
ఇళ్ల బిల్లులిచ్చేదాకా పోరాడుతాం
- సర్కారును అసెంబ్లీలో నిలదీస్తాం
- పూడికల పేరిట టీఆర్‌ఎస్ దోపిడీ
- టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు
వరంగల్ : బడుగు, బలహీన వర్గాలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులిచ్చేంత వరకు పోరాడుతామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఇళ్ల బిల్లులు చెల్లించాలంటూ గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయం ఎదుట బుధవారం ఒక రోజు దీక్షా, ధర్నా చేపట్టారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సం ఘీభావం తెలిపినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఈ సందర్భంగా దయూకర్‌రావు మాట్లాడారు. 2 రోజుల్లో పెండింగ్ బిల్లులివ్వకుంటే అన్ని పార్టీ ల మద్దతుతో సర్కారును అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.
ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ మాటలగారడీకి ప్రజలు మోసపోయూరని పేర్కొన్నారు. చివరకు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి కూడా టీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.‘నీ ఇంటికి రూ.4కోట్లు, నీ కొడ్కు, నీ కూతురు, నీ అల్లుడు ఉన్న ఇళ్లకు రూ.3కోట్లతో మరమ్మతులు చేరుుంచినవ్.. పేదల ఇళ్లకు బిల్లులు చెల్లించవా?’ అని నిలదీ శారు. పూడికతీత పేరిట టీఆర్‌ఎస్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
టీడీపీతో ముప్పు అనే..
ప్రజలను ఏ సమయంలోనైనా ఏమార్చే తెలివి తనకు ఉందన్న ధీమా సీఎం కేసీఆర్‌కు ఉందని ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క ఎద్దేవా చేశారు. టీడీపీతో ముప్పు అని భావించిన కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మహబూబ్‌నగ ర్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు పదవులకు రాజీనామా చేయూలన్నారు. కేసీఆర్.. పేదల పాలిట దయ్యమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ, ఆంధ్రా వారికి వాటర్ గ్రిడ్ కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారనిప్రశ్నించారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎర్రబెల్లి, సీతక్కలకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నా యకులు ప్రతాప్‌రెడ్డి, అనిశెట్టి మురళీమనోహర్, దొమ్మాటి సాంబయ్య, గండ్ర సత్యానారాయణరావు, ఈగ మల్లేషం, మోహన్‌లాల్, గట్టు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.