Telugu Desam Legislature Party
-
టీడీపీఎల్పీ నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక
సాక్షి, అమరావతి: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో బుధవారం తెలుగుదేశం శాసనసభాపక్ష (టీడీఎల్పీ) భేటీ జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబునాయుడిని పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో పార్టీ నేతలు చర్చిస్తున్నారు. బాబు యూటర్న్.. శానసభలో తన నేత ఎంపికపై తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపక్షనేత పాత్రను పోషించేందుకు మొదట వెనుకడుగు వేసి వైరాగ్యాన్ని ప్రదర్శించినా తాజాగా దాన్ని వదులుకునేందుకు ఇష్టపడదని తెలిసింది. కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీపై పట్టుపోతుందని తానే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాలని బాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో పలువురు సీనియర్లు, నాయకులు మాత్రం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతిపక్ష నేతగా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు తీవ్ర మనో వేదనకు గురై తాను ప్రతిపక్ష బాధ్యతలు చేపట్టలేనని పార్టీ ముఖ్య నాయకుల వద్ద తన అశక్తతను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుండడం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి, మెజారిటీ ఎమ్మెల్యేలు తన కంటే చిన్నవయసు వారు కావడంతో అసెంబ్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, చివరకు ఈ విషయంలోనూ బాబు యూటర్న్ తీసుకున్నారని తాజా పరిణామాలు చాటుతున్నాయని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఉత్తమ ప్రదర్శన చంద్రబాబుదే...
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ తమ సభ్యుల పనితీరుపై తనకు తానే రేటింగ్స్, ర్యాంకింగ్స్ ఇవ్వడం నంది అవార్డులను తలపించింది. ప్రతిపక్షం లేకున్నా శాసనసభ ఘనంగా జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడానికి టీడీఎల్పీ స్వయంగా రంగంలోకి దిగింది. 11 రోజుల్లో ఏకంగా ఎనిమిది రోజులు చంద్రబాబు ఉత్తమ ప్రదర్శనకు ఎంపికయినట్టుగా ప్రకటించింది. ఇక మంత్రి నారా లోకేష్ రెండు రోజులు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు ఒక్కో రోజు ర్యాంకింగ్‌లు దక్కించుకున్నారు. శాఖల విషయానికి వస్తే దేవినేని ఉమ, ఆదినారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు అద్భుతమని టీడీఎల్పీ ప్రకటించింది. ఈ మేరకు టీడీఎల్పీ శుక్రవారం చంద్రబాబుకు ఈ నివేదిక సమర్పించింది. -
రమణ వర్సెస్ రేవంత్ రెడ్డి
-
‘రమణ తన పని తాను చూసుకుంటే మంచిది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఓవైపు సన్నాహాలు చేస్తుంటే...మరోవైపు ఎల్.రమణ మాత్రం పార్టీతో పాటు టీడీపీఎల్పీ కార్యక్రమాలేవీ నిర్వహించవద్దని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ’ టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎల్. రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది.’ అని హితవు పలికారు. అయితే రేవంత్ టీడీఎల్పీ సమావేశం ఉంటుందని ప్రకటన చేస్తే...ఎల్.రమణ అదే సమయంలో గోల్కొండ హోటల్లో టీడీపీ-బీజేపీ నేతల సమావేశం ఉంటుందని పోటీగా ప్రకటన చేయడం విశేషం. మరోవైపు ఎల్.రమణ ...పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రేవంత్ వర్సెస్ రమణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లూ కలసి పని చేసిన ఇద్దరు నేతల మధ్య విభేదాలు చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు ఒక్కసారిగా ఆ పార్టీని ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ కావడంతో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌ను మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ నిలదీయడంతో.. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వచ్చాక అన్ని విషయాలు వివరిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన ఏపీ టీడీపీ నేతల వ్యవహారంపై చేసిన ప్రకటనలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రులు, కొందరు నాయకులు వంగి సలాములు కొడుతున్నారంటూ రేవంత్ చేసిన విమర్శకు అటు నుంచి జవాబు లేకపోగా పొలిట్‌బ్యూరోలో తెలంగాణ నేతలతోనే చర్చకు పెట్టారు. కాంగ్రెస్ నేతలతో కలసినట్లు వస్తున్న వార్తలపై రేవంత్ వివరణ ఇవ్వాలని రమణ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్పీ నేత పదవుల్లో రేవంత్ కొనసాగితే పార్టీ కి నష్టమని చంద్రబాబుకు నివేదిక పంపా రు. చివరకు రేవంత్ పదవులు ఏవీ ఉండవని, కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతారని బుధవారం ప్రకటన విడుదల చేశారు. రేవంత్ ఎమ్మెల్యే మాత్రమే..: ఎల్.రమణ బుధవారం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు హాట్‌హాట్‌గా మారాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వ్యూహంపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం జరగాల్సి ఉంది. టీడీఎల్పీ నేతగా రేవంత్ ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు, ఎల్పీ నేత పోస్టుకు దూరంగా ఉండాలని కోరామని, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారని, ఈ మేరకు చంద్రబాబు తనకు ఫోన్లో సమాచారం ఇచ్చారని రమణ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో ఎల్పీ సమావేశం నిర్వహించాలని రేవంత్ నిర్ణయించగా, గోల్కొండ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశానికి రమణ ప్లాన్ చేశారు. రేవంత్ సమావేశానికి ఎవరూ వెళ్లకూడదని పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేగా గోల్కొండ హోటల్లో నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా రేవంత్‌కు ఆహ్వానం పంపామని రమణ చెప్పారు. తన పని చూసుకుంటే మంచిది: రేవంత్ మరోవైపు గోల్కొండ హోటల్లో జరిగే భేటీ గురించి తనకు తెలియదని, ఎలాంటి ఆహ్వా నం అందలేదని రేవంత్ స్పష్టం చేశారు. ‘టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది’ అని రేవంత్ హితవు పలికారు. చంద్రబాబు తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తి లేదని రేవంత్ నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. -
ఎర్రబెల్లి బృందం విలీనం చెల్లదు
► దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం: రేవంత్‌రెడ్డి ► ఎమ్మెల్యేలందరూ పార్టీ మారితేనే విలీనమని వ్యాఖ్య ► టీడీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి ► పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు ఇచ్చిన లేఖ చెల్లదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా సమావేశమై తీర్మానం చేసి.. పార్టీని మొత్తంగా విలీనం చేయాలని, శాసన సభాపక్షం ఒక్కటే కాదని చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఎర్రబెల్లి స్థానంలో టీడీఎల్పీ నేతగా నియమితుడైన రేవంత్‌రెడ్డి... శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, వివేకానంద, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్ అందజేశారు. అనంతరం టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకుని శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని చెప్పారు. బాబుతో భేటీ.. అసెంబ్లీ కార్యదర్శిని కలవడానికి ముందు టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమై... అసెంబ్లీ స్పీకర్‌కు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన లేఖపై చర్చించారు. శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తున్నట్లు దయాకర్‌రావు లేఖ ఇవ్వడంపై మండిపడ్డారు. పార్టీని విలీనం చేసే హక్కు, అర్హత కేవలం అధ్యక్షుడికే ఉంటుందని... ఫ్లోర్‌లీడర్‌కు కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్పీకర్‌ను కలసి తాజాగా పార్టీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ అందజేయాలని నిర్ణయించారు. స్పీక ర్ అందుబాటులో లేనందున అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేవంత్‌తో పాటు మాగంటి గోపీనాథ్, గాంధీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్నాథ్ తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. -
ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్
హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయం ఎవరిదన్న విషయంపై ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి టీడీఎల్పీ కార్యాలయంలో రేవంత్ వర్గీయులు ఎర్రబెల్లి ఫొటోను తొలగించి తాళాలు వేశారు. కాగా టీడీఎల్పీ కార్యాలయం తమదేనంటూ ఎర్రబెల్లి వర్గీయులు కూడా తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. ఎర్రబెల్లి టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తెలంగాణ టీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. తెలంగాణ శాసనసభలో 15 మంది సభ్యుల బలమున్న టీడీపీ నుంచి మూడింటి రెండొంతుల మంది ఆ పార్టీని వీడారు. టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రేవంత్ రెడ్డిని నియమించారు. -
జిల్లాస్థాయిలో సమీక్షలేవి?
మంత్రులు, ఎమ్మెల్యేలకు బాబు క్లాస్ ♦ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం ♦ ఫిరాయింపులను ప్రోత్సహించాలని సూచన ♦ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఉండాలి సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించరాదని, జిల్లా నేతలతో మంత్రులు, స్థానిక నేతలతో ఎమ్మెల్యేలు సమన్వయంతో మెలగాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ గెలిచి అధికారం చేపట్టి 18 నెలలైనా మంత్రులు ఇంత వరకూ ఒక్కసారి కూడా జిల్లాస్థాయిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహించిన సందర్భాలు లేవని, కనీసం సమావేశాలు పెట్టే తీరిక లేకుండా పనిచేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీడీఎల్పీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. మంత్రులు తమ శాఖల పర్యవేక్షణలో విఫలమౌతున్నారని, పనితీరు బాగా లేదని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరి స్థితి బాగా లేకపోయినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి, అప్పులు తీసుకొచ్చి పథకాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నార న్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇం దుకు వచ్చే ఏడాది జనవరి రెండో తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. పథకాలపై పత్రికల్లో వ్యతి రేక వార్తలు వస్తున్నాయని, అందువల్ల పథకాలను పర్యవేక్షించాలన్నారు. తాను సోమవారం శాసనమండలి సమావేశానికి వెళితే పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్సీలతో ఆ సభ కళకళలాడుతోందన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం శాసనసభ కూడా ఇదే తరహా లో కళకళలాడాలన్నారు. మంత్రులు విజయవాడలో, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి సోమవారం అందుబాటులో ఉండాల న్నారు. స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, పార్టీకి ఉపయోగపడతారనుకునే ఇతర పార్టీల వారిని టీడీపీలో చేర్చాలన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేద్దాం
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారంలో తాము ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిలో లేమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం శాసనసభాపక్ష(టీడీఎల్పీ) సమావేశం గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందించిన వివరాల ప్రకారం... శుక్రవారం శాసనసభలో తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులు అర్పించే అంశాన్ని చేపడతారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడ్డుకుంటేవెంటనే వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తారు. అంబేడ్కర్ జయంతి వరకూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సీఎం వివరిస్తారు. అనంతరం కాల్‌మనీ వ్యవహారంపై చర్చిస్తారు. ‘‘పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై వచ్చిన ఆరోపణలకు ఆయా సభల్లో వారు సమాధానం చెప్పుకుంటారు. కాల్‌మనీ వ్యవహరం వెలుగులోకి వచ్చిన వెంటనే మహిళలను వేధించిన వారిపై నిర్భయ చట్టం ప్రయోగించాల్సిందిగా కలెక్టర్లు, పోలీసులను ఆదేశించాం. వడ్డీ పేరుతో ప్రజలను వేధించేవారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్య తీసుకోవాలని ఆదేశించాం. న్యాయ విచారణ జరిపిస్తున్నాం. బాక్సైట్ వ్యవహారంలో స్థానిక గిరిజనులు, ప్రజల మనోభావాల ప్రకారమే ముందుకు వెళతాం. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించి మీరు అందుకు ధీటుగా వ్యవహరించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సమయానుకూలంగా స్పందించాలి. అన్నీ సీఎం చెబితేనే చేద్దాం అనుకోవద్దు’’ అని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ర్టంలోని ప్రధాన రీచ్‌లలో ఉన్న ఇసుకను ఇకనుంచి టెండర్లు ఆహ్వానించి వేలం వేయనున్నట్లు బాబు చెప్పారు. త్వరలో దీనిపై విధానపరమైన ప్రకటన చేస్తామన్నారు. టీడీఎల్పీ శుక్రవారం మరోసారి సమావేశమై ప్రభుత్వ పథకాలపై చర్చించనుంది. -
ఎదురుదాడికి రంగం సిద్ధం!
హైదరాబాద్ : కాల్ మనీ కేసులో తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయినా అధికారం అడ్డం పెట్టుకుని, ప్రతిపక్షంపై ఎదురుదాడికి టీడీపీ సిద్ధం అవుతోంది. గురువారమిక్కడ సమావేశమైన టీడీఎల్పీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఆరోపణలు ఉన్న నేతలకు అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు పలువురు టీడీపీ పెద్దలు ధైర్యం నూరిపోసినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని, భయపడవద్దంటూ సూచించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఎదురుదాడికి దిగాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అలాగే సభలో అంబేద్కర్‌పై చర్చ తర్వాతే ఇతర అంశాలను చేపట్టనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ వివరాలను మీడియాకు లీక్ చేయొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. -
'ఏపీ ఎమ్మెల్యేలకు రాందేవ్ బాబా శిక్షణ'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై చర్చ చేపడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో బాక్సైట్, ఇసుక, జలవిధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. అయితే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 వరకే జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు యోగా శిక్షణ ఇవ్వటం లేదని యనమల స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే రామ్‌దేవ్ బాబా యోగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వ్యాట్, ఎక్సైజ్, మనీలాండరింగ్ బిల్లులు ప్రవేశపెడతామని యనమల రామకృష్ణుడు తెలిపారు. -
పరిహారం చెల్లింపులోనూ రాజకీయమా?
సీఎంపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ సీఎం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రైతు రుణాలను రూ.లక్ష వరకూ ఒకేసారి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులు ఆదివారం ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై 22వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్నామని చెప్పారు. -
'ప్రతి నెలా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే'
హైదరాబాద్: నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరగా.. ఎమ్మెల్యేలకు నేరుగా 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వలేనని ఆయన చెప్పారు. సోమవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సంక్షేమ పథకాల అమలు గురించి చంద్రబాబు ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానని చంద్రబాబు చెప్పారు. సర్వే ఆధారంగా వచ్చే నివేదికతో పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. పనితీరు మెరుగుపర్చుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. ఎమ్మెల్సీలకు కూడా నిధులు కేటాయించలేనని తెలిపారు. ఇదిలావుండగా ఇసుక పాలసీ విధానంలో అవకతవకలపై ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. -
ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కొందాం!
సాక్షి,హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రస్తావించనున్న అంశాలపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్సీపీ ప్రస్తావించే అంశాలకు ఎలా బదులివ్వాలనే దానిపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. కరువు పరిస్థితులు, గోదావరి పుష్కరాల్లో యాత్రికుల మరణం తదితర కీలక అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రస్తావించే అంశాలపై గట్టిగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలన్నారు. ఏయే అంశాలపై ఎవరెవరు మాట్లాడాలో నిర్ణయించారు. గోదావరి పుష్కరాల్లో భక్తుల మరణంపై సభలో చర్చకు వస్తే సీఎం హోదాలో సంప్రదాయం ప్రకారం తాను పుష్కరఘాట్‌లో స్నానమాచరించినట్లు వివరిస్తానని, పార్టీ ఎమ్మెల్యేలు దీన్నే తమ ప్రసంగాల్లో చెప్పాలని బాబు పేర్కొన్నారు.పుష్కరఘాట్‌లో స్నానం చేసి, ఆ తర్వాత వీఐపీ ఘాట్‌కు వెళ్లాల్సిందిగా తనకు ఒక స్వామీజీ చెప్పారని, అందుకనుగుణంగా తాను వ్యవహరించానని వెల్లడించారు. తాను స్నానం చేసిన ఘాట్ వద్ద కాకుండా చుట్టుపక్కల ఘాట్లలో భక్తులు మరణించారని గుర్తుచేశారు. తాను స్నానం చేస్తుంటే డాక్యుమెంటరీ చిత్రీకరణ జరగడం వల్లే పలువురు చనిపోయారని, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆ సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం శాసనసభా పక్ష(టీడీఎల్పీ) సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. అంతకు ముందు ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ దుర్ముహూర్తం ఉండడంతో 7.20 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో సోమవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరగనుంది. -
ఇళ్ల బిల్లులిచ్చేదాకా పోరాడుతాం
- సర్కారును అసెంబ్లీలో నిలదీస్తాం - పూడికల పేరిట టీఆర్ఎస్ దోపిడీ - టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు వరంగల్ : బడుగు, బలహీన వర్గాలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులిచ్చేంత వరకు పోరాడుతామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఇళ్ల బిల్లులు చెల్లించాలంటూ గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయం ఎదుట బుధవారం ఒక రోజు దీక్షా, ధర్నా చేపట్టారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సం ఘీభావం తెలిపినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఈ సందర్భంగా దయూకర్‌రావు మాట్లాడారు. 2 రోజుల్లో పెండింగ్ బిల్లులివ్వకుంటే అన్ని పార్టీ ల మద్దతుతో సర్కారును అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మాటలగారడీకి ప్రజలు మోసపోయూరని పేర్కొన్నారు. చివరకు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి కూడా టీఆర్ఎస్కే ఓటు వేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.‘నీ ఇంటికి రూ.4కోట్లు, నీ కొడ్కు, నీ కూతురు, నీ అల్లుడు ఉన్న ఇళ్లకు రూ.3కోట్లతో మరమ్మతులు చేరుుంచినవ్.. పేదల ఇళ్లకు బిల్లులు చెల్లించవా?’ అని నిలదీ శారు. పూడికతీత పేరిట టీఆర్ఎస్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీతో ముప్పు అనే.. ప్రజలను ఏ సమయంలోనైనా ఏమార్చే తెలివి తనకు ఉందన్న ధీమా సీఎం కేసీఆర్‌కు ఉందని ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క ఎద్దేవా చేశారు. టీడీపీతో ముప్పు అని భావించిన కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మహబూబ్‌నగ ర్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారు పదవులకు రాజీనామా చేయూలన్నారు. కేసీఆర్.. పేదల పాలిట దయ్యమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ, ఆంధ్రా వారికి వాటర్ గ్రిడ్ కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారనిప్రశ్నించారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎర్రబెల్లి, సీతక్కలకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నా యకులు ప్రతాప్‌రెడ్డి, అనిశెట్టి మురళీమనోహర్, దొమ్మాటి సాంబయ్య, గండ్ర సత్యానారాయణరావు, ఈగ మల్లేషం, మోహన్‌లాల్, గట్టు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎర్రబెల్లి’ నోరు అదుపులో పెట్టుకో..
కాజీపేట రూరల్ : టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్కుమార్యాదవ్ సూచించారు. హన్మకొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజ్కుమార్యూదవ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీఎల్పీ నేత దయూకర్‌రావు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేదిలేదని ఆయన దయూకర్‌రావును హెచ్చరించారు. డబ్బు కట్టలతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని టీడీపీ నాయకులు వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. ఏపీలో మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన డబ్బుకట్టల వ్యవహరంపై కూడా టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్, పార్టీ అధికార ప్రతినిధి షంషీర్బేగ్, సిటీ మైనార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ఖాన్, జిల్లా నాయకులు కంజుల రాజు, భరత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఆర్. కృష్ణయ్య దూరం!?
హైదరాబాద్: ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పార్టీ విప్ ధిక్కరించారా? ఎమ్మెల్సీ పోలింగ్‌కు దూరంగా ఉండబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయిన టీడీపీకి మరో శరాఘాతమే అవుతుంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీలో కమిటీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతితో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. అయితే బీసీ ఉద్యమనాయకుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన ఓటింగ్‌లో కూడా పాల్గొనబోరనే వార్తలు వినవస్తున్నాయి. ఎమ్మెల్యే కృష్ణయ్య మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునే క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ టీడీపీ విప్ జారీచేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. టీడీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కార్మికులకు, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించే హామీని మేడే రోజైనా నిలబెట్టుకుంటారేమోనని భావించినా, నిరాశే ఎదురైందన్నారు. రైతాంగాన్ని దగా చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్నారు. రబీలో రైతులు కరెంటు ఉపయోగిం చుకోకపోతే మిగిలిపోయిన విద్యుత్‌ను తన ఘనతగా చెప్పుకుంటున్నారని అన్నారు. లాభసాటి వ్యవసాయం గురించి తెలుసుకునేందుకు మంత్రి పోచారం బృందం ఇజ్రాయెల్ వెళ్లేకున్నా కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళితే ఎకరాకు కోటి రూపాయలు ఎలా సంపాదించాలో తెలిసేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం వెయ్యి కోట్లతో ఇళ్లు కట్టిస్తానని చెప్పడం సిగ్గుచేటని మాగంటి గోపీనాథ్ విమర్శించారు. -
స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. -
కాలువ శ్రీనివాసులుపై సభా హక్కుల నోటీసు
సాక్షి, హైదరాబాద్: శాసన సభలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన సమావేశాల దృశ్యాల క్లిప్పింగ్‌లను టీడీఎల్పీలో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చే సిన ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మంగళవారం ఉదయం పలువురు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నోటీసును వైఎస్సార్సీఎల్పీ ఉప నేత ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, పాముల పుష్ప శ్రీవాణి, ఆర్.కె.రోజా, డాక్టర్ సునీల్ కలసి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వద్దకు వెళ్లి నోటీసును అందజేశారు. కాలువ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని ప్రయోగించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. సభా కార్యక్రమాల దృశ్యాలను చీఫ్ విప్ ఏ నిబంధనల కింద విడుదల చేశారో కూడా తెలియదని, అందువల్ల ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తున్నామని అందులో వివరించారు. మంత్రులపై నోటీసులు శాసన సభలో పలు అంశాలపై చర్చ జరుగుతుండగా జోక్యం చేసుకుని తమ పార్టీ సభ్యులపై అసందర్భమైన, అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని వాడుతున్న మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీరు అభ్యంతరకరమైన హావభావాలను ప్రదర్శిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించే విధంగా సభలో మాట్లాడుతున్నారని స్పీకర్‌కు ఇచ్చిన వేర్వేరు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ శివప్రసాద్‌రావుకు ఈ నోటీసులను అందజేశారు. శాసన సభ్యులు కూడా కాని, మరణించిన వ్యక్తులపై కూడా అభ్యంతరకర పదజాలాన్ని వినియోగిస్తున్నారని, ఇది సభా నిబంధనలకు విరుద్ధమని వివరించారు. వారు చేసిన వ్యాఖ్యల నిర్థారణ కోసం అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని కోరారు. -
ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేను:చంద్రబాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కొరత చాలా ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేనని బాబు తేల్చి చెప్పేశారు. సోమవారం ఏపీ టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిధులు కొరతపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నందున.. తాను ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన నిధులను ఇవ్వలేనన్నారు. ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలుంటే తనను కలవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీటీడీ లెటర్లు ఇష్టానుసారం ఇవ్వొద్దని.. దాని వల్ల ఇబ్బందులు పడతారని ఎమ్మెల్యేలకు బాబు సూచించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దన్నారు. ప్రతి కార్యాలయంలో సంక్షేమ పథకాల పోస్టర్లపై సీఎం ఫోటో ఉండేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. -
రూ.100 కోట్లు ఇస్తే.. వంద సంవత్సరాలు ఖాయం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధకరమని బాబు మరోసారి పేర్కొన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన ఏపీ టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు ఇచ్చారని.. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతినివ్వాలని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అడిగితే.. కేంద్రం రూ.100 కోట్లు కేటాయించదన్నారు.ఆ మొత్తంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుందని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సంవత్సరం 30 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ వ్యవసాయంలో మంచి ప్రగతి సాధించమన్నారు. మిగులు జలాలను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామన్నారు. -
సాయంత్రం టీడీఎల్పీ సమావేశం
-
సాయంత్రం 4గంటలకు టీడీఎల్పీ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం శాసన సభాపక్షం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగా ఈనెల 5వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ టీడీపీ నాయకులు నిన్న సాయంత్రం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహాంపై అధినేతతో చర్చించారు. ప్రజా సమస్యలతో పాటు రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, కరెంట్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు వారికి సూచించినట్లు సమాచారం. -
ఇష్టం వచ్చిన సలహాలివ్వొద్దు:చంద్రబాబు
-
ఇష్టం వచ్చిన సలహాలివ్వొద్దు:చంద్రబాబు
* టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు * ఇష్టారీతిన వ్యవహరిస్తే మీరు, నేను ఉండం * మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మారకుంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తా * టీడీపీకి హత్యా రాజకీయాల చరిత్ర లేదు * ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ ఆ అంశాన్ని సభలో ప్రస్తావించింది * సభలో తొలిరోజు వైఎస్సార్ సీపీని సమర్థంగా ఎదుర్కోలేకపోయూం * రుణ మాఫీకి ఒకటిన్నర నుంచి రెండు నెలలు పట్టవచ్చు సాక్షి, హైదరాబాద్: ‘‘నేను వింటున్నాను కదా అని ఇష్టం వచ్చిన సలహాలు ఇవ్వకండి. మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మీరు ఉండరు. నేనూ ఉండను. జాగ్రత్తగా పనిచేయండి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెలుగుదేశం శాసన సభాపక్షం (టీడీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఈ సమావేశం అసెంబ్లీ లాంజ్‌లో చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటలపాటు జరిగింది. అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగుల పింఛన్లను కార్యకర్తల ద్వారా అందిద్దామని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. నేను వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు సలహాలు ఇవ్వొద్దని స్పష్టంచేస్తూ పై వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పింఛన్లు, మొదలైన వాటిని పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వ ఉద్యోగికి అప్పగిద్దామని చంద్రబాబు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందజేసిన సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లు, వివిధ అంశాలపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లోని వివరాలు, తెలంగాణ సీఎం కె. చంద్ర శేఖర్‌రావుతో ఆదివారం జరిగిన చర్చల వివరాలను బాబు సుదీర్ఘంగా వివరించారు. పనితీరును బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇస్తానన్నారు. కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులందరి పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నానని, కొందరికి 12 నుంచి 38 శాతం మాత్రమే మార్కులు వచ్చాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మారకుంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని హెచ్చరించారు. గతంలో అధికారుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని, అప్పట్లో పనిచేసిన అధికారులు ఆ తరువాత కనపడటం కూడా మానేశారని, కొందరు మొహం పక్కకు తిప్పుకుని వెళ్లారని చెప్పారు. అందువల్లే ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ కూడా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన కూడా సహకారం అందించే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా అన్నారని చెప్పారు. టీడీపీకి హత్యా రాజకీయాల చరిత్ర లేదని చెప్పారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ శాసన సభలో ఆ అంశాన్ని ప్రస్తావించిందన్నారు. అయినా జగన్మోహన్రెడ్డికి సభలో మైక్ ఇవ్వటం మన వ్యూహ లోపమని అన్నారు. సభలో తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమర్థ్ధంగా అడ్డుకోలేకపోయామని, ఇక ముందు అలా కాకుండా చూసుకోవాలని చెప్పారు. రుణ మాఫీకి ఒకటిన్నర నుంచి రెండు నెలలు సమ యం పట్టే అవకాశముందని తెలిపారు. శాంతిభద్రతలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత: కాలువ శ్రీనివాసులు ప్రభుత్వానికి శాంతి భద్రతలే తొలి ప్రాధాన్యత అని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు టీడీఎల్పీ భేటీ తరువాత మీడియాకు చెప్పారు. సోమవారం శాసన సభలో వైఎస్సార్ సీపీ పక్ష నేత జగన్మోహన్రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును టీడీఎల్పీ సమావేశం ఖండించిందని తెలిపారు. -
టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. అలాగే, శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నాయకుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్లయింది. ఇక అసెంబ్లీలోడిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను ఎంపిక చేశారు. శాసన మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా అరికెల నర్సారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో విప్‌గా సండ్ర వెంకట వీరయ్యను నియమించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను మాత్రం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థాయితోనే చంద్రబాబు సరిపెట్టేశారు. ముందునుంచి తెలంగాణ టీడీపీ ఫోరం ఛైర్మన్‌గా వ్యవహరించిన ఎర్రబెల్లికే టీ-టీడీఎల్పీ పీఠాన్ని కట్టబెట్టారు. -
గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు
-
టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించే అవకాశమున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగే పార్టీ సమావేశంలో ఈ మేరకు అధినేత చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా ఎన్నికైన ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమ సమయంలో టీటీడీపీ ఫోరం కన్వీనర్‌గా కీలకంగా వ్యవహరించారు. ఆయన పనితీరును మెచ్చిన బాబు అసెంబ్లీలో పార్టీ పగ్గాలను ఆయనకే అప్పగించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తానని ఎన్నికల సమయంలో బాబు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాకపోయినా 15 సీట్లను సాధించినందున తనను పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగానైనా నియమిస్తారని కృష్ణయ్య ఆశించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎదుర్కొనాలంటే ఎర్రబెల్లి వంటి వాగ్ధాటి గల నాయకుడు అవసరమని బాబు అభిప్రాయపడుతున్నారు. పార్టీ విప్‌గా కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తారని సమాచారం. కాగా, బీసీ నాయకుడిగా నాలుగుసార్లు గెలిచిన తనకు టీడీఎల్పీ పదవి దక్కుతుందని ఆశించిన సనత్‌నగర్ ఎమ్మెల్యే, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. గ్రేటర్లో పార్టీ అత్యధికంగా 9 సీట్లు గెలుచుకోవడంలో తమ పాత్రను బాబు గుర్తించలేదని ఆయన వర్గీయులు విమర్శిస్తున్నారు. తలసానితో పాటు ఆర్.కృష్ణయ్య (ఎల్.బి.నగర్), ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి)లను టీడీఎల్పీ ఉప నాయకులుగా నియమించే అవాకశముంది. -
గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికపై టీడీపీ నేతలు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తీర్మానం పత్రిని వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు అందచేశారు. అనంతరం టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాల్సిదిగా గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈనెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్‌కు తెలిపామన్నారు. ప్రమాణ స్వీకారం వివరాలు పంపాలని గవర్నర్ కోరారన్నారు. కాగా గవర్నర్‌ను కలిసినవారిలో ధూళిపాళ్ల నరేంద్ర, కేఈ కృష్ణమూర్తి, మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. -
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎంపిక
-
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: టీడీపీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) ప్రతిపాదించగా పీతల సుజాత (చింతలపూడి), పతివాడ నారాయణస్వామి నాయుడు (నెల్లిమర్ల), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం) బలపరిచారు. బాబు టీడీఎల్పీ నేతగా ఎన్నిక కావటం ఇది వరుసగా అయిదోసారి. చంద్రబాబు తన విద్యార్థి రాజకీయాలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభించారు. అదే విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సెనెట్ హాల్లో బుధవారం రాత్రి సమావేశమైన టీడీఎల్పీ తమ నేతగా చంద్రబాబును ఎన్నుకుంది. ఈ ఎన్నిక ద్వారా ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1995 నుంచి చంద్రబాబు వరుసగా టీడీఎల్పీ నేతగా ఎన్నికవుతూ వస్తున్నారు. గత నాలుగు విడతలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని టీడీఎల్పీకి నేతగా ఎన్నికవగా, ఈసారి 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. కొద్దిసేపు పద్మావతి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకున్న ఆయన నేరుగా సెనెట్ హాల్‌కు చేరకుని టీడీఎల్పీ భేటీలో పాల్గొన్నారు. నేతగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇచ్చారు. బాబు రాత్రికి తిరుమలలో బస చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు తిరిగివస్తారు. ఎన్టీఆర్‌కు నివాళి వర్సిటీలోని సెనెట్ హాల్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, కాార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు అక్కడ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేఈ కృష్ణమూర్తి, పతివాడ నారాయణస్వామి, నందమూరి బాలకృష్ణలను సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వేదికపైకి ఆహ్వానించారు. ఆ వెంటనే టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ కేఈ కృష్ణమూర్తి తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ్యులంతా క రతాళ ధ్వనులతో బలపరిచారు. ఎమ్మెల్యేలంతా నిలబడి చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఈ ఎన్నిక కేవలం రాజ్యాంగ పరమైన కార్యక్రమమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న ఘనత చంద్రబాబుదని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆశాదీపంగా బాబును అభివర్ణించారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పీతల సుజాత మాట్లాడుతూ.. చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నరేంద్ర ప్రకటించారు. ఎమ్మెల్యేలు చంద్రబాబుకు శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కొందరు పాదాభివందనం సైతం చేశారు. అభివృద్ధి చేస్తారని గెలిపించారు: యనమల ఇది మరువలేనటువంటి రోజని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తన అభినందన ప్రసంగంలో అన్నారు. ‘మన నాయకుడు చేసిన కృషి మరువలేనిది. పది సంవత్సరాలు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. మనందరికీ నాయకత్వ లక్షణాలు నేర్పింది ఆయనే. చంద్రబాబు అభివృద్ధి చేయగలరనే నమ్మకం ప్రజల్లో ఉండటం వల్లే తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది’ అని అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిన చంద్రబాబు అక్కడే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావటం విశేషమన్నారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసి చంద్రబాబును అధికారంలోకి తెచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు పరిచి, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి), సిద్ధా రాఘవరావు (దర్శి), కోడెల శివప్రసాదరావు (సత్తెనపల్లి), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం), ముడియం శ్రీనివాస్ (పోలవరం), రావెల కి షోర్ బాబు (ప్రత్తిపాడు), వెంకటరమణ (తిరుపతి), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), గొల్లపల్లి సూర్యారావు (రాజోలు), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు),వర్మ (పిఠాపురం), పల్లె రఘునాధరెడ్డి (పుట్టపర్తి), ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ.. చంద్రబాబు నాయుడి కృషి అమోఘమంటూ అభినందనలతో ముంచెత్తారు. పార్టీని గెలిపించిన చంద్రబాబుకు, టీడీపీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధూళిపాళ్ల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు: బాలకృష్ణ
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష(టీడీఎల్పీ) నేతగా చంద్రబాబునాయుడు ని ఎన్నుకోవడం శుభప్రదం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీఎల్సీ నేతగా ఎంపికైన చంద్రబాబుపై బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనాదక్షుడు అని బాలకృష్ణ అన్నారు. అభివృద్ది చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడికి ఉందని బాలకృష్ణ అన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును ఆపార్టీ సీనియర్ నేత కృష్ణమూర్తి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు బలపరిచారు. -
కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం కాసేపట్లో జరగనుంది. తిరుపతిలో బుధవారం రాత్రి జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబు ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ నెల 8న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
నేడు తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం
-
నేడు టీడీఎల్పీ నేత ఎన్నిక
- ముస్తాబైన ఎస్వీయూ ప్రాంగణం - పోలీసుల ఆధీనంలో వర్సిటీ - ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ బాలకృష్ణ సాక్షి, తిరుపతి: టీడీఎల్పీ నేత ఎన్నికకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియం ముస్తాబవుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును బుధవారం రాత్రి ఏడు గంటలకు ఇక్కడ జరిగే సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు పర్యవేక్షిస్తున్నారు. సమావేశ మందిరాన్ని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఆడిటోరియం పరిసరాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్వీ.రాజశేఖర్‌బాబు పర్యవేక్షిస్తున్నారు. అందంగా ముస్తాబవుతున్న వేదిక టీడీఎల్పీ నేత ఎన్నికకు యూనివర్సిటీ ప్రాంగణాన్ని అరటి తోరణాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ ఆర్చి నుంచి సమావేశ మందిరం వరకు తోరణాలు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో పాత కుర్చీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో టీడీపీ శ్రేణులు స్వాగత ఫ్లెక్లీలు ఏర్పాటు చేస్తున్నాయి. టీడీఎల్పీ సమావేశం వేదికను పదేపదే మార్చడంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు. తొలుత యూనివర్సిటీ సెనేట్ హాల్ లేదా మహతి ఆడిటోరియంను పరిశీలించారు. ఆ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి అతిథిగృహం సమావేశ మందిరంలోనూ ఏర్పాట్లు ప్రారంభించారు. చివ రకు సోమవారం రాత్రికి ఎస్వీయూ ఆడిటోరియంను వేదికగా నిర్ణయించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు రాక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ఒక స్టార్ హోటల్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీఎల్పీ సమావేశం రాజకీయ కార్యక్రమం కావడంతో విమర్శలు రాకుండా స్టార్ హోటల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయమే తిరుపతికి చేరుకుని అవకాశం ఉండడంతో వారి కోసం వివిధ హోటళ్లలో గదులు రిజర్వు చేశారు. సమావేశం తర్వాత వారికి అక్కడే భోజన సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యేల వసతి సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ చూస్తున్నారు. సమావేశం ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు చూస్తున్నారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ సత్యవేలురెడ్డి, ప్రొఫెసర్ ఎం.సురేష్‌బాబు, యూనివర్సిటీ ఇంజనీరు అజయ్‌బాబు తదితరులు సహ కరించారు. -
నేడు తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం రాత్రి 7గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక కానున్నారు. పార్టీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, టీడీఎల్పీ సమావేశం హైదరాబాద్‌కు వెలుపల జరగడం ఇదే తొలిసారి. -
4న తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) సమావేశం జూన్ నాలుగో తేదీన తిరుపతిలో జరగనుంది. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని సెనేట్‌హాల్ లేదా ఆడిటోరియంలో సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. -
అసెంబ్లీ లాబీలో నటుడు వేణుమాధవ్
హైదరాబాద్ : హాస్యనటుడు వేణుమాధవ్ బుధవారం అసెంబ్లీ లాబీలో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన్ని విలేకర్లు పలకరించగా గతంలో తాను టీడీఎల్పీలో ఉద్యోగిగా పని చేశానని... ప్రస్తుతం షూటింగ్ లేకపోవటంతో నేతలను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలను వేణుమాధవ్ కలిశాడు. కాగా వేణు మాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. ఓ సందర్భంలో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్రావు టాకింగ్ డాల్లో ప్రోగ్రామ్ చేసిన అతడిని భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అలా ఎన్టీఆర్ మహానాడులో వేణుమాధవ్ ప్రదర్శన ఇవ్వటం జరిగింది. అది ఎన్టీఆర్‌కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్‌ను హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు.