గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.ఏకాదశి రా.11.38 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: స్వాతి సా.5.47 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: రా.11.56 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.13 నుండి 11.01 వరకు, తదుపరి ప.2.38 నుండి 3.26 వరకు, అమృతఘడియలు: ఉ.7.55 నుండి 9.41 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.32, సూర్యాస్తమయం: 5.28.
మేషం...కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.
వృషభం....మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
మిథునం....వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం.
కర్కాటకం....బంధువులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం.
సింహం....కొత్త విషయాలు లె లుసుకుంటారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
కన్య.....ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ప్రయాణాలు వాయిదా. పనులు నిదానంగా సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.
తుల.....వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
వృశ్చికం....వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.
ధనుస్సు...మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం.....ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం....వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగులకు గందరగోళం.
మీనం...ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.
Comments
Please login to add a commentAdd a comment