టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారంలో తాము ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిలో లేమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం శాసనసభాపక్ష(టీడీఎల్పీ) సమావేశం గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందించిన వివరాల ప్రకారం... శుక్రవారం శాసనసభలో తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులు అర్పించే అంశాన్ని చేపడతారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు అడ్డుకుంటేవెంటనే వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తారు. అంబేడ్కర్ జయంతి వరకూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సీఎం వివరిస్తారు. అనంతరం కాల్‌మనీ వ్యవహారంపై చర్చిస్తారు.
‘‘పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై వచ్చిన ఆరోపణలకు ఆయా సభల్లో వారు సమాధానం చెప్పుకుంటారు. కాల్‌మనీ వ్యవహరం వెలుగులోకి వచ్చిన వెంటనే మహిళలను వేధించిన వారిపై నిర్భయ చట్టం ప్రయోగించాల్సిందిగా కలెక్టర్లు, పోలీసులను ఆదేశించాం. వడ్డీ పేరుతో ప్రజలను వేధించేవారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్య తీసుకోవాలని ఆదేశించాం. న్యాయ విచారణ జరిపిస్తున్నాం. బాక్సైట్ వ్యవహారంలో స్థానిక గిరిజనులు, ప్రజల మనోభావాల ప్రకారమే ముందుకు వెళతాం. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించి మీరు అందుకు ధీటుగా వ్యవహరించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సమయానుకూలంగా స్పందించాలి. అన్నీ సీఎం చెబితేనే చేద్దాం అనుకోవద్దు’’ అని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ర్టంలోని ప్రధాన రీచ్‌లలో ఉన్న ఇసుకను ఇకనుంచి టెండర్లు ఆహ్వానించి వేలం వేయనున్నట్లు బాబు చెప్పారు. త్వరలో దీనిపై విధానపరమైన ప్రకటన చేస్తామన్నారు. టీడీఎల్పీ శుక్రవారం మరోసారి సమావేశమై ప్రభుత్వ పథకాలపై చర్చించనుంది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేద్దాం
Published Fri, Dec 18 2015 3:47 AM | Last Updated on Sat, Aug 11 2018 4:22 PM
Advertisement