అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అజ్మీర్‌లోని విజయనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment