
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ తక్కువ ధరకే డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఈ కంపెనీ పూర్తీగా ఫర్నిష్ చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను కస్టమర్లకు అందిస్తోంది. 10,000 డాలర్లకే అన్ని సౌకర్యాలు ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను టెస్లా అందిస్తోందంటూ సోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఇంటిలో నివసించేందుకే ఎలాన్ మస్క్ తన 50,000 డాలర్ల ఇంటిని కూడా అమ్మేసినట్లు ఈ వీడియోలో ఉంది. బాక్స్ లాగా ఉండే ఈ ఇళ్లకు అవసరమైన విడిభాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్‌లలో కావాల్సిన చోటుకు తీసుకొచ్చి అమర్చుతారు. ఇందులో రెండు బెడ్‌రూంలు, లివింగ్ ఏరియాతోపాటు కిచెన్, బాత్‌రూం ఉన్నాయి.
ఈ ఇళ్ల నిర్మాణం కోసం తయారు చేసిన గోడలు చాలా దృఢంగా ఉంటాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాల నుంచి తట్టుకుంటాయి. పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు అమర్చారు. దీంతో ఇంటి అవసరమైన విద్యుత్ వీటి నుంచే లభిస్తుంది. అలాగే వర్షపు నీటిని సేకరించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
Elon Musk is at it again... A two bedroom Tesla home for $10,000. This man is a good Wizard. They come once in a generation.
— Aviator Anil Chopra (@Chopsyturvey) March 19, 2024
👌🏼👌🏼 pic.twitter.com/w71Hcg0oFp