హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయం ఎవరిదన్న విషయంపై ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి టీడీఎల్పీ కార్యాలయంలో రేవంత్ వర్గీయులు ఎర్రబెల్లి ఫొటోను తొలగించి తాళాలు వేశారు. కాగా టీడీఎల్పీ కార్యాలయం తమదేనంటూ ఎర్రబెల్లి వర్గీయులు కూడా తాళాలు వేసేందుకు ప్రయత్నించారు.
ఎర్రబెల్లి టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తెలంగాణ టీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. తెలంగాణ శాసనసభలో 15 మంది సభ్యుల బలమున్న టీడీపీ నుంచి మూడింటి రెండొంతుల మంది ఆ పార్టీని వీడారు. టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఎర్రబెల్లి పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రేవంత్ రెడ్డిని నియమించారు.
ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్
Published Fri, Feb 12 2016 12:53 PM | Last Updated on Fri, Aug 10 2018 7:50 PM
Advertisement
Advertisement