె మాత్రం ముంబైలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఓ జంట ఆ ఇంట్లో అద్దెకు దిగారు. తాము ముంబైకి చెందిన వారిమని.. న్యూజిలాండ్‌లో పని చేస్తుంటామని... పని మీద గోవాకు వచ్చామని నమ్మబలికారు. అంతేకాదు వారి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా ఇచ్చారు. కానీ, గత కొన్ని నెలలుగా వారు అద్దె చెల్లించలేదంట. అంతేకాదు చెప్పా పెట్టకుండా పారిపోయిన ఆ జంట.. పోతూ పోతూ ఇంట్లోని మేఘనా వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయారంట. ఇన్నర్ వేర్లతోపాటు, సాక్సులను కూడా వదలకుండా వారు తీసుకెళ్లినట్లు ఆమె వివరించింది. వారి ఆధార్, లైసెన్స్‌లు కూడా నకిలీవని తేలింది. అంతేకాదు గార్డియన్‌ను కూడా బురిడీ కొట్టించి ఆమె కొడుక్కి జాబ్ ఇప్పిస్తామని చెప్పించి 85 వేలు వసూలు చేశారంట. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా అప్పులు చేసినట్లు ఫేస్బుక్లో నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించిందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కలియోన్ కా చమన్ మ్యూజిక్ రీమిక్స్ ఆల్బమ్(2002)తో పాపులర్ అయిన మేఘనా.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా పృథ్వీ నారాయణ, విక్రమార్కుడు, పాండురంగడు, పిల్ల జమీందార్ తదితర చిత్రాల్లో ఆమె కనిపించింది. -
వాసన చూసి అవి చోరీ.. మహిళల్లో భయం భయం!
సాక్షి, బెంగళూరు: గతేడాది తరహాలోనే మరోసారి బెంగళూరు నగరంలో మహిళల లో దుస్తులు చోరీ కావడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో మహారాణి కాలేజీ లేడిస్ హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు చొరబడుతూ విద్యార్థినుల లోదుస్తులు చోరీ చేసేవారు. తాజాగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) ఉద్యోగుల క్వార్టర్స్‌లో తమ లో దుస్తులు చోరీకి గురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. జనవరి 11న బపనహల్లి పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. బాధితురాలు మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అలికిడి కాగా వరండాలోకి వెళ్లి చూశాను. ఓ గుర్తు తెలియని వ్యక్తి లోదుస్తుల పక్కన తచ్చాడుతుండటం చూసి అనుమానం రావడంతో.. ఎవరు నువ్వు అంటూ ధైర్యం తెచ్చుకుని పశ్నించాను. తాను వాచ్మెన్ అని నమ్మించాలని చూసిన వ్యక్తి, ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించినట్లు చెప్పారు. లోదుస్తులు వాసన చూసి తర్వాత వాటిని చోరీచేసి పారిపోతూ తాను దొంగనని ఆ వ్యక్తి బదులిచ్చినట్లు మహిళా ఉద్యోగిని పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
అండర్ వేర్ తో పరీక్షపై హైకోర్టు విచారణ
పట్నా: ఆర్మీలో క్లర్క్ ఉద్యోగాల కోసం రాతపరీక్షకు హాజరై అభ్యర్థులకు బిహార్‌లో షాక్ తగిలింది. చొక్కా, ప్యాంటు, బనీనుతో సహా విప్పేయించి.. కేవలం లోదుస్తుల్లో వారితో రాతపరీక్ష రాయించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేవలం చూచిరాత, మాస్ కాపీయింగ్‌ను తప్పించడానికి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇలా అభ్యర్థులతో అండర్వేర్లలో ఆరుబయట పచ్చిక బయళ్లపై పరీక్ష రాయించడం పెద్ద దుమారమే రేపుతోంది. బిహార్‌లో చూచిరాత, మాస్ కాపీయింగ్ సమస్య తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు జరుగకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా పరీక్ష నిర్వహించామని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పట్నా హైకోర్టు దృష్టికి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, కథనాలు పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులతో అమానుష పద్ధతిలో పరీక్ష రాయించిన తీరుపై పట్నా హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది.