భాగ్యనగరిలో వాటర్ ఫ్రంట్ ఫేజ్–2, సితార గృహాలు
జనప్రియ సైనిక్‌పురిలో 5.50 ఎకరాల్లో సితార ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇందులో 4 భవనాల్లో 10 అంతస్తుల్లో మొత్తం 1,078 గృహాలను నిర్మించనుంది. 580– 865 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.14.90 లక్షలు. కస్టమర్లు కోరితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), బ్యాంకు రుణాలను కూడా కంపెనీనే ఇప్పిస్తుందని జనప్రియ ఈడీ రవి కిరణ్ రెడ్డి చెప్పారు. రానున్న 5 నెలల్లో మియాపూర్‌లో 2,000 ఫ్లాట్లు, నాచారంలో 1,000 ఫ్లాట్లు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.
• ప్రజయ్ ఇంజనీర్స్ షామీర్‌పేటలో 27.18 ఎకరాల్లో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2ను ప్రకటించింది. ఇండిపెండెంట్ గృహాలు 100–120, జీ+1 గృహాలు 500 వరకు నిర్మించనుంది. ఏప్రిల్‌లో 100 గృహాలను నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ప్రారంభ ధర రూ.16.20 లక్షలు. వచ్చే రెండేళ్లలో మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్‌కేసర్‌లో విన్సర్‌పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 గృహాలను నిర్మిస్తామని సంస్థ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి తెలిపారు.