
కుప్పం(చిత్తూరు జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. శాంతిపురం మండలం మఠం పంచాయితీ సంతూరు గ్రామంలోని నిరుపేదల ఇళ్లను బలవంంతగా ఖాళీ చేయించి కూల్చివేసే పనులను ఆరంభించింది. కీనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు, టీడీపీ నేతలు.. ఆపై కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. అది చెరువు స్థలమని అందుచేత కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

30 ఏళ్లుగా ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం అంటున్నారు బాధితులు. 10 కుటుంబాలకు చెందిన ఇళ్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు అధికారులు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. బాధిత కుటుంబాలు ఉండటానికి మరొకచేట స్థలం కేటాయించక ముందే ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని పేద ప్రజలకు మరొకచోట స్థలం కేటాయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది.



Comments
Please login to add a commentAdd a comment