homes
-
Sambhal: సొంత ఇళ్లను కూలగొట్టుకుంటున్న మైనారిటీలు
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు.పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల గల ఆక్రమణను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే అప్రమత్తమైన స్థానిక మైనారిటీ వర్గాలవారు తమ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఆక్రమణల పేరుతో జిల్లా అధికారులు తమ ఇళ్లను కూల్చివేసేలోగానే, ఇంటిలోని విలువైన వస్తువులను మరో చోటుకు తరలించి, తమ ఇళ్లను మైనారిటీ వర్గాలవారు కూల్చివేసుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ సంభాల్‌లో విద్యుత్ చౌర్యానికి పాల్పడున్న వారిపై దాడులకు ఉపక్రమించింది. ఇటీవలే అక్రమ నిర్మాణం ఆరోపణలపై నోటీసు అందుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ ఇంటిపై విద్యుత్ అధికారులు దాడులు చేశారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. విద్యుత్ అధికారుల దాడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.నవంబర్‌లో సంభాల్‌లోని జుమా మసీదు వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నిర్వహించిన సమయంలో జరిగిన హింస, కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు. మొఘల్ పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారనే వాదనల నేపధ్యంలో ఏఎన్ఐ సర్వే జరిగింది. అయితే ఇంతలో జిల్లా అధికారులు మసీదుకు కిలోమీటరు దూరంలో ఒక పురాతన ఆలయ ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో 1978 అల్లర్ల తర్వాత మూతపడిన ఈ ఆలయాన్ని అధికారులు తెరిచాయి. కాగా ఆలయ ప్రాచీనతను నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ చేసే బాధ్యతను సంబంధిత అధికారులు ఏఎస్ఐకి అప్పగించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్‌గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్‌లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్‌లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్‌షిప్‌లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి. -
ఒక డాలరుకే ఇల్లు.. ట్రంప్ నచ్చని వాళ్లు వచ్చేయండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది.వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్‌కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.రాజకీయాలతో అలసిపోయారా?ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్ఎన్తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.క్రూయిజ్ కూడా..ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు. -
లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అజ్మీర్‌లోని విజయనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి -
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్‌హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్‌హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్‌లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్‌హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-బుడిగెరె క్రాస్‌లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు. -
ఐదు అత్యంత విలాసవంతమైన భవనాలు.. ఎవరుంటారక్కడ?
భారతదేశం అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలగలిసిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ హౌస్ ‘యాంటిలియా’ నుంచి హీరో షారుక్ ఖాన్‌కు చెందిన విలాసవంతమైన ‘మన్నత్’ వరకు.. అన్నీ విలాసవంతమైన, ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇవి కొన్ని.. 1. యాంటిలియా: ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ ద్వీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డ్యాన్స్ స్టూడియో, బాల్రూమ్, ఐస్‌క్రీమ్ పార్లర్, మూడు హెలిప్యాడ్లు, హ్యాంగింగ్ గార్డెన్లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2. మన్నత్: షారుక్ ఖాన్ అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే ‘మన్నత్’ బాలీవుడ్ రారాజు షారుక్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు రూ.200 కోట్లకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి. 3. గులిత: ఆనంద్ పిరమల్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఆనంద్ పిరమల్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ తన కుమారుడు ఆనంద్ పిరమల్‌కు ఈ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ ఐదు అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. 4. జతియ హౌస్: కుమార్ మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లోని జతియ హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు రూ. 425 కోట్లు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్రూమ్లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి. 5. జేకే హౌస్: గౌతమ్ సింఘానియా ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జేకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా నివాసం. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్‌తో రూపొందింది.అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు రూ. ఆరు వేల కోట్లు. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఐదు పార్కింగ్ అంతస్తులు, హెలిప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. -
Tesla Homes: చవగ్గా డబుల్ బెడ్రూం ఇల్లు! వీడియో వైరల్
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ తక్కువ ధరకే డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఈ కంపెనీ పూర్తీగా ఫర్నిష్ చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను కస్టమర్లకు అందిస్తోంది. 10,000 డాలర్లకే అన్ని సౌకర్యాలు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను టెస్లా అందిస్తోందంటూ సోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఇంటిలో నివసించేందుకే ఎలాన్ మస్క్ తన 50,000 డాలర్ల ఇంటిని కూడా అమ్మేసినట్లు ఈ వీడియోలో ఉంది. బాక్స్ లాగా ఉండే ఈ ఇళ్లకు అవసరమైన విడిభాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్‌లలో కావాల్సిన చోటుకు తీసుకొచ్చి అమర్చుతారు. ఇందులో రెండు బెడ్రూంలు, లివింగ్ ఏరియాతోపాటు కిచెన్, బాత్రూం ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తయారు చేసిన గోడలు చాలా దృఢంగా ఉంటాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాల నుంచి తట్టుకుంటాయి. పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు అమర్చారు. దీంతో ఇంటి అవసరమైన విద్యుత్ వీటి నుంచే లభిస్తుంది. అలాగే వర్షపు నీటిని సేకరించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. Elon Musk is at it again... A two bedroom Tesla home for $10,000. This man is a good Wizard. They come once in a generation. 👌🏼👌🏼 pic.twitter.com/w71Hcg0oFp — Aviator Anil Chopra (@Chopsyturvey) March 19, 2024 -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
‘న్యూస్‌క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్‌గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్‌వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్‌లు ఉండే ఇంగ్లాండ్‌లో సెకండ్ హోమ్‌లు, హాలిడే హోమ్‌ల సమస్య కార్న్‌వాల్‌లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్‌లు ఉన్నట్లుగా కార్న్‌వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్‌ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
ఛీ.. ఛీ ..ఇదేం అలవాటు.. నిద్రిస్తున్న మహిళల పాదాలు తాకుతూ..
అమెరికాలో నెవాడోలో వికృతమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు ఓ వ్యక్తి బానిసయ్యాడు. ఈ వికృత చేష్టలకు విసిగిపోయిన మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని పసిగట్టారు. నిందితున్ని ఆంథోనీ గొంజాలెస్(26)గా గుర్తించి అరెస్టు చేశారు. జులై 1న నిందితుడు ఇద్దరు మహిళలు ఉండే ఫ్లాట్‌లోకి దొంగచాటుగా వెళ్లాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే వరుస. జులై 1 నుంచి జులై 3 మధ్య వారిపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని ఆంథోని గొంజాలెస్గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: Riots In New York: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్‌కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్‌టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) -
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ఖరీదైన ఇళ్లు
-
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్‌లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్‌కు బాబు వెనుకడుగు
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచనాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్రబాబు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు. నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్‌ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్‌లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్‌ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్‌లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు రుద్రవరంలోనూ అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్‌ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్‌ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్‌లకు సంబంధించి ఫుట్టింగ్ లెవల్ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్‌ల్లో జీ+3 గృహాలను నిర్మించింది. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు బ్లాక్‌ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్ వర్క్స్ వద్ద నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పంపిణీకి సిద్ధం చేశాం.. గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. – ఎం.గణేష్‌బాబు, ఏఈ -
దుబాయ్‌కి క్యూ కడుతున్న భారతీయులు.. అక్కడ ఇళ్లకు ఫుల్ డిమాండ్..
దుబాయ్.. ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటి. బడా వ్యాపారవేత్తలకు స్వర్గధామం. లగ్జరీ లైఫ్ స్టైల్‌కు, సంపన్నులకు నిలయం. పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ప్రాంతం. ఆకాశాన్ని తాకినట్లు ఉండే భవనాలు, స్కైస్క్రాపర్లు, బుర్జ్ ఖలీఫా ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. అందుకే ఇక్కడ నివసించేందుకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్‌లో స్థిరపడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ రూ.కోట్లు పెట్టి ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ గణాంకాల ప్రకారం 2022లో వారికి 16 బిలియన్ దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.35,500 కోట్లు ఆదాయం భారతీయుల వల్లే వచ్చిందంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021తో పోల్చితే(9 బిలియన్ దిర్హాంలు..) ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముంబైలో అద్దెతో సమానం.. దుబాయ్‌లో ఖరీదైన ఇళ్లు కొనేవారిలో 40 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్‌కు చెందిన వారే దుబాయ్‌లో ఎక్కువగా ఇళ్లు కొంటున్నారు. వీరితో పాటు యూఏఈలో నివసించే భారతీయులు, విదేశాల్లోని భారతీయులు కూడా దుబాయ్‌లో ఇల్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తికనబర్చడానికి ప్రపంచంతో ఈ నగరానికి ఉన్న కనెక్టివిటీనే ప్రధాన కారణమని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. భారతీయ సంపన్నులు నెలకు రూ.లక్షలు చెల్లించి దుబాయ్‌లో ఇళ్లు అద్దెకు కూడా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో 30 శాతం క్షీణించిన రెంటల్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకొని 2015-16 స్థాయికి చేరుకుందని వివరించారు. వ్యాపారసంస్థలకు దుబాయ్‌లో అత్యంత అనువైన వాతావరణం ఉందని, హైదరాబాద్, లండన్ నుంచి ఈ నగరానికి సులభంగా ప్రయాణించవచ్చని జేవీ వెంచర్స్ కో-ఫౌండర్ విశాల్ గోయల్ చెప్పారు. తన భార్య కూడా ఫిన్‌టెక్ వెంచర్‌ను దుబాయ్‌లోనే ప్రారంభించిందని వివరించారు. దుబాయ్‌లో మంచి ఇళ్లు కొనాలంటే 1.6-1.7 మిలియన్ల దిర్హాంలు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.3.6 కోట్ల నుంచి రూ.3.8 కోట్లు అవుతుంది. ఒకవేళ మంచి అద్దె ఇల్లు కావాలంటే రూ. 3-3.5 లక్షలు అవుతుంది. ఇక్కడ రెంట్లు భారత్‌లోని ముంబయితో పోల్చితే నాలుగైదు శాతం మాత్రమే అటు ఇటుగా ఉంటాయని స్థానిక రియల్టర్లు చెబుతున్నారు. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్.. ఎక్కవ మంది కార్మికులు, నైపుణ్యం గల నిపుణులు, పరిశోధకుల కోసం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను విస్తరించడం కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల వీసా వల్ల విదేశీయులు యూఏఈలో నివసిస్తూ పని చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు. వీరికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. విదేశీయుల నుంచి డిమాండ్ బాగా ఉండటంతో దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోందని అక్కడి రియల్టర్లు వివరించారు. దుబాయ్‌లోని భారతీయ పాఠ్యాంశాలతో కూడిన స్కూళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనవని, తన పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి దుబాయ్‌లో స్థిరపడ్డ వ్యాపారవేత్త రాహుల్ భట్టాడ్ చెప్పారు. ఈ నగరం అత్యంత సురక్షితమైందని, క్యాబ్‌లో బ్యాగ్‌ని మర్చిపోయినా, డ్రైవర్ మిమ్మల్ని ట్రాక్ చేసి తిరిగి ఇస్తాడని చెప్పారు. తన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈ ఆధునిక నగరాన్ని చూసి ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. చదవండి: మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్ ఇదే -
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్‌లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్‌ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
CRISIL Rating: డిమాండ్ ఉంది.. కానీ ఇల్లు కొనడమే గగనం..
ముంబై: ధరలు పెరిగినా, రుణాలపై వడ్డీ రేట్లు సమీప కాలంలో పెరిగే అవకాశాలున్నా కానీ, ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశంలోని టాప్ 6 నగరాల్లో ఇళ్ల డిమాండ్ 5–10% మేర పెరుగుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 మొత్తం మీద ఇళ్ల డిమాండ్ 33–38% స్థాయిలో వృద్ధి చెంది ఉండొచ్చని అంచనా వేసింది. ఇది కరోనా ముందు నాటి స్థాయిలను అధిగమించినట్టేనని పేర్కొంది. 2020–21లో తక్కువ బేస్ (కనిష్ట స్థాయి) కారణంగా అధిక వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. మూలధన వ్యయాలు అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీని తిరిగి ప్రవేశపెట్టడం ఈ రంగానికి అవరోధాలుగా క్రిసిల్ తెలిపింది. నివాస గృహాల ధరలు పెరుగుతాయి.. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన పట్టణాల్లో నివాస గృహాల ధరలు 6–10% స్థాయిలో పెరుగుతాయన్నది మా అంచనా. ఎందుకంటే మెటీరియల్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు డిమాండ్–సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’అని క్రిసిల్ డైరెక్టర్ అనికేత్ దాని తెలిపారు. కరోనా ముందు డెవలపర్ల వద్ద ఇన్వెంటరీ (అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు) 3–3.5%గా ఉంటే.. 6 ప్రధాన పట్టణాల్లో తాజాగా ఇది 2–4% స్థాయిలో ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద రియల్టీ డెవలపర్లు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నారని.. 2022 మార్చి నాటికి వీరి వాటా 24–25%కి చేరిందని తెలిపింది. ఇబ్బందే.. ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంకులు హోంలోన్లపై వడ్డీలు పెంచాయి. అంతకు ముందే మెటీరియల్ కాస్ట్ పెరగడంతో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకున్నాయి. దీంతో ఇళ్లు కొనాలనే ఆసక్తి ఉన్నా.. ద్రవ్యోల్బణ పరిస్థుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టంగా మారుతోంది. చదవండి: 5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్‌లో తగ్గని రియల్టీ జోరు -
ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అంశాలు ► 60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు. ► ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది. ► 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ► నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. ► 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు. ► 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి ‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు. -
ట్రెండ్‌కి తగ్గట్టుగా.. పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. - తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. - పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. - రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. - స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. - స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..!